రుతు గీతిక

నోరెత్తకుండా బతికేసిన వాడెల్లా మౌని కాడు. ఆ మాటకొస్తే మాట్లాడక పోవటమూ మౌనం కాదు. తన్నుకొస్తున్న నూరు అలజడులను లోలోపలే అణచి వేసి ధ్యానమంటే- కుదరదు. అదే ధ్యానమయితే దరిద్రాన్ని మించిన ధ్యానం వుండదు. పరిచిన దేహం మీద అనుదినాత్యాచారం జరిగిపోతూనే వుంటుంది. నోరు లేవదు. అందుకే నోరు మూయించాలనుకున్న ప్రతి వ్యవస్థా ఖాళీకడుపు మీదే గురిపెడుతుంది

నెత్తికి

కపాలమే గొడుగు.

ఒంటికి

వాయువే వస్త్రం

పాదానికి

బురదే రక్ష

రుతువు రుతువుకీ

ఒకే రీతి స్వాగతం

ఎండొచ్చినా, వానొచ్చినా

కాదనకుండా

ఒళ్ళప్పగించటమే దరిద్రం!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

 

1 comment for “రుతు గీతిక

Leave a Reply to Mohd.Sharfuddin Cancel reply