నం’దమ్మూ’రి!

May 20, 2012
నం’దమ్మూ’రి!

పేరు : నందమూరి తారక రామారావు( జూనియర్‌) దరఖాస్తు చేయు ఉద్యోగం: వారసుడు (సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా) ముద్దు పేర్లు : కుర్ర తాత( తాత ఎన్టీఆర్‌ మనవడి ఎన్టీఆర్‌ను -తాతా- అని పిలిచేవాడు లెండి), జూనియర్‌( సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ 'సీనియారిటీ' అన్ని వేళలా నిలవదు. బాబాయ్‌లు అబ్బాయ్‌ లు కావచ్చు, అబ్బాయ్‌లు బాబాయ్‌లు కావచ్చు.) తాతకు తగ్గ మనవడు. నం'దమ్మూ'రి!

Read more »

నవ్వు వెనక ఏడుపు!

May 19, 2012
నవ్వు వెనక ఏడుపు!

నవ్వూ మందే. ఇది తెలిసి పోయాక, పార్కుల్లో పువ్వులు బదులు, నవ్వులు పూసేస్తున్నాయి. చెట్లు కాదు, చెట్లంతంటి మనుషులు నవ్వేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే, గుమిగూడి ఏడ్చినంత బిగ్గరగా గుండెలు పగిలేలా నవ్వేస్తున్నారు. ఇంకా చీకట్లు విడిపోకుండా, తెల్లవారకుండానే, క్రోటన్‌ పొదల మాటను తెల్లని దుస్తులతో, నిలబడి నవ్వుతుంటే, విఠలాచార్య తీసిన పాత సినిమాల్లో 'కామెడీ దయ్యాలు' నవ్వినంత విలాసంగా నవ్వేస్తున్నారు. చెమటోడ్చి, దిక్కులు పిక్కటిల్లేలా నవ్వేస్తున్నారు.

Read more »

వలసలే భయం -ఉప ఎన్నికలు నయం

May 19, 2012
వలసలే భయం -ఉప ఎన్నికలు నయం

ఎన్నికలంటే ఏమిటి? హామీలూ, వరాలూ, తిట్లూ, శాపనార్థాలూ - ఇవి కదా! కానీ, కేసులూ, ఖాతాల స్తంభనలూ, ఆస్తుల జప్తులూ, అరెస్టులూ... ఇవేమిటి? ఎన్నికలప్పుడు- పలు అధికారాలు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్‌(ఇసి) కొచ్చేస్తాయి. అందుచేత ఈ వేళల్లో ఆ సంస్థే తీర్పరిగా వుంటుంది. కానీ ఇప్పుటి (18 అసెంబ్లీ స్థానాల) ఉప ఎన్నికలు చూడండి. హడావిడి 'ఇసి' కాదు. అంతా 'సిబిఐ' దే.

Read more »

‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

May 15, 2012
‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే 'ఆకులు' పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు 'విడాకులు' లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే 'పూలు' పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్‌) 'గులాబీ' ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) 'కమలం'. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన 'జేయేసీ' కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది....

Read more »

‘తిరం’జీవి

May 13, 2012
‘తిరం’జీవి

పేరు : చిరంజీవి దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర మంత్రి (గతంలో మా సామాజిక వర్గానికి చెందిన సినీ దర్శకుడికచ్చారే అలా..) ముద్దు పేర్లు : ఆటు పోట్లకు వీలుగా రెండు పేర్లున్నాయి. హిట్టయితే 'మెగా', ఫ్లాపయితే 'చిరు'(సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఇవే ముద్దు పేర్లు). తిరుపతిలో పోటీ చేసి గెలిచినప్పుడు మాత్రం కొందరు- 'ఆహా! 'తిర'ంజీవి అన్నారు. ఇప్పుడా సీటు పోతే పత్రికల వాళ్ళు - కాంగ్రెస్‌ కు 'తిరు' క్షవరం అని హెడ్‌లైన్లు పెట్టరు. 'చిరు' క్షవరం అంటారు... అదీ నాబెంగ

Read more »