Tag: శివరాజ్ సింగ్ చౌహాన్

కేలెండరే కాదు, కేరక్టర్లూ మారాయి!

అంతా ముందే. తర్వాత ఏమీ వుండదు. పెళ్ళికి ముందే, బాజాలయినా, భజంతీలయినా. పెళ్ళయ్యాక ఏమి మిగులుతాయి? ఎంగిలి విస్తళ్ళు తప్ప. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా పెళ్ళిళ్ళు లాంటివే. ఎన్నికలకు ముందే హడావిడి. అయ్యాక ఏమీ వుండదు.
కేలండర్‌ దాటితే( 2013 పోయి 2014 వస్తే) రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలే. అప్పుడు ఏమి మిగులుతాయి? వెలిసిపోయిన పోస్టర్లూ, హోర్డింగులూ మినహా. హడావిడి అంతా, ఎన్నికలకు ముందు సంవత్సరమే. అందుకే 2013 అంతా చప్పుడుతో గడిచింది.

‘ఖద్దరు’ సేన కిది రాహుల్‌ నామ సంవత్సరమయితే, ‘కాషాయ’ దళానికి మోడీ నామ సంవత్సరం. ప్రధాని అభ్యర్థులు ఖరారయ్యారు. రాహుల్‌కు కాంగ్రెస్‌ పార్టీలో పోటీ ఎవ్వరూ లేరు.(ఉన్నా రారు కూడా.) కానీ, బీజేపీలో మాత్రం మోడీకి పోటీ వచ్చారు. సాక్షాత్తూ, గురువూ, కురువృధ్ధుడూ అద్వానీయే పోటీకి వచ్చారు