బొమ్మా, బొరుసూ..!

(వువ్వు పక్కనే ముల్లూ, గంధపు చెట్టు పక్కనే పామూ, నవ్వులోనే ఏడుపూ- అన్నీ ద్వంద్వాలే. ప్రతి రెంటిలోనూ ఒక్కటే ప్రియం. మిగతాది భయం. రెండూ అవసరమే. పులి ఎదురొస్తేనే కాదు, ప్రియురాలు చేతులు చాచినా, ముందు గుండె ఝళ్ళుమంటుంది. తొలుత తుళ్ళింతే. తెగిస్తేనే కౌగలింత.)

by Astanhope

సముద్రానికున్నంత

సహనమూ,

ఏనుగుకు ఉన్నంత

విధేయతా

మరెవ్వరికీ వుండవు

అయినా- అక్కడ అగ్నీ తప్పదు

ఇక్కడ అంకుశమూ తప్పదు

మేలిమికే పరీక్షలన్నీ

-సతీష్‌ చందర్‌
(ఆంధ్ర్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “బొమ్మా, బొరుసూ..!

Leave a Reply