Month: August 2012

ప్రజాస్వామ్యంలో రాచరికం!

దేవుడు లేక పోతే ఏమయింది? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించండి. ఇదో పాత సూక్తి. రాజులేక పోతే నష్టమేముంది? వెంటనే రాజునో లేక రాజునో సృష్టించండి. మన దేశ వర్తమాన చరిత్రను చూసినప్పుడెల్లా ఈ సూక్తిని ఇలా కొత్తగా మార్చుకోవాలనిపిస్తుంది. ఆలోచించటానికి బధ్ధకమయినప్పుడో, మృత్యువుభయపెట్టినప్పుడో-కొందరు నిజంగానే దేవుడుంటే బాగుండుననుకుంటారు. ఉన్నట్టు విశ్వసిస్తారు. ప్రజాస్వామ్యం వచ్చేశాక కూడా, రాచరికం మనస్సులో వుండి పోతుంది. కారణం కూడా అంతే.

‘వెనకబడ’తారు!’అంటు’కుంటారు!!

ఏ పార్టీకయినా హఠాత్తుగా ‘అంటరానివారు’ గుర్తొచ్చారంటే, ఆ పార్టీని వోటర్లు ‘వెలి’ వేశారని అర్థం చేసుకోవాలి. అలాగే ‘వెనుబడిన వారు’ గుర్తొచ్చారంటే ఆ పార్టీ వోట్లవేటలో ‘వెనుకబడిందీ’ అని అర్థం. ఆ లెక్కన చూసుకుంటే, పార్టీలన్నీ అయితే ‘అంటరాని’వో లేక, ‘వెనుకబడినవో’ అయినట్లే.

సోనియా కోపం- రాహుల్‌ కోసం!

సోనియా గాంధీ ‘బొగ్గు’ మన్నారు. పార్లమెంటు ‘మసి’బారింది. సమావేశాల్లో మరో రోజు ‘బ్లాక్‌’ డేగా మారింది. ఏమిటో అంతా ‘నలుపే’. బొగ్గు గనుల కేటాయిపుల అవకతకలపై ‘కాగ్‌’ నివేదిక చూశాక కాగి పోవాల్సింది ప్రతి పక్షం. కానీ, అదేమిటో పాలక పక్షం ఊగిపోతోంది. బీజేపీకి ‘బ్లాక్‌ మెయిలింగే బువ్వ’ అన్నారు సోనియా. బీజేపీ నేతలకు – ‘బ్లాక్‌’ మెయిలింగ్‌ లో ‘బ్లాక్‌’ ఒక్కటే అర్థమయింది. నలుపుకు నలుపే సమాధానం అనుకున్నారో ఏమో సమాధానం కూడా ‘నలుపు’తోనే ఇచ్చారు.

‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది!

‘కిరణ’ం ప్రకాశించటం లేదు. రాష్ట్రంలో ఇది వార్త కాదు.

ఎందుకు ప్రకాశించటం లేదు? ఇదీ ప్రశ్న.

ఈ ప్రశ్నకు పలువురూ ఇచ్చే జవాబు వేరు. పార్టీ అధిష్ఠానం వెతుక్కుంటున్న సమాధానం వేరు.

కిరణంలో కాంతి తక్కువయిందని అందరూ అంటారు.

కానీ, పార్టీ హైకమాండ్‌ అలా అనదు. చుట్టూ చీకటి తక్కువయిందీ- అని అంటుంది.

అందుకే కాబోలు- ‘కిరణ్‌’ చుట్టూ చీకట్లు పెంచుతోంది.

కిరణ్‌ మంత్రి వర్గంలో ‘కళంకితుల’ శాతం పెరుగుతున్న కొద్దీ, ఆయన ఉనికి పెరుగుతుందన్నది హైకమాండ్‌ భావన కాబోలు. ఇంతవరకూ మిణుకు మిణుకు మని దిగులుగా మెరుస్తున్న ‘కిరణం’ ఇప్పటికయినా ప్రకాశవంతంగా కనిపించక పోతుందా-అని ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చిగురంత ఆశ కాబోలు.

గాంధీ భవన్‌లో ‘ప్రజారాజ్యం’?

2014. ఇది ఒక అంకె కాదు. ఒక గురి. చేప కన్ను. మన రాష్ట్రంలో నే కాదు, కేంద్రంలో కూడా అందరి లక్ష్యం 2014.

ఈ ‘విజన్‌ 2014’ను సాకారం చేసుకోవటానికి ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. అన్ని పార్టీల కన్నా, అధికారంలో వున్న కాంగ్రెస్‌ ఎక్కువ హడావిడి చేస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ని ప్రధానిని చెయ్యాలి. అందుకు తగ్గట్టుగా పెద్ద రాష్ట్రాలన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ పార్లమెంటు సీట్లను కొట్టేయాలి. రాష్ట్రంలో మరో మారు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇదే ‘సోని(యా) విజన్‌ 2014.

కిరణ్‌-పాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ!

వెనకటికి, ఒక హాలీవుడ్‌ తార పనుల హడావిడిలో పడి, తన పెళ్ళికి తాను హాజరు కావటం మరచిపోయిందట. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి కూడా ఈ మధ్య తన సన్మాన సభకు తాను గైర్హాజరయ్యారు. ఆయనకూ పనుల హడావిడే నంటే నమ్ముతారా? నమ్మరు. ‘అంతా. గ్యాస్‌’ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నిండా ‘గ్యాసే’. పడని ఇద్దరి కాంగ్రెస్‌ నేతల మధ్య ‘గ్రాసే'(పచ్చగడ్డే) వేయ నవసరం లేదు. కొంచెం ‘గ్యాస్‌’ వేసినా చాలు. భగ్గు మంటుంది.

అన్నా ‘బేజారే’!

పేరు : అన్నా హజారే

దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ మహాత్ముడు ( అంతా రాని ‘లోక్‌పాల్‌’ మహిమ. లేకుంటే, మాజీ సైనికుడిగానే మిగిలిపోయేవాణ్ణి)

ముద్దు పేర్లు : అన్నా( ముచ్చటొచ్చి ‘అన్నా’నంటారు. నిజంకాదు. నేనేదయినా ‘అన్నా’నా? కేవలం విన్నానంతే-కిరణ్‌ బేడీ చెప్పిందీ,కేజ్రీవాల్‌ చెప్పిందీ.), ‘బేజారే'(లక్షల్లో జనాన్ని చూసి ఏడాది తర్వాత వందల్లో చూడాల్సి వస్తే బేజారు గా వుండదూ!)

విద్యార్హతలు : నేనొప్పుకోను.. విద్యే అర్హత అంటే నేనొప్పుకోను. ఏడవతరగతి వరకూ చదువుకున్నాను. మనదేశంలో రాజ్యాంగాన్ని విమర్శించటానికి, మార్చటానికి చదువు అవసరమంటారా?(రాయటానికయితే చదువులు కావాలేమో లెండి.)

Will Aruna Bahuguna Succeed Dinesh Reddy As DGP?

Can woman be the Top Cop in Andhra Pradesh? The day a female IPS officer to assume the highest office of the Police, Director General of Police(DGP) is not far off. The three officers of 1979 cadre, among which the Chief Ministers has to make a choice to succeed Dinesh Reddy, fortunately include a woman too. She is none other than Aruna Bahuguana. The other two are: S.A Huda and B.Prasada Rao.

అగ్రకులాంతర వివాహాలు!

రాజకీయంగానూ, పారిశ్రామికంగానూ అగ్రభాగాన వున్న వారే ఈ ‘ఆదర్శాన్ని’ పాటిస్తున్నారు. కానీ మధ్యతరగతి వారు సరసమైన కట్నానికి సాటి కులస్తుడు దొరికే వరకూ ఎదురు చూస్తున్నాడు. ‘ఆదర్శం’ కూడా ఖరీదయినదే. అది సంపన్నులకే అందుబాటులో వుంటోంది.

‘ఖాకి’ వన్నె లేళ్ళు!

ప్రజాస్వామ్యం కూడా నలుగు రంగులు వుంటాయి. అది కూడా ఒక రకంగా చూస్తే చాతుర్వర్ణ వ్యవస్థే. శాసన శాఖ ‘పచ్చ’గా వుంటుంది. అక్కడికి గెలిచి వచ్చేది ‘పచ్చ’ నోట్లతోనే కదా! న్యాయశాఖ నల్ల గా వుంటుంది. న్యాయవాదులూ, న్యాయమూర్తులు వేసుకునే (కొందరి విషయంలో జేబులో వేసుకునే) ‘కోట్ల’ సాక్షిగా ‘నల్ల’గా వుంటుంది. మరి ‘మీడియా’? ఏ రంగులో చూస్తే ఆరంగులో కనిపిస్తుంది. ఇంతకీ ప్రజాస్వామ్యం కీలకమైన ‘కార్యనిర్వాహక’ వాఖ (గవర్నమెంటు) ఏ రంగులో వుంటుంది? ఈ ప్రశ్న సాధారణ పౌరుణ్ణి అడగాలి. తడుముకోకుండా ‘ఖాకీ’ రంగులో వుంటుందని చెబుతాడు.

Sashidhar Reddy Precedes Others In CM Race!

Amid rumoured certainty of the change of the guard in AP, the name of a leader, who has been seldom talked about, has taken dramatic precedence to all other familiar aspirants. He is none other than Marri Sashidhar Reddy. He has been away from all the feuds with in the congress, at least, after the demise of Y.S. Rajasekhara Reddy, whom he was opposed to.

మోహ ఫలం

కరచాలనమొక స్పర్శ. కౌగలింత మహా స్పర్శ. ముద్దు మహోన్నత స్పర్శ. అవును. దేశ భాషలందు ‘దేహ భాష’ లెస్స. తల్లి తల నిమిరినా, తండ్రి గుండెలకు హత్తుకున్నా, గురువు వెన్ను తట్టినా, ప్రియురాలు ఒంటికి ఒంటిని అంటుకట్టినా స్పర్శే కదా! మనిషిని మనిషి తాకవద్దన్నవాడు ‘దేహ’ద్రోహి!తాకని తనాన్ని వెలి వేద్దాం.

మెత్తని సంభాషణ!

కఠినంగా ఏది కనిపించినా మనం ఊరుకోం. కొబ్బరి పెంకును బద్దలు కొట్టి మెత్తని తెల్లదనాన్ని చూస్తాం. రాయి కఠినం. చెక్కేసి ఒక సుకుమారిని చేసేస్తాం. ప్రపంచమంతా పైకి కఠినమే. పై కవచాన్ని తొలిచేస్తే లోన పసిపాపే. అప్పడు భూగోళాన్ని ఒళ్ళోకి తీసుకోవచ్చు. అరమరికలు మరచి ముద్దాడ వచ్చు. ఈ భోగం ఒక కవి కి తెలుస్తుంది. తప్పితే తెలిసేది కళాకారుడికే.

‘ఆత్మ’ రాముడు నటిస్తాడా?

నేడు స్నేహ దినోత్సవం.స్నేహానికి నిర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడెల్లా సినిమా రంగం నుంచి ‘బాపు-రమణ’లను ఉదహరించేవారు. కానీ వైయస్‌ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరో ఉదాహరణ రాజకీయ రంగంనుంచి దొరికేసింది. ‘వైయస్‌-కె.వి.పి’లను ఆ రీతిలో కీర్తించటం మొదలు పెట్టారు.( వారికి ఇలాంటి స్నేహం దశాబ్దాల నుంచీ వుండవచ్చు. కానీ ఆ విషయం లోకానికి కాస్త అలస్యంగా తేటతెల్లమయింది.) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో ఎప్పుడూ రెండు పాత్రలు కనిపిస్తుండేవి. ఒకటి ‘ఆత్మ’, రెండు ‘నీడ’. ఆత్మ- కె.వి.పి రామ చంద్ర రావు అయితే, నీడ-సూరీడు. కానీ పాపం. వైయస్‌ చివరిసారిగా హెలికాప్టర్‌ ఎక్కినప్పుడు మాత్రమే ‘ఆత్మ’నీ, ‘నీడ’నీ వదలేశారు.

‘ఫెరా’ సారథి!

పేరు : కె.పార్థ సారధి

దరఖాస్తు చేయు ఉద్యోగం: అంత ఆశ లేదు. ఉన్న ఉద్యోగం(రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖామంత్రి పదవి) ఊడకుండా వుంటే చాలు. (రెండేళ్ళ శిక్ష పడింది. నిజమే. రెండేళ్ళ పదవీ కాలం కూడా వుంది.)

ముద్దు పేర్లు : ‘ఫెరా’సారధి, పార్థ ‘ఫెరా’రథి. ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఫెరా) ఉల్లంఘించాననే శిక్ష వేశారు లెండి. (రాజీనామా చేయకుండా పదవినే అంటి పెట్టుకుని వుంటున్నానని కిట్టని వారు కొందరు -‘స్వార్థ’ సారధి అంటున్నారు లెండి. నా అనుచరులయితే ఇప్పటికీ నన్ను ‘నిస్వార్థ’ సారధి అంటారు)

పెద్ద కుర్చీలో ‘చిరు’ నేతా?

రాష్ట్రంలో ‘అకాల’ జ్ఞానులు పెరిగిపోతున్నారు. అడక్కపోయినా, ఆపి మరీ జోస్యం చెప్పేస్తున్నారు. చంద్ర శేఖర సిధ్ధాంతి (కె. చంద్రశేఖరరావు) హఠాత్తుగా వచ్చే నెలలో(సెప్టెంబరులో) తెలంగాణ తేలిపోతుందంటారు. ఈయనకు గతంలో కూడా ఇలాంటి జ్యోతిషం చెప్పిన అనుభవం వుంది. కానీ ఆంధ్ర నుంచి, ఇంకో సిధ్ధాంతి బయిల్దేరారు. ఆయనే రామచంద్ర సిధ్ధాంతి( గుడుల మంత్రి సి.రామచంద్రయ్య). చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ద్వారాకా తిరుమలలోని ‘కాపు కళ్యాణమంటపం’లో చెప్పారు. వీరు హాస్యాలాడుతున్నారా? లేక జోస్యాలాడుతున్నారా? రాజకీయాల్లో రెంటికీ పెద్ద తేడా ఏమీ వుండదు లెండి.

తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్‌ నుంచి వెనుతిరిగిన వై.యస్‌ జగన్‌, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్‌ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.