హోంవర్క్‌ అడగలేదోచ్‌!

ఈ ప్రజాస్వామ్యం ఏమిటో కానీ,
ఇక్కడ ఎవ్వరూ హోం వర్క్‌ చెయ్యరు.
వోటరు దగ్గర నుంచి బ్రోకరు వరకూ, కేడర్‌ మొదలు లీడర్‌ వరకూ- అంతే. ఒక్క ‘మందు’ తప్ప ఏదీ ముందు సిధ్ధం చేసుకోరు.( వీరికి ముందు జాగ్రత్త అనే మాట ‘మందు’ జాగ్రత్త లాగా వినిపిస్తుంది).
పోటీలో వున్న ఫోర్‌ట్వంటీలెందరో కనీసం లెక్కకూడా పెట్టుకోడు వోటరు.
‘నేను ‘నొక్కాల్సిన’ ఫోర్‌ట్వంటీ గాడెవడో చెప్పు. మిగతా వాళ్ళు నాకనవసరం’ అని బూత్‌లోకి వెళ్ళే ముందు అడిగి వెళ్ళి ‘ఈవీఎం’ (ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌) మీట నొక్కేసి వస్తాడు. ఎన్నో వేలిముద్రలు నొక్కిన వాడికి ఈ ముద్రో లెక్కా?

భయ..భయ..భయహే!

ఆయుధమంటే చాలు అదిరిపడి చస్తారు ఎందుకో..?
ఉన్నట్టుండి యోగా(రామ్‌ దేవ్‌)బాబా తన అనుచరులకు ‘శస్త్రం’ ఇస్తానన్నారు. చిదంబరం నుంచి ఏకాంబరం వరకూ దేశంలో అందరూ ఉలిక్కి పడ్డారు.
గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన అభిమానులకి లాఠీలు(కర్రలు) ఇచ్చి ప్రదర్శన చేయించారు. అవీ ఆయుధాలే కదా! అప్పుడూ ఇలాగే… అందరూ ‘బుర్రలు బద్దలు కొట్టు’కున్నారు.. లాఠీలతో కాదు… సందేహాలతో…!
‘ఇతను ఉగ్రవాదిలా రెచ్చిపోతున్నాడేమిటి..? కొంప దీసి ‘ఆల్‌ ఖైదా’ లాగా ‘లాల్‌ ఖైదా’ లాంటి సంస్థను గాని స్థాపించలేదు కదా- అని అనుమానించారు కదా!

విశ్వాసానికి విడాకులు

విశ్వాసం వుండాల్సింది కుక్కలకీ నక్కలకీ కానీ, మనుషులకెందుకు చెప్పండి?
ఇప్పుడు ఉంటున్న ఇంటికి తాళం వేస్తున్నారు. ఒకప్పుడు ఉంచుకున్న ఒంటికి తాళం వేసే వారు. ఎందుకూ? అవిశ్వాసం? మనుషుల్లో దొంగ మనుషులుంటారనీ, వారు కన్నం వేస్తారనీ- గొప్ప అవిశ్వాసం.
కుక్కలతో అలాంటి పేచీలేదు. వాటిల్లో మహాఅయితే పిచ్చికుక్కలు వుంటాయేమో కానీ, దొంగ కుక్కలు వుండవు.
అందుకే అవిశ్వాసమన్నది ముమ్మాటికీ మానవ ప్రవృత్తి.
కోతి నుంచి మానవుడు అవతరించే పరిణామ క్రమంలో, మెల్లిగా తోక అంతరించిపోతూ, దాని స్థానంలో అవిశ్వాసం పెరుగుతూ వచ్చింది.

అర్థనీతి పరులు

అవినీతిని చూస్తే ఒకప్పుడు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు కడుపు మంట పుడుతోంది.
రూపాయి మీద ఒట్టు. కోపం వేరు. కడుపు మంట వేరు.
అందగత్తె ఐశ్యర్యారాయ్‌ను చూస్తే అనాకారులయిన అప్పలమ్మలకి వచ్చేది కోపం; కానీ అంతో ఇంతో అందగత్తెలకు వచ్చేది మాత్రం కడుపు మంటే.
బుద్ధివున్న వాణ్ణి చూస్తే, బుర్రలేని వాడికి వచ్చేది కోపం; సగం బుర్ర వున్నవాడికి వచ్చేది కడుపు మంట.
అలాగే..,
బిర్యానీ మెక్కే వాణ్ణి చూస్తే , తిండి లేనివాడికి వచ్చేది కోపం; తెల్లన్నం తినేవాడికి వచ్చేది కడుపు మంట.
ఇప్పుడు దేశం మొత్తం… కోపంతో ఊగిపోవటం లేదు. కడుపు మంటతో కాలిపోతోంది. కారణం అవినీతి.

సీత చేతి ఉంగరం

వాగ్గేయకారుడుగా జయరాజు తెలుగువారికి సుపరిచితుడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన పాటలు వినని వారుండరు. పలు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. వామపక్ష ఉద్యమాలకు బాసటగా ఆయన సాహిత్యం నిలిచింది. కార్మికనేతగా, కళాకారుడిగా ఆయన ఉద్యమజీవితంగా సాగించారు. సాగిస్తున్నారు కూడా. ఆయన తన పాతికేళ్ళ సాహిత్యప్రస్థానానికి గురుతుగా వేసిన ‘వసంత గీతం’ పుస్తకానికి రాసిన ముందు మాట ఇది.

నిన్నటి కలలే నేటి అలలు!

శ్రీశ్రీ పక్కన నిలుచున్నా, సముద్రపు వొడ్డున కూర్చున్నా ఒక్కటే. చిరుకోపం వుంటే మహోద్రేకమవుతుంది. కొంచెం దు:ఖమే కావచ్చు. దావాలనమవుతుంది. చిన్ననవ్వే పెనుసంబరంగా మారుతుంది.
శ్రీశ్రీ సముద్రమంతటి ఉత్ప్రేరకం. వామనుడికి సైతం విశ్వరూపాన్ని ప్రదర్శించగల శక్తి అది. శ్రీశ్రీ చైన్నైలో వున్నా, విశాఖలో వున్నా సముద్రాన్ని ప్రేమించేవాడు. సముద్రంలేని చోట వుండటానికి ఇష్ట పడేవాడు కాడు.
డెరెక్‌ వాలకాట్‌కి సముద్రమంటే ఎంత ఇష్టమో, శ్రీశ్రీకీ సముద్రమన్నా అంతే ఇష్టం. సముద్రాన్ని కోల్పోవటం చిన్న విషయం కాదు. ‘సముద్రాన్ని కోల్పోయిన జీవితం దేహాన్ని కోల్పోయిన వస్త్రం లాంటింద’న్నాడు వాల్‌కాట్‌ చమత్కారంగా.