Tag: Kammas

రాజకీయాల్లో ‘కులం’ బద్దలు గొట్టిన జేసీ!

కుటుంబాన్ని సాగదీస్తే కులమవుతుందనీ, కులాన్ని ఎత్తి కుదేస్తే కుటుంబమవుతుందనీ.. చెప్పటానికి ఏ సామాజిక శాస్త్రవేత్తో దిగిరానవసరంలేదు. తేట ‘తెలుగు’ పార్లమెంటు సభ్యుడు చాలు. నిన్నగాక మొన్న ఈ మ్కునే జేసీ దివాకరరెడ్డి ‘కులం’ (కుండ కాదు) బద్దలు గొట్టి మరీ చెప్పారు. తిన్న ఇంటి వాసాలు కాదు, ఉన్న పార్టీ దోషాలను లెక్కించటంలో ఆయనకు ఆయనే…

‘కాపు’దలలో కాంగ్రెస్‌ వుంటుందా?

కులం ఉందంటే ఉంది; లేదంటే లేదు. కాలేజీ ‘ఫ్రెండ్‌షిప్పు’ల్లో ఒక్కొక్క సారి కులం నిపించదు. కానీ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ వచ్చేసరికి- కులం ఎలా వచ్చేస్తుందో వచ్చేస్తుంది. అదేమి విచిత్రమో కానీ, తాను ‘ప్రేమించిన అమ్మాయిది తన కులమే- అని తేలుతుంది'( తనకులానికి చెందిన అమ్మాయి మీదనే తనకు మనసు మళ్ళింది- అని చెబితే అసహ్యంగా వుండదూ! అందుకని ఇలా అనుకోవటంలో ఓ తృప్తి వుంది)