Tag: జనాకర్షక పథకాలు

ఏడుపు గొట్టు పథకాలు!

ఏడ్వని కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్కటే ఏడుపు.

తిట్టినా, చితగ్గొట్టేసినా, నిలువునా చీరేసినా ఏడ్వటం లేదు. పైపెచ్చు ఒంటి మీద చెయ్యేస్తే చాలు-కితకితలు పెడుతున్నట్టుంటుంది వాడికి. దాంతో ఒక్కటే నవ్వు.

వాళ్ళ వృత్తికి ఏడుపే జీవనాధారం. ఏడ్వనిదే పూట గడవదు. పగటిపూట గడిచినా రాత్రి పూట అసలు గడవదు. పేవ్‌మెంట్‌ మీద పడుకోగానే నిద్రపట్టి చావదు. కప్పుకోవటానికి రగ్గున్నా లేకున్నా, కడుపు వెచ్చబెట్టుకోవటానికి ఒక్క ‘పెగ్గు’ అన్నా పడాలి.

పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!

చరిత్రంటే- పేరూ, ప్రతిష్ఠలు మాత్రమే కాదు; మచ్చలూ, బొట్లూ కూడా. చెరపటం అంత చిన్న విషయం కాదు. పుట్టు మచ్చంటే, పుట్టు మచ్చే. చచ్చినా చెరగదు. పచ్చ బొట్టూ అంతే. మోజు పడి పొడిపించుకున్నంత ‘వీజీ’ కాదు- చికాకు పడి చెరిపేసుకోవటానికి. ముళ్ళపూడి వెంకటరమణ (‘ముత్యాల ముగ్గు’ కోసం) రాసినట్టు, ‘సెరిత్ర.. ! సెరిపేత్తే సెరిగి పోదు, సింపేత్తే సిరిగి పోదు.’

ఈ రహస్యం మన రాష్ట్ర మంత్రులకు అర్థమయి నట్లు లేదు. అందుకే ‘గోడ మీద రాతల్ని’ చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం మీదా ‘రాజ’ ముద్ర వుండటానికి వీల్లేదు.(అదే లెండి. రాజశేఖర రెడ్డి ముద్ర.)- అంటూ ‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది.