Tag: match fixing

‘మ్యాచ్‌ ఫిక్సింగు’లు కావు, అన్నీ ‘స్పాట్‌ ఫిక్సింగు’లే!?

క్రికెట్‌లోనే క్రీడాకారులు’మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల నుంచి ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.

మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ కాంగ్రెస్‌-వైయస్సార్‌ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఎత్తి పొడుస్తుంటుంది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌!-: – మనీ మిక్సింగ్‌!!

వియ్యమన్నాక– వావీ, వరసల ప్రస్తావన వస్తుంది. వరసయిన వారితోనే ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వుండాలి. వరసలు తప్పితేనే అల్లరవుతారు.

రాజకీయ వియ్యాల్లోనూ ఇదే నియమం. వరస తప్పకూడదు. ఉదాహరణకు ‘కాషాయానికీ’, ‘ఎరుపున’కూ వియ్యం కుదరదు. అనగా ‘కమలాని’కీ, ‘కొడవలి’కీ మధ్య ‘ఎఫైర్‌’ నడవదన్నమాట. (కమలమొచ్చి, కొడవలి మీద పడ్డా, కొడవలి వచ్చి కమలం మీద పడ్డా- తెగిపడేది కమలమే!)