రెండు గీతల నడుమ…!

నవ్వు(Photo by Kishen Chandar)

ఆనందమూ
దు:ఖమూ
ఈ రెండే
మనిషిని మనిషిలా
ఉంచగలిగేవి.
ఇవి లేనప్పుడు
ప్రతి మనిషీ
మరమనిషే.
కానీ,
మరమనుషులం గా
బతికేది
ఏళ్ళు.
మనుషులంగా
జీవించేది
క్షణాలు.
వాటిని గుది గుచ్చితే…,
కవిత్వమే!
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రిక 1మార్చి2007 సంచికలో ప్రచురితం)

1 comment for “రెండు గీతల నడుమ…!

  1. Mohd.Sharfuddin
    June 18, 2012 at 5:54 pm

    Manishi yokka Jiviytaani Rendu Padalatho Chaala baga Prachurincharu sir

Leave a Reply