Books

 

List of published books by Satish Chandar

S.no Book Thumbnail Name/Title Genre Description Year Price
1 Made in India

(మేడ్ ఇన్ ఇండియా)

Satire ఎనభయ్యవ దశకం చివరి పాదంలో ఎన్టీ ఆర్ ముఖ్యమంత్రిగా వుండగా రాసిన వ్యంగ్యం. ఈ పుస్తకం చదివాకే ఎబికె ప్రసాద్ సతీష్ చందర్ ను ఆర్ట బుచ్ వాల్డ్ తో పోల్చారు 1992 Out of Print
2 [Image Not Available] Dunkel Bells

(డంకెల్ బెల్స్)

Play డంకెల్ ప్రతిపాదనల వల్ల రైతుకు జరిగే నష్టం పై వచ్చిన వీధినాటకం. 1993 Out of Print
3   Panchamavedam

(పంచమవేదం)

Poetry తొంభయ్యవ దశకం తెలుగు కవిత్వ దిశను మార్చేసిన గ్రంథం. పలు యూనివర్శిటీల్లో పాఠ్య గ్రంథం. 1995 Out of Print
4   Itihaasam

(ఇతి హాసం)

Satire నడుస్తున్న రాజకీయాలను జానపద కథల్లాగా రాసిన గ్రంధం. 1995 Out of Print
5   Naanna Cycle

(నాన్న సైకిలు)

Poetry స్వీయ చరిత్రాత్మకంగా వుండే దీర్ఘకవిత. కానీ రెండేసి పాదాలతో couplets లాగా సాగుతుంది. 1995 Out of Print
6   Vaartha Palukubadi

(వార్త పలుకుబడి)

Dictionary పాత్రకేయులకోసం ఎబికె ప్రసాద్ తో కలిసి  రాసిన నిఘంటువు 1996 Out of Print
7   Kanki

(కంకి)

Editorials వార్త లో రాసిన సంపాదకీయాలు. రైతుల మీద కాల్దరి(ప.గో.జిల్లా) లో కాల్పులు జరిగినప్పడు ’తూటాలకు తలలు వాల్చిన వరికంకులు‘ అనే సంపాదకీయాన్ని, రాష్టమంతటా కరపత్రాలుగా వేసి పంచుకున్నారు. (సతీష్ చందర్ వార్త దినపత్రిక వ్యవస్థాపక సహ సంపాదకులు) 1999 Out of Print
8   Pasupu Jaabilli

(పసుపు జాబిల్లి)

Poetry గుజరాత్ లో భూకంపానికి కకావికలమైన జనాన్ని చూసి చలించి రాసిన కవిత్వం. 2002 Out of Print
9   Daruvu

(దరువు)

Satire రాజకీయ వ్యంగ్యం.  ఆంద్రప్రభ దినపత్రికలో  ’దరువు‘ పేరు మీద నిర్వహించిన కాలమ్స్. తెలుగు లో కుష్వంత్ సింగ్ లాగా రాశారని సమీక్షకులు అన్నారు. 2002 Out of Print
10 Vaalu Choopulu, Moothi Virupulu

(వాలు చూపులూ, మూతి విరుపులూ)

Short Stories స్త్రీని ప్రేమించేటప్పుడు అందం లేదా మనసు మాత్రమే కీలకమవుతాయి. కానీ ఆమె ప్రతిభ ఎందుకు కాదు? ఈ నేపథ్యంలో రాసిన హాస్యం తొణికస లాడే భిన్నమైన ప్రేమ కథలు 2005 Out of Stock
11   Chandrahaasam

(చంద్రహాసం)

Short Stories జీవితాల్లో విలువలుపోయి, రూపాయిలు ప్రవేశించాయి. మనషులను అనుబంధాలు కాకుండా అవసరాలు కట్టిపారేస్తున్నాయి. ఈ థీమ్ తో మొత్తం 72 వ్యంగ్య కథలు రచయిత రాశారు. 2006 E-edtion on Kinige
12   Mandal-Mandir

(మండల్ మందిర్)

Editorials రామమందిర నిర్మాణం కోసం ఆందోళనలూ, మండల్ సిఫారసులకు అనుకూలంగా వచ్చిన ఉద్యమాలూ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేస్తాయని, చాలా ముందుగా (1990లోనే) రాసిన సంపాదకీయాలు. 2007 Out of Stock
13   Aadiparvam

(ఆదిపర్వం)

Poetry వచన కవిత్వం. రైతుల ఆత్మహత్యలూ, దళిత ఆత్మగౌరవ పోరాటాలూ, బహుళ జాతి సంస్థల ఆగడాలపై వచ్చిన కవిత్వం. 2008 Rs.100
14   Panchama Vedam

(పంచమవేదం) Updated/Reprint Edition

Poetry మూడవ ముద్రణ. అజంతా, గుంటూరు శేషేంద్ర శర్మల అభిప్రాయాలతో వెలువడింది. 2011 Rs.80
15   Paachika

(పాచిక)

Political Essays  ‘పాచిక’ శీర్షిక కింద (2004 – 2006లో) సతీష్ చందర్ రాజకీయ వ్యాసాలను రాశారు. శాసన సభలో ప్రతిపక్షనేతగా వున్న వైయస్.రాజశేఖర రెడ్డీ, ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబు నాయుడూ తమ తమ పాత్రల్ని మార్చుకున్నారు. కేంద్రంలోనూ అంతే. ఎన్డీయే దిగిపోయి, యూపీయే వచ్చింది. చరిత్ర ముఖం మార్చుకుంటున్న తీరుపై రాసిన వ్యాసాలు. అప్పటికాయన ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన సంపాదకులు 2012 Rs.200
16   King Maker

(కింగ్ మేకర్)

Satire ‘ఫీల్ గుడ్’ అని దేశానికి భరోసా ఇచ్చిన వాజ్‌పేయీ పాలనకూ, ‘నిద్రపోను, నిద్రపోనివ్వను’ అని రాష్ట్రానికి కాపలా కాస్తున్న చంద్రబాబు సర్కారుకు ఏడాదిలోగా ‘శుభంకార్డు’ పడబోతుందని తెలియదు. క్లయిమాక్స్ లో కవ్వింపుల్లా ఈ రచనలు వచ్చాయి. 2013 Rs.180
17 Siggu

(సిగ్గు)

Short Stories ‘సిగ్గు’ కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్ఠాత్మకమైన సంకలన కర్తలు రెండు దశాబ్దాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో ‘సిగ్గు’ కథ వుంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలోని పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరితే, అందులో కూడా సతీష్‌ చందర్‌ ‘డాగ్‌ ఫాదర్‌’ కథ వుంది. 2014 Rs.250
18 Nigraha Vakyam

(నిగ్రహ వాక్యం)

Literary Criticism  మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ. సతీష్ చందర్ ’పంచమ వేదం‘ పై వచ్చిన విమర్శ, ప్రతివిమర్శలు కూడా ఈ గ్రంథంలో వున్నాయి. 2015  Rs.250
19 Godhanam

(గోధనం)

Novel గో సంరక్షకుల పేరు మీద చేస్తున్న హింస పై సతీష్ చందర్ తన దైన వెటకారంతో రాసిన నవల. 2016  Rs.75
20 Featurelu Prayogaalu

(ఫీచర్లు-ప్రయోగాలు)

Available at Amazon

Practical Journalism  మీడియాలో ఇప్పడు నడుస్తున్నది ’పీచరింగ్‘ యుగం. ఎటొచ్చీ ఫీచర్లు రాసే వారే కరువయ్యారు. ఈలోటును పూరించటానికి రిపోర్టింగ్ లోనూ, ఎడిటింగ్ లోనూ, మీడియా బోధనలోనూ తనకున్న అనుభవాన్ని రంగరించి రచయితలకూ, పత్రికారచయితల కోసం సతీష్ చందర్ రాసిన పాఠ్యపుస్తకం. 2017  Rs.300
21 Padachitram

(పదచిత్రం)

Poetry  తత్వానికీ, కవిత్వానికీ మధ్య వున్నది అతి చిన్న రేఖ. ఈ హద్దును చెరిపేస్తూ దాదాపు 500 కవితలు రాసి, స్వయంగా సతీష్ చందరే ప్రతి కవితకూ బొమ్మ గీసి ప్రచురించారు. 2017 Rs.250
22 B for Ballot

(బి ఫర్ బ్యాలట్)

Available at Amazon

1

Editorials మూడు దశాబ్దాల(1999-2019) ఎన్నికల రాజకీయాయలను  ఏడు విభాగాల (ప్రచారం, పొత్తులు, వోటు బ్యాంకులు, సమస్యలు, మధ్యంతరాలు, ఫిరాయింపులు, ఫలితాలు) కింద చర్చించి, వాటికి అనుబంధంగా ఎప్పటికప్పుడు ఆ రాజకీయాలను ఎక్స్ రే తీసి బయిట పెట్టిన 196 సంపాదకీయాలను జోడించారు. 2019 Rs.690