నిన్నకు ముందు

గతంలో బతికే భూత జీవులూ, రేపటికి వాయిదా వేసే దూరాశా జీవులూ ఏం చేస్తారో తెలియదు కానీ, ఆ పేరు మీదు వర్తమానాన్ని వదిలేసుకుంటారు. కళ్ళ ముందే బస్సులు వచ్చి వెళ్ళిపోతున్నా, ఎక్కకుండా చోద్యం చూస్తారు. రూపాయికే కాదు.క్షణానికి కూడా మారపు రేటు వుంటుంది. కేవలం వర్తమానంలో బతికే వాడికే ఆ రేటు పెరుగుతుంటుంది. మిగతా వాళ్ళకి దారుణంగా పడిపోతుంటుంది.

నిన్నకు నిన్న వుంది
రేపటికి రేపు వుంది

నా జననానికి ముందు రోజూ
నా మృత్యువుకు తర్వాత రోజూ
నాకు లేవు.

నిరంతర వర్తమానమే జీవితం

సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

Leave a Reply