Tag: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు

‘గ్రేటర్‌’ కోట పై ‘గులాబీ’ జెండా..!?

‘గ్రేటర్‌’ కోట పై ఏ జెండా ఎగురుతుంది? ఈ చర్చ కేవలం హైదరాబాద్‌ కే పరిమితం కాదు. అలాగని రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయినది కూడా కాదు. దేశం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తున్నది. ఎన్ని పార్టీలు బరిలో వున్నా, అంతిమంగా ఆడేది మూడు ముక్కలాటే! అవును. ముక్కోణపు పోటీయే. టీఆర్‌ఎస్‌- మజ్లిస్‌లు పేరుకు వేర్వేరుగా పోటీ చేస్తున్నా, ఈ రెంటిదీ ఒకే ముఖం. ఆ పార్టీల మధ్య ముందస్తు అవగాహన వుంది. కార్పోరేటర్‌ ఎన్నికలు ముగిశాక, మేయర్‌ ఎన్నికలప్పుడు కలవాలన్నది అవగాహన సారాంశం. ఇక ఒక డజను డివిజన్లలో కత్తులు దూసుకున్నా, ఇతర డివిజన్లలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ల మధ్య అధికారికమైన పొత్తు వుంది. ఇక మూడవది కాంగ్రెస్‌ పార్టీ. అయితే గెలుపు వోటములతో సంబంధం లేకుండా లోకసత్తా, వామ పక్షాలు కలిపి మరో కూటమి వుంది కానీ, యుధ్ధక్షేత్రం వారి ఉనికి నామ మాత్రంగానే వుంటుంది. కాబట్టి అంతిమంగా వుండేది త్రిముఖ పోటీ మాత్రమే.

ఇది ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం!!

‘గ్రేటర్‌’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్‌’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్‌’ అని అనకుండా ‘గ్రేటర్‌ న్యూయియర్‌’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం.