పగటి కల!

(భ్రమ కూడా వరమే. లేనిది వున్నట్లు, ఉన్నది లేనట్లు- ఈ కనికట్టు చాలు ఈ క్షణాన్ని దాటెయ్యటానికి. భ్రమ తేలిక పరుస్తుంది. తింటున్న పాప్ కార్న్ సాక్షిగా చూస్తున్నది సినిమా అని తెలుసు.. అయినా ఏమిటా కన్నీళ్ళు? భ్రమ. నీరు, నేలయినట్లూ, నేల నీరయినట్లూ.. అహో! ఏమిదీ..? మయుడి కల్పన. ఒక భ్రమ. పాంచాలిని పకపకా నవ్వించిన భ్రమ. ఏడిపించాలన్నే భ్రమే.నవ్వించాలన్నా భ్రమే. సుయోధనుణ్ణి కయ్యానికి కాలు దువ్వించాలన్నా భ్రమే. నా ప్రియురాలంటే నాకెందుకు అంత ఇష్టమో తెలుసా..? నాకు ఎప్పటికప్పుడు గుప్పెడు భ్రమనిచ్చి వెళ్ళిపోతుంది..)

photo by antkriz


దేవుడంటూ
వుంటే,
ఆయనకీ
ఓ ఫోనంటూ వుంటే
పంట
వెయ్యాలా, వద్దా-
అని మనం
తటపటాయిస్తుంటే
‘హలో! నేనున్నాలే’
అని ఆయనంటే..!?
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రికలో ప్రచురితం)

6 comments for “పగటి కల!

 1. sailajamithra
  October 22, 2011 at 6:20 pm

  ఇలాంటి భ్రమ బావుంటుంది సర్. చాల బావుంది

 2. raja
  October 23, 2011 at 11:58 pm

  really kol kind f illusions sir n lst main hoon na thing is gud

 3. karunakar
  October 25, 2011 at 11:54 am

  ya that was real dream for a common man

 4. Mohd.Sharfuddin
  June 18, 2012 at 5:30 pm

  Avnu Sir Chala Bagunttundi Elaanti Brhama

 5. APARNA KOTHAPALLI
  July 3, 2012 at 5:32 pm

  pramadam leni bhramalu, hai ni isthai., seda theerusthai, jo kodathai manasuluni kaluputhai, bandhalanu penchuthai. 2.) devudike phone unnna dorakadu. endu kante adi epudu engage ai untundi, dabbulunna vari calls. ayana pedavallaki andubatulo undadu. mee pagati kala bavundi, nijamaithe bagundu.

 6. uday kiran
  November 10, 2012 at 7:21 pm

  నేనూ ఒక కవినైతే!
  ఈ కవి గారికి నా అభివాధం నా కవితతోనే తెలుపగలిగితే!!

  కొంత వరకు నిజం కాగల భ్రమ..

  కాని,

  నా కవితలో ఈ కవిగారిపై గౌరవాన్నంతా పొందు పరచాలంటే

  పూర్తిగా భ్రమే!

Leave a Reply