నానుంచి నేను

ఎక్కడెక్కడికో కదలిపోతుంటాం. పోటెత్తి ప్రవహిస్తూ వుంటాం. సముద్రంలో కలసిపోతుంటాం. సూర్యుడి వెచ్చని కౌగలింతకు ఆవిరయి పోతూ వుంటాం. మేఘాలయి గర్జిస్తుంటాం. కాని పిల్లగాలికే పులకించి పోతుంటాం. నిలువెల్లకరిగి వర్షిస్తుంటాం. ప్రవాహంలో నేనొక బిందువూ. నీవొక బిందువూ. కాస్సేపు వేరు వేరుగా. కాస్సేపు సమూహంగా. మధ్యలో వచ్చి పోయే చావు పుట్టుకలు కమర్షియల్‌ బ్రేకులు.

Photo By: Obakeneko

నా కోరికే

నా భవిత

 

రేపటి కోసమే

అన్నీ దాచిపెడతాను

 

కొంచెం ప్రేమ

కాస్త ఆస్తి

గుప్పెడు అనుభవం

 

అన్నీ మూట గట్టి

కాల ప్రవాహంలో వదిలేస్తున్నా

 

నా బిడ్డగా

నేను పునర్జన్మించాక

అందుకునేది

నేనేగా!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)

 

 

Leave a Reply