Month: November 2011

తల వంచుకుంటే, ఒక ‘తన్ను’ ఉచితం!

ఉచితం. బోడిగుండు ఉచితం-
విగ్గులు కొంటే.
పెళ్ళికొడుకు ఉచితం-
అమ్మాయి జీతం అనబడే నెలసరి కట్నం తెస్తే.
కర్చీఫ్‌ ఉచితం-
ఏడుపు గొట్టుసినిమా చూసిపెడితే.
ఎలా ఎన్నెన్నో బంపర్‌ ఆఫర్లు. ఉచితం అంటే చాలు- మనవాళ్ళకి వొళ్ళు తెలియదు. డబ్బుపెట్టి కొనటమంటే మనవాళ్ళకు మహా చికాకు.దానితో పాటు ఏదోఒకటి ఉచితంగా కొట్టేశామన్న తృప్తి వుంటే మాత్రం తెగించి కొనేస్తారు.

అడుగు జాడ!

మబ్బుకీ మబ్బుకీ మధ్య ఎండలా, ఏడుపుకీ ఏడుపుకీ మధ్య నవ్వులా, విశ్రాంతికీ విశ్రాంతికీ మధ్య పనిలా ఏమిటో ఈ కవిత్వం? గాఢాలింగనంలో కూడా ఇంకా ఏదో దూరం మిగిలిపోయినట్లూ, ఎంతో గొప్పగా నడిచిపోతున్న జీవితంలో కూడా ఏదో వెలితి. ఏ ఫర్వాలేదు.. ఎక్కడ జాగా వుంటే అక్కడ బతకటానికి కాసింత అమాయకత్వం అవసరమయిందన్న మాట. నిజం చెప్పొద్దూ..? కవిత్వమూ, అమాయకత్వమూ రెండూ ఒక్కటే…!

బషీర్ ‘బాబ్’

పూటకో మాట, చోటు కో మాట, సీటు కో మాట, నోటుకో మాట, వోటుకో మాట… ఇన్నిమాటల్నినేర్చిన పోటుగాళ్ళు మన నేతలు. వాళ్ళు అన్నేసి మాటలు అనేస్తూ వుంటే, మనం ఒక్క మాటన్నా అనాలి కదా…అదేమి విచిత్రమో, దేశంలో వోటున్న వాడికి మాట వుండదు. మాట్లాడాలి. మాటకు మాట అంటించాలి. ఈ చిరుకోపంతోనే నేను పని చేసిన పత్రికలలో ’మాటకు మాట’, ‘మాటకారి’ పేర్ల మీద ఈ శీర్షిక నిర్వహించాను. నా మిత్రుల కోసం..మళ్ళీ ఇలా…

బ్యాలెట్ పేపరా? చార్జి షీటా?

‘పెళ్ళంటే మూడు ముళ్ళనుకున్నావా…? లేక మూడు విడాకులనుకున్నావా?‘
సంపన్నవతీ, సౌందర్యవతీ అయిన మూడుపదుల మహిళను ప్రశ్నించాడు లాయరు- బోనులో నిలబెట్టి.
‘ముళ్ళూ కాదు, ఆకులూ కాదు. ముడుపులు. పెళ్ళంటే ముడుపులు… అని నేననుకోలేదు. నన్నుకట్టుకున్న మొగుళ్ళు అనుకున్నారు. .
మహిళ అయి వుండియూ, ముద్దాయి అయివుండియూ ఆమె తలయెత్తి సమాధానం చెప్పటంతో లాయరికి చిర్రెత్తుకొచ్చింది.
‘అంటే కట్నమనా…?’
’ముడుపులనే… ఆడదాని దగ్గర పుచ్చుకుంటే కట్నమవుతుంది. అడ్డమయిన వాడి దగ్గరా పుచ్చుకుంటే లంచమవుతుంది.‘

తెలంగాణకు మొండి ‘చెయ్యి’

‘గురూజీ?’
‘వాట్ శిష్యా?’

‘తెలంగాణ ఇప్పట్లో రాదని కాంగ్రెస్ చెప్పేసి నట్లేనా?’
‘అనిపిస్తోంది.’

‘అనిపించటమేమిటి గురూజీ? వరుసగా అందరూ చెప్పేశారు కదా?’
‘ఎవరెవరు శిష్యా?’

సమాచార కాంక్ష

కడలికి నింగిని చేరాలనీ, నింగికి కడలిని చేరాలనీ కోరిక. కడలి రగిలి రగిలి ఆవిరయి వెండి మేఘంలాగా పైకి చేరిపోతే, నింగి పొగిలి పొగిలి ఏడ్చి వానగా కడలికి చేరుతుంది. గుండెకు గుండెను చేరాలనే కోరిక. దేహానికి మరో దేహంతో పెనవేసుకోవాలనే కోరిక. మనిషికి మనిషి చేరుకునే కోరికే లేకుంటే జీవితం పుట్టగానే ముగిసిపోతుంది.

Divide and Fool. It’s UP’s Maya.

Divide and fool. It’s not British Maya but UP’Maya’.Mayawati’s demand for division of the state has practically fooled Congress, BJP and SP. Congress can not play ‘anti-incumbency’card in UP and can not find an amicable solution for Telangana in near future in AP, even if it wills to do.

ప్రేమకు నిర్వచనాలు

ఇదే జీవితాన్ని ఇంతకు ముందు ఎంత మంది జీవించలేదు. కొత్తగా జీవించటానికి ఏమి వుంటుంది? ఇదే సముద్రం. ఎన్ని సార్లు చూడలేదు? కొత్తగా చూడటానికి ఏముంటుంది? ఇలా అనుకునేది జీవితమే కాదు. కడలి వొడ్డున మన కాళ్ళనే ఒక్క రీతిగా తడుపుతాయా అలలు? వెండి పట్టీలు తొడిగినట్లు ఒక మారూ, పడి వేడుకున్నట్టు ఇంకో మరూ, కాళ్ళకింది ఇసుకను తొలచి పట్టు తప్పిస్తున్నట్టు మరో మారూ- అలలు తాకిన ప్రతీ సారీ ఒక కొత్త అనుభూతి. ఒక్కతే చెలి. కానీ ప్రతీ ఆలింగనమూ ఒక కొత్త అనుభవం. అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచించుకోవాల్సిందే.!

అద్వానీకి ‘వాస్తు’ దోషం!

‘గురూజీ?’
‘వాట్‌: శిష్యా!’

‘అద్వానీ గారి ఉపన్యాసానికి వాస్తు దోషమేమన్నా వుందా గురూజీ?’
‘ఎందుకా అనుమానం శిష్యా?’

‘పాకిస్తాన్‌ వెళ్ళినప్పుడు జిన్నాను దేశభక్తుడన్నారు. ఇండియాకొచ్చాక మాట మార్చారు గురూజీ.’
‘అది పాత సంగతిలే శిష్యా.’

తెలుగు ‘జీరో’యిన్లు!

త.త..తమన్నా, తా..తా..తాప్సీ…!
తడబడితే అంతే ఇలా ‘త’ గుణింతమే వస్తుంది.
కాదు.. కాదు.. అనుకుంటూ, పోనీ క..క..కత్రినా… కా…కా..కాజల్‌..!
మరీ ఇంత కష్టపడితే ‘క’ గుణింతం మిగులుతుంది.
అయినా వాళ్ళెక్కడ? గురుడు లైను వేసే పిల్ల ఎక్కడ? గురుడికి ఎలా చూసినా తాను కన్నేసిన పిల్లే వీళ్ళను మించిన అందగత్తె. ‘తా వలచినది రంభ…’ వామ్మో! ఆవిడతో పోలికా? పెద్దావిడయిపోయారు.

చీకటి వేట!

అంతా అయిపోయిందనుకుంటాం. అందరూ కుట్ర చేసి మనల్ని ముంచేసారనుకుంటాం. నమ్మకం మీద నమ్మకం పోయిందనీ, ఆశ మీదే ఆశ చచ్చిందనీ తెంపు చేసుకుని వుంటాం. ఎవరో ఊరూ, పేరు తెలీని వారొచ్చి, ఉత్తినే సాయం చేసి పోతారు. చిన్న పలకరింపు లాంటి మాట సాయమే కావచ్చు. మండువేసవిలో కరెంటులేని గదిలో ఊపిరాడనప్పుడు, కిటికీలోంచి పిల్లవాయివొచ్చి మోమును తాకి వెళ్ళినట్టుంటుంది కదూ..! అప్పుడు మళ్ళీ జన్మలోనే మరో జన్మ యెత్తినట్లుంటుంది

శత్రు సూక్తం

మిత్రుడేం చేస్తాడు? నా అభిప్రాయాన్ని వినకుండానే సమర్థించేస్తాడు, నా పనులకు అనాలోచితంగానే సహకరించేస్తాడు, నా ప్రవర్తన ఎలా వున్నా మురిసి పోతాడు. ఒక్క ముక్కలో అద్దం లో నా ప్రతిబింబం లాంటి వాడు. నాలాంటి నన్ను చూసి నేను నేర్చుకునేదేముంటుంది- నటన తప్ప. అదే శత్రువనుకో. నా అభిప్రాయాన్నివ్యతిరేకిస్తాడు. నన్ను రెచ్చగొడతాడు. నా లోని శక్తియుక్తుల్ని బయిటకు తీస్తాడు. నా లోపాలని నాకు పటం కట్టి ప్రజెంట్ చేస్తాడు. అందుకే నేను నా మిత్రుడి కన్నా, శత్రువుకే ఎక్కువ రుణపడతాను.

ఎంత ‘వోటు’ ప్రేమయో!

‘రేయ్‌ ఈ కాఫీడేలో కూర్చోవాలంటే నాకు బోరు కొడుతోంది రా!’ అని ఒక ప్రియురాలు గారాబాలు పోతోంటే-
‘కాఫీ డే- కాక పోతే, టీ నైట్‌ వుంటుంది. అక్కడ కూర్చుందామా?’ అని ఊర్కోబెట్టాడు ప్రియుడు.
‘చంపుతాను- ఆ చావు వెటకారం ఆపక పోతే..! ముందు ఇక్కడనుంచి లేచి పోదాంరా ఇడియట్‌!.’
‘అప్పుడే- లేచిపోదాం- అంటే బాగుండదు. మన ఎఫైర్‌ మొదలయి రెండు రోజులు కూడా కాలేదు.’ నచ్చచెప్పబోయాడు.

Historian

Our Dreams make us feel guilty every time we shy away in making them true. I may dream of getting drenched in rain; dancing in a moon-lit night or sleeping under a tree. But I put off them for ever. I am draped in clothes knit by shame. Innocence is covered on the pretext of robing nudity. I can never be as nude as I was a child.

మనిషిలో మనిషి

నాలో నన్నూ, నీలో నిన్నూ, మనలో మనల్నీ వెతుక్కుంటూనే వుంటాం. ఒకరికి ఒకరు దొరుకుతాం కానీ, ఎవరికి వారు దొరకం. కానీ అప్పుడప్పుడూ దొరికి జారిపోతుంటాం. అలా దొరికినవి కొన్ని క్షణాలే కావచ్చు. అప్పుడు కల కూడా కవిత్వంలాగా వుంటుంది. జీవితం ప్రియురాలంత ఇష్టంగా వుంటుంది. పసిపిల్లంత ముద్దుగా వుంటుంది. నేను పుట్టిపెరిగిన ఇల్లంత గొప్పగా వుంటుంది. అందుకే నాలోకి నన్ను నెట్టేవాళ్ళ కోసం నిత్యం ఎదురు చూస్తూనే వుంటాను.

శస్త్రకారుడు

ధ్వంసం చేసాకే సృష్టి. కానీ పాత కొంపను కూల్చిన వాణ్ణి ఎవరూ గుర్తు పెట్టుకోరు. కొత్త ఇల్లు కట్టిన వాడికే సత్కారం.గొయ్యి తీయటం మనకి నచ్చదు. దాంట్లో పునాది రాళ్ళు వెయ్యటం మురిపెంగా వుంటుంది. చెత్తను తగులబెట్టే వాడికి క్షణమైన శిరస్సువంచిన జాతి మాత్రమే ముందుకు వెళ్తుంది. నిర్మాణానికి ముందు వింధ్వంసమే నడుస్తుంది- హొయలు పోయే సీతాకోక చిలుకక ముందు, ముడుచుకు పోయే గొంగళి పురుగు నడిచినట్లు…!

బ్లాక్(అవుట్) డే!

గురూజీ?
వాట్ శిష్యా!

‘నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలో షరిగా జరిపి నట్లు లేరు గురూజీ?.’
‘అవును శిష్యా. బ్లాక్ డే గా ప్రకటించారు శిష్యా.’
‘ఎవరు గురూజీ?’
‘తెలంగాణ వాదులంతా శిష్యా

నిన్నకు ముందు

గతంలో బతికే భూత జీవులూ, రేపటికి వాయిదా వేసే దూరాశా జీవులూ ఏం చేస్తారో తెలియదు కానీ, ఆ పేరు మీదు వర్తమానాన్ని వదిలేసుకుంటారు. కళ్ళ ముందే బస్సులు వచ్చి వెళ్ళిపోతున్నా, ఎక్కకుండా చోద్యం చూస్తారు. రూపాయికే కాదు.క్షణానికి కూడా మారపు రేటు వుంటుంది. కేవలం వర్తమానంలో బతికే వాడికే ఆ రేటు పెరుగుతుంటుంది. మిగతా వాళ్ళకి దారుణంగా పడిపోతుంటుంది.

అనుకుని చూడు!

పిచ్చి కోరిక ఏదయినా సరే చచ్చేటంత భయపెడుతుంది. ఉత్తినే, కంటికి ఇంపుగా కనిపించే అమ్మాయి నీ పక్కన వుంటే బాగుంటుంది- అని అనిపించిందనుకో. గుండె అదురుతుంది. కాళ్ళు వణుకుతాయి. దు:ఖమే దు:ఖం. ఉత్తినే కాకుండా, నిజంగా అనుకుని చూడు. లేని తెగింపు వస్తుంది. ఆమె కోసం, ఏడు సముద్రాలు ఈదాలనిపిస్తుంది. అంతా అనుకోవటంలోనే వుంటుంది.