Month: September 2013

‘అత్యాచారం’ బాపు!

పేరు : ఆసారం బాపు (అసలు పేరు అసుమల్‌ సిరుమలానీ)

ముద్దు పేర్లు : ‘అత్యాచారం’ బాపు (ఇది ఆరోపణే. అయినా అలా పిలుస్తున్నారు.), ‘అనాచారం’ బాపు(ఆచారాలను రూపు మాపుతున్నా, నా మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారు.)

విద్యార్హతలు : ధ్యానం( భూమి మీద. అందుకే ఆశ్రమాలకు భూమిని సేకరించగలిగాను.దేశంలోనూ, దేశం వెలుపలా దాదాపు 400 వరకూ ఆశ్రమాలున్నాయి.) పరధ్యానం(అందుకే భక్తురాళ్ళ మీద చేతులు వేసేటప్పుడు మైనరో, మేజరో చూసుకోను.)

యూటీ- అంటే ‘యూ-టర్నేనా?’

యూటర్న్‌ అనుకున్నా, ఏ టర్న్‌ అనుకున్నా, కేంద్రం హైదరాబాద్‌ హోదా మీద మరో ప్రకటన చేస్తుందన్నది నిజయమ్యే అవకాశం వుంది. ఇందుకు కాంగ్రెస్‌ ఇప్పటికే వ్యూహ రచన ఖరారు చేసివుండాలి. మనకు రాష్ట్రమంటే ‘రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ‘ ప్రాంతాలు కావచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ కు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంటే 42 పార్లమెంటు సీట్లు. యూపీయే-3ను అధికారంలో వుంచటానికీ, రాహుల్‌ని ప్రధానీ, కాకుంటే యూపీయే చైర్‌పర్సన్‌ చెయ్యటానికీ మన రాష్ట్రం నుంచి వెళ్ళే ఎంపీ సీట్లు కూడా అత్యంత కీలకమే.

ప్రజాస్వామ్యానికి వసంతమొచ్చింది!

ఉద్యమాలప్పుడు ప్రజలకు అసౌకర్యాలేకాదు, అధికారాలు కూడా ఉచితంగా వస్తాయి. నిన్న మొన్నటి దాకా నడిచిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ, నేడు నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, అసౌకర్యాలూ, అధికారాలూ పక్కపక్కనే కనిపించాయి.

అసౌకార్యాలు అనేకం. ప్రయాణమయి వెళ్ళాలనుకుంటాం. బస్సులుండవు. రైళ్ళుంటాయి కానీ, సీట్లుండవు, ప్రయివేటు బస్సులుంటాయి, కానీ అవి ‘గాలి’లో వుంటాయి. అంటే వేగంలో కాదు, ధరల్లో కాదు. దాదాపు ‘ఎయిర్‌'(విమాన)చార్జీల స్థాయిలో వుంటాయి.