Tag: gandhi

మాటలో పాగా!

ఒక్కడే. మాట్లాడతాడు. తనలో తాను కాదు. తన ముందున్న వారితో. తనకు దూరంగా వున్నవారితో. వందలు, వేలు, లక్షలు, కోట్ల మందితో! అప్పుడు మాట మంత్రం కాదు. మాధ్యమం. మాధ్యమం మారణాయుధమూ కాగలదు. మృత సంజీవినీ కాగలదు. అక్షరం చేసి ముద్రించినా, శబ్దం చేసి వినిపించినా, దృశ్యం చేసి చూపించినా, లేక ముద్రిత శబ్దచలనచిత్రంగా మార్చి…

వణకే ‘గాడ్సే’లూ… తొణకని ‘లంకేష్‌’ లూ…!

తలకాయ ఉపయోగించని వాడికి తలలంటే భయం. ఆలోచించే తలలంటే మరింత భయం. అసలు తలలే లేని మనుషులుంటే బాగుండుననుకుంటాడు. భయస్తుడి తొట్టతొలి ఆయుధమే హింస. ఆది కాస్తా వాడేస్తే నిద్రపడుతుందనుకుంటాడు. ఆ తర్వాత మరెప్పటికీ నిద్రపోలేడు. దేశంలో భయస్తులు జాగారం చేస్తున్నారు. వారి భయాలు పలురకాలుగా వున్నాయి: ఆడపిల్లలు అర్థరాత్రి రోడ్ల మీద తిరిగేస్తారేమోనని భయం;…

‘గాంధీ’ని చూపితేనే, వోటు!!

అభ్యర్థి జేబులోని అయిదువందల రూపాయి నోటు తీసి, వోటరు చేతిలో పెట్టి- ‘చూస్కో గాంధీ వున్నాడో? లేదో?’ అంటాడు. తళ తళ లాడే నోటును కళ్ళ దగ్గర పెట్టుకుని, బోసినవ్వుల గాంధీని చూసుకుని- ‘ఇప్పుడు నమ్ముతాను నువ్వ గాంధేయ వాదివని. నా వోటు నీకేలే ఫో!’ అంటాడు.

అవును. మరి. గాంధీ ముఖం చూసి వోటేస్తున్నారు కానీ, అభ్యర్థుల్ని చూసి వేస్తున్నారా?