Tag: Corporate schools

ఇక్కడి బాల్యానికి ‘డబ్బు’ చేసింది..!!

చెడిపోవాలన్న కోరిక పుట్టాలే కానీ, ఎలాగయినా చెడిపోవచ్చు. డబ్బుండీ చెడిపోవచ్చు; డబ్బులేకా చెడిపోవచ్చు. వెనకటికి కవి కాళోజీ అన్నాడు -ఉన్నవాడిదీ లేని వాడిదీ ఒకటే బాధ:’తిన’లేక- అని. ఇప్పుడు డబ్బున్న పిల్లలకీ, డబ్బులేని పిల్లలకీ ఒక్కటే జబ్బొస్తోంది. మైనారిటీ తీరకుండానే, బాల్యం వదలకుండానే, పెద్ద పెద్ద పనులు చేసేస్తున్నారు. క్రూరమైన, ఘోరమైన నేరాలు చేసేస్తున్నారు. ఖరీదయిన…

గవర్నమెంట్‌ స్కూలా! మార్కెట్‌ రికగ్నిషన్‌ వుందా?!

‘మావాణ్ని ఏ కార్పోరేట్‌స్కూల్లో వేస్తే మంచిదంటావ్‌?’

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, సాటి ఉపాధ్యాయుడి సలహా కోరతాడు.

‘మా ఆవిడకు రెండు రోజులనుంచి జ్వరం, ఏ మల్టీ స్పెషాలిటీస్‌ హాస్పటల్‌లో చేర్పిస్తే మంచిదంటావ్‌?’

ప్రభుతాసుపత్రిలో డాక్టరు, తోటి డాక్టరుని ఆరా తీస్తాడు.

‘మా అల్లుడు కట్నం కోసం మా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఏ గూండాతోనైనా బెదిరించాలి. ఎవరికి చెబుతాం?’

ఓ పోలీసు కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ అభిప్రాయం అడుగుతాడు.

ప్రభుత్వరంగానికే ప్రయివేటు రంగంతో పనిపడింది.