అగ్రకులాంతర వివాహాలు!

alekhya reddy

పేద వాళ్ళకిచ్చిన పిలుపుల్ని ఒక్కొక్క సారి సంపన్నులు స్వీకరించేస్తారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ- అన్నది కుచేలుర కోసం పెట్టింది. దానిని కుబేరులు పాటించేశారు. వెయ్యి కోట్ల ఆస్తి వున్నవాడికి ఒక్కడే కొడుకనుకోండి. వెయ్యి కోట్లూ వాడికే వెళ్ళిపోతాయి. పది మంది పిల్లలుంటే, ఒక్కొక్కడూ వందకోట్లకు పడి పోతాడు. అందుకని సంపన్నుల్లో ఎక్కువమందికి పరిమిత కుటుంబాలే వున్నాయి. అలాగే ‘కులాంతర వివాహాల్ని’ ప్రోత్సహించాలని రాజ్యాంగ కర్తలు ఎంతగానో తపన పడ్డారు. దీనికి సామాన్యులు కాకుండా అసమాన్యులూ, సంపన్నులూ, ప్రసిధ్ధులూ పాటించేస్తున్నారు. ఈ మధ్య రహస్యంగా ఎన్టీఆర్‌ మనవడు తారక రత్న, అలేఖ్య రెడ్డిని చేసుకున్నాడు. ఆ మధ్య చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌, అపోలో హాస్పటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప రెడ్డి మనుమరాలు ఉపాసనను పెళ్ళాడాడు. అంతకు ముందు మోహన్‌ బాబు కొడుకు విష్ణు, వెరోనికా రెడ్డిని పరిణయమాడాడు. రాజకీయంగానూ, పారిశ్రామికంగానూ అగ్రభాగాన వున్న వారే ఈ ‘ఆదర్శాన్ని’ పాటిస్తున్నారు. కానీ మధ్యతరగతి వారు సరసమైన కట్నానికి సాటి కులస్తుడు దొరికే వరకూ ఎదురు చూస్తున్నాడు. ‘ఆదర్శం’ కూడా ఖరీదయినదే. అది సంపన్నులకే అందుబాటులో వుంటోంది.

 

3 comments for “అగ్రకులాంతర వివాహాలు!

Comments are closed.