Month: December 2010

నిన్నటి కలలే నేటి అలలు!

శ్రీశ్రీ పక్కన నిలుచున్నా, సముద్రపు వొడ్డున కూర్చున్నా ఒక్కటే. చిరుకోపం వుంటే మహోద్రేకమవుతుంది. కొంచెం దు:ఖమే కావచ్చు. దావాలనమవుతుంది. చిన్ననవ్వే పెనుసంబరంగా మారుతుంది.
శ్రీశ్రీ సముద్రమంతటి ఉత్ప్రేరకం. వామనుడికి సైతం విశ్వరూపాన్ని ప్రదర్శించగల శక్తి అది. శ్రీశ్రీ చైన్నైలో వున్నా, విశాఖలో వున్నా సముద్రాన్ని ప్రేమించేవాడు. సముద్రంలేని చోట వుండటానికి ఇష్ట పడేవాడు కాడు.
డెరెక్‌ వాలకాట్‌కి సముద్రమంటే ఎంత ఇష్టమో, శ్రీశ్రీకీ సముద్రమన్నా అంతే ఇష్టం. సముద్రాన్ని కోల్పోవటం చిన్న విషయం కాదు. ‘సముద్రాన్ని కోల్పోయిన జీవితం దేహాన్ని కోల్పోయిన వస్త్రం లాంటింద’న్నాడు వాల్‌కాట్‌ చమత్కారంగా.

‘కడగని’ పాత్రలు ఈ ‘నెగెటివ్‌’లు!

ఇలా రాసిందే రచన- అని ఏ రచయితనీ బెదరించలేం. ఇలా పెట్టిందే గుడ్డు- అని ఏ పిట్టనీ

వణికించలేం. అలా చేస్తే రాసింది రచనా కాదు. పెట్టింది గుడ్డూ కాదు. రచయితలంతా పుస్తకాలలోనుంచో,

విశ్వవిద్యాలయాల్లోంచో, పత్రికల్లోంచో పుట్టుకురావాలన్న షరతు కూడా లేదు. కల్లు కాంపౌండులోంచో, రెడ్‌ లైట్‌

ఏరియాలోంచో, వెలివాడలోంచో రచయిత పుట్టుకురావచ్చు. గుడ్లు పెట్టే వన్నీ ఫోరం కోళ్ళే కావాలని రూలు

లేదు. అడవిలోని కోడి కూడా గుడ్డు పెడుతుంది.
కెమెరా విజయకుమార్‌ రాయలని పథకం వేసుకుని రాయలేదు. రాయకుండా వుండలేక

రాసేశాడు. తాను వెనక్కి తిరిగి చూసుకునే సరికి రచయిత అయిపోయాడు. ఇంకేచేస్తాడు? తప్పించుకోలేడు.

ఊరందరి బెంగల్నీ మొయ్యాల్సిందే. అందుక్కూడా ఆయన సిధ్ధపడ్డాడు. కానీ ఊరువరకూ ఆయన్ని వెళ్ళనిస్తే

కదా! వాడ బెంగలే కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇంక కదలితే వొట్టు.

అందితే బేరం! అందకుంటే నేరం!

కళ్ళు మూసుకుంటే పదేళ్ళు గడిచిపోయాయి.
కాదు.. కాదు.. మనమంతా కళ్ళు మూసుకుంటూనే గడిచిపోయాయి..
పులులు ప్రోటీన్లున్న గడ్డి తిని బలుస్తున్నాయన్నారు. కళ్ళు తెరిచి చూడలేక పోయాయి.
లేళ్ళు కేవలం కార్బోహైడ్రేట్లు అన్నం తిని చిక్కి పోతున్నాయన్నారు. చూసే ధైర్యం చెయ్యలేక

పోయాం.
నీళ్లు లేని చోటకు నీళ్ళొస్తున్నాయి- అంటే పొలాల్లో వెతికాం. కానీ మునిగినవి కొంపలు.

చూసినా ప్రయోజనం లేదని కళ్ళు తెరవలేదు.
రైతుల ఆత్మహత్యలు వుండవు. అన్నారు. ఈ మాట మాత్రం నిజం. రేపు రైతే వుండడు. ఆ

పని కార్పోరేటు వ్యాపారి చేస్తాడు. ఆ సుందర దృశ్యం రేపు తర్వాత చూడవచ్చని కళ్ళు తెరవలేదు.
అతనెవరో ‘నాటు బాంబు నెత్తిమీద ఖద్దరు టోపీ’ పెట్టి- ‘అహింసా వర్థిల్లాలి’ అన్నాడు. చాలా

మంది ప్రత్యర్థులు నెత్తుటి మడుగుల్లో తేలారు. భయం వేసి కళ్ళు తెరవలేదు.
మిగిలిన ఒకరిద్దరూ ‘కంప్యూటర్‌’లో దాక్కుండి పోయి, సౌకర్యవంతంగా సవాళ్లు విసిరారు.

చూడటానికి విసుగనిపించి కళ్ళు తెరవలేదు.
అందితే బేరం! అందకుంటే నేరం!
మనమంతా కళ్ళు మూసుకుంటేనే పదేళ్ళూ గడిచిపోయాయి.

చిత్త ప్రసాద్‌ ‘రాతబడి’ చేశాడు!

నంది అంటే నంది
పంది అంటే పంది
అనే వాళ్ళను వంది మాగధులంటారు. ‘పంది’మాగధులని ఎందుకనరో!
అలాంటి ‘పంది’మాగధుడే ఒక ‘మధురమయి’న రాజ్యంలో ప్రధాన మంత్రిగా చెలామణీ అయిపోతున్నాడు.
ఆ రాజ్యం పేరు ‘రసగుల్లా రాజ్యం’. మంత్రికీ, రాజ్యానికీ ఏ మాత్రం పొంతన లేదు కదూ!
అందమైన దేశానికి అసహ్యకరమైన మంత్రి ఎందుకొస్తాడు? రాజుకు బుధ్ధిలేక పోతే సరి!
బుధ్ధిలేని రాజూ, గడ్డితినే మంత్రీ ఉద్యానవనంలో విహరిస్తుండంగా, నిజంగానే ఇద్దరూ పందిని చూశారు.
‘ఏమిటది?’ అన్నాడు బుధ్ధిలేని రాజు.
చిత్రం! పందిని పంది- అని చెప్పలేదు గడ్డితినే మంత్రి.
‘బక్కచిక్కిన ఏనుగు’ అన్నాడు.

‘ఫుడ్‌’ పాత్‌

పరమహంస చచ్చిపోయాడు.
కానిస్టేబుల్‌ పరమహంస దీనాతి దీనంగా, ఘోరాతి ఘోరంగా, హీనాతి హీనంగా పోయాడు.
అత్యంత చౌకబారుగా, అడుక్కునే వాడి చేతిలో అర్థరాత్రి అసువులు బాపాడు.
ఫుట్‌ పాత్‌ మీద ఆడ్డంగా బోర్లాపడివుంది శవం.
టాటాసుమో ఇంకా ఆగకుండానే దూకి వచ్చాడు డీసీపీ తాండవ్‌. గౌరవసూచకంగా తన ‘టోపీ’
తియ్యబోయాడు.
దాని మీద వున్న మూడు సింహాలూ గర్జించటం మాని, ముక్తకంఠంతో ‘మ్యావ’్‌ మన్నట్లు
అనిపించింది