తన్నులెన్ను వారు, తమ తన్నులెరుగరు

(ఇరవయ్యేళ్ళ క్రితం నాటి మాట. ఒక ప్రముఖ దినపత్రికకు చీఫ్ రిపోర్టర్ గా వుంటూ, వుంటూ అలిగి, రాజీనామా చేసి, రాజమండ్రి వచ్చి ‘కోస్తావాణి’ అనే ఒక ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా చేరిపోయాను. పాపం… నా కోసమే అన్నట్టు ఈ పత్రికను స్థాపించి, ఒక మార్గంలో పెట్టి, ఆ పోస్టును ఖాళీ చేసి వెళ్ళారు సీనియర్ పాత్రికేయులు కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు. సరదాగా కొన్ని కాలమ్స్ ప్రవేశ పెట్టాను. కొన్ని నేనే రాశాను. వాటిలో ఒకటి. ‘గురూజీ? వాట్ శిష్యా’.ఇప్పటి రాజకీయాలను విశ్లేషించటానికి మళ్ళీ రాస్తున్నాను… ఇలా …)

దానం కేరికేచర్

‘గురూజీ?’
‘వాట్ శిష్యా!’

‘కాంగ్రెస్ నేత దాపం నాగేందర్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారట?’
‘అవును శిష్యా!

‘అంతకు ముందు టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు కదా గురూజీ..?
‘అవును శిష్యా! అప్పడు తెలంగాణ కు వ్యతిరేకంగా వ్యవహరించాడని ఎస్సీ ఉద్యోగి మీద హరీష్ రావు దాడి చేస్తే అయితే, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఎస్సీ యువకునిపై దానం దాడి చేశారు’

‘తెలంగాణకు వ్యతిరేకంగా వెళ్ళినా, అనుకూలంగా వచ్చినా తన్నేది ఎస్సీలనేనా గురూజీ?’
‘నాకు తెలియుదు శిష్యా!
-సతీష్ చందర్

4 comments for “తన్నులెన్ను వారు, తమ తన్నులెరుగరు

Leave a Reply