‘కళ’ కాలం!

(ఇప్పటికిప్పడే, ఎప్పటికప్పుడే బతికేదే బతుకు. ఈ రహస్యం కవికి తెలుసు, కళకారుడికి తెలుసు, పసిపాపకు తెలుసు. క్షణంలోనే, తక్షణంలోనే అంతా వుంది. శాశ్వతత్వమంటూ ఏమీ వుండదు. మనం బతికేసిన క్షణాలనే రేపటి తరం గొప్పచారిత్రక ఘట్టాలుగా కీర్తిస్తుంది. అది మనకనవసరం. మనం లేనప్పటి మన ఘనకీర్తి తో మనకు పనిలేదు. ఈ క్షణం మీద నేను తువ్వాలు వేస్తున్నాను. ఇది నాది. ఈ క్షణం కోసం కావాలంటే ఒక యుగం పాటు యుధ్ధం చేయగలను.)

photo by: State Library and Archives of Florida

కళ
కాకి లాంటిది కాదు.
అది
ఎప్పటికీ రాజహంసే.
నిత్యయవ్వనిలా
నిలవ వుండాలనే
దేవతేఛ్చ కళకు వుండదు.
మంచును తొలిచినా
ఇసుకను మలిచినా
ఎవడైనా ఒకడు
‘అబ్బో’ అంటే చాలు
కళ జన్మధన్యం.
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రికలో ప్రచురితం)

3 comments for “‘కళ’ కాలం!

Leave a Reply to Kiran Gali Cancel reply