Tag: జూనియర్ ఎన్టీఆర్

పాదుకా ‘ప్రచారా’భిషేకం!

చెప్పుల్లో కాళ్ళు పెట్టటమూ, తప్పుల్లో వేళ్ళు పెట్టటమూ చిన్న విషయాలు కావు. అయినా సరే, చిన్న పిల్లలకు ఈ రెండు పనులూ సరదా. చెయ్యకుండా వుండలేరు. నాన్న చెప్పుల్లోనో, నానమ్మ చెప్పుల్లోనో కాళ్ళు పెట్టటానికి ఉబలాటపడతారు. పెద్దచెప్పులూ, బుల్లి పాదాలూ..! ఇదో ఆట. ఈ ఆటే వారసత్వ రాజకీయం. మిగిలిన దేశాల మాట ఎలా వున్నా, మన దేశంలో ఈ ఆటకు డిమాండ్‌ ఎక్కువ.

తారలు ‘దిగి వెళ్ళిన’ వేళ!

పట్టపగలు తారలు కనిపిస్తాయా? సినిమా తారలూ అంతే. సినిమాల్లో రాత్రయినా, పగలయినా వేషం వెయ్చొచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం పగటి వేషమే నడుస్తుంది. ‘ఈ వేషం మేం వెయ్యలేమా?’ అని నిన్న మొన్నటి వరకూ సినిమా తారలకూ పోటీ పడ్డారు. వెయ్చొచ్చు. ప్రచార రథాలెక్కి తొడలు చరచవచ్చు. మీసాలూ మెలివేయనూ వచ్చు. ఆ తర్వాత…? ఎవరి డైలాగులు వారు రాసుకోవాలి. చెప్పాలి.

‘అబ్బోయ్’- ‘బాబోయ్’

కొంపన్నాక, కుటుంబం వుంటుంది. కుటుంబం అన్నాక కొన్ని వరసలుంటాయి. ఆ వరసల్లో కూడా రెండు రకాలుంటాయి:పడిచావని వరసలూ, పడి చచ్చే వరసలూ.

అత్తా-కోడలు. వామ్మో! నిప్పూ- గ్యాసూ అన్నట్లు లేదూ? అఫ్‌కోర్స్‌! కోడల్ని వదలించుకోవటానిక్కూడా అత్త ఈ వస్తువుల్నే వాడుతుందనుకోండి!

మామా-అల్లుడు. ఇదీ అంతే. అప్పూ- పప్పూ లాంటిది. మామ అప్పు చేస్తే, అల్లుడూ పప్పుకూడు వండిస్తాడు.

నం’దమ్మూ’రి!

పేరు : నందమూరి తారక రామారావు( జూనియర్‌)

దరఖాస్తు చేయు ఉద్యోగం: వారసుడు (సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా)

ముద్దు పేర్లు : కుర్ర తాత( తాత ఎన్టీఆర్‌ మనవడి ఎన్టీఆర్‌ను -తాతా- అని పిలిచేవాడు లెండి), జూనియర్‌( సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ‘సీనియారిటీ’ అన్ని వేళలా నిలవదు. బాబాయ్‌లు అబ్బాయ్‌ లు కావచ్చు, అబ్బాయ్‌లు బాబాయ్‌లు కావచ్చు.) తాతకు తగ్గ మనవడు. నం’దమ్మూ’రి!