Month: March 2013

‘కుటుంబ’ నిధి!

పేరు : కరుణా నిధి

ముద్దు పేర్లు : కుటుంబ నిధి.( నాకుటుంబానికి నిధి లాంటి వాడిని).రణ నిధి. విరమణ నిధి. రుణ నిధి. దారుణ నిధి

విద్యార్హతలు : కళలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను.

హోదాలు : అప్పుడప్పుడూ జయలలిత ఇచ్చే ‘కమర్షియల్‌ బ్రేకు’లు మినహా ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రినే. ఇప్పుడు ‘కమర్షియల్‌ బ్రేకు’ నడుస్తోంది కాబట్టి నన్ను ‘మాజీ’ అంటున్నారు. అంతే.

‘వోటు’ సీసాలో లోటు’ద్రవం’

పెళ్ళికొడుకూ మారవచ్చు. పెళ్ళికూతురూ మారవవచ్చు. కానీ పురోహితుడు అవే మంత్రాలు చదువుతాడు. వాయిద్యకారులు అవే భజంత్రీలు వాయిస్తారు.

బడ్జెట్‌ మారవచ్చు. బడ్జెట్‌ ప్రసంగమూ మారవచ్చు. కానీ, అధికార పక్షం నేతలు అవే పొగడ్తలు పొగడుతారు. ప్రతిపక్షనేతలు అవే సణుగుళ్లు సణుగుతారు.

‘ఇది ప్రజల సంక్షేమం కోరే బడ్జెట్‌’. ఇంత పెద్ద బాకా ఎవరు ఊదుతారు? పాలక పక్ష సభ్యులు తప్ప.

‘ఇది అంకెల గారడీ. పేద వాడి కడుపు కొట్టే బడ్జెట్‌’ ఈ కడుపు నొప్పి ఎవరిదో అర్థమయ్యింది కదా! ఇది సదరు ప్రతిపక్ష సభ్యులది.

ఏడ్చినట్టుంది రాజకీయం!

సినిమాలే కాదు, రాజకీయాలు కూడా సెంటిమెంటు మీద ఆడేస్తాయి. తెలుగుప్రేక్షకుడి దృష్టిలో సెంటిమెంటు అంటే మరేమీ కాదు, ఏడుపు. అవును ఉత్త ఏడుపే.

ఎంత చెట్టుకు అంత గాలి లాగా, ఎంత డబ్బుకు అంత ఏడుపు. అదే హైదరాబాద్‌. ముఫ్పయి రూపాయిల పెట్టి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ లో వున్న సినిమాలోనూ ఏడ్వవచ్చు. నూటయాభయి రూపాయిలు పెట్టి మల్లీప్లెక్స్‌ థియేటర్‌లోనూ ఏడ్వవచ్చు. కాళ్ళు ముడుచుకుని. ముందుకుర్చీల్లో కూర్చున్న తలల మధ్యనుంచి చూస్తూ ఏడ్వవచ్చు. వెల్లికిలా చేరపడి, కాళ్ళుతన్ని పెట్టి ‘రిక్లయినర్‌’ ఏడ్పూ ఏడ్వవచ్చు.

మానవేతరులు

నిజమే. తీయాలనే వుంది. ఉరి తీయాలనే వుంది. దేహాలను దురాక్రమంచే కిరాతకాన్ని ఉరితీయాలనే వుంది. అమ్మదగ్గర తాగిన పాలు అమ్మాయిదగ్గర కొచ్చేసరికి విషం గా మారిపోతున్నాయి. ఇందుకు కారణమైన ‘అజీర్ణ‘ క్రిమిని పట్టుకుని పీక నులిమేయాలని వుంది. కానీ ఈ క్రిముల పెంపకాన్ని పరిశ్రమగా పెట్టారని తెలిసింది. వారెవ్వరూ తేలేవరకూ ఉరి ప్రశ్నార్థకంగా వేలాడుతూనే వుండాలా? అందాకా ఈ క్రిమిసోకిన వాడి రోగలక్షణాలని జనానికి చెబుదాం. ఈ రోగలక్షణాలున్న మానవేతరులను మచ్చుకి కొందరిని పరిచయం చేస్తాను.

మూడో ఫ్రంట్ కు ములాయం ముహూర్తం?

బొమ్మా? బొరుసా?

ఇలా పందెం కట్టటానికి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా వీల్లేని పరిస్థితి వచ్చింది. అయితో బొమ్మో, బొరుసో కాకుండా, నాణానికి మూడో వైపు చూడాల్సి వస్తోంది. యూపీయే, ఎన్డీయేలు కాకుండా ఇంకో కొత్త కూటమి తన్నుకు వచ్చేటట్టుగా వుంది. ఈ అవకాశాన్ని డి.ఎం.కె నేత కరుణానిధి సుగమమం చేశారు. యూపీయే అదమరచి వుండగా, దాని కాళ్ళ కింద తివాచీని అమాంతం లాగేశారు. దాంతో యూపీయే సర్కారు మనుగడ వెలుపలి శక్తుల మీద ఆధారపడింది.

అవిశ్వాసం అరక్షణమే!

‘పచ్చనోట్లిచ్చి పంచమన్నారు కదా- అని పంచేశాను. వోటేస్తారో లేదో?’

ఇది వోటరు మీద బ్రోకరుకు కలిగే అవిశ్వాసం.

‘వార్డుకు పదిలక్షలని…మొత్తం కోటి నొక్కేశాడు. వోటుకు వందయినా ఇచ్చాడోలేదో..?’

బ్రోకరు మీద అభ్యర్ధికి కలిగే అవిశ్వాసం.

‘టిక్కెట్టుకు పదికోట్లన్నానని, లెక్కెట్టుకుని పదీ ఇచ్చేసి ఎమ్మెల్యే టిక్కెట్టు పట్టుకు పోయాడు. ప్రచారానికీ, పంపిణీకి ఖర్చు పెడతాడో లేడో..?’

అభ్యర్ధి మీద నాయకుడికి కలిగే అవిశ్వాసం.

కలవని కనుపాపలు

రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు

ఒకటి: మాకు

రెండు: మా వాళ్ళకు

మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు

ఎవడో జల్సారాయుడు

వాడక్కూడా

అంటరాని రోగం తగిలించాడు

పుట్టుమచ్చల్లేని కవలల్ని

పచ్చబొట్లతో వేరు చేశాడు

కిరణ్ ను గిల్లితే, బాబు గొల్లుమన్నారు

పెళ్ళీ, ప్రజాస్వామ్యమూ రెండూ ఒక్కటే. రెండూ రెండు తంతులు. తంతులో తంతులాగా, పెళ్ళితంతులో కాశీ తంతు ఒకటి వుంటుంది. శుభమా- అని పెళ్ళి జరుగుతుంటే, పెళ్ళి కొడుకు తాటాకు గొడుగు ఒకటి పట్టుకుని , చెక్క చెప్పులు వేసుకుని కాశీకి పోతానంటాడు. అప్పుడు అతని బావమరది (అనగా పెళ్ళికూతురు తమ్ముడు) వచ్చి పెళ్ళికొడుకు గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, ‘బావగారూ, కాశీకి వెళ్ళకండి, మా అక్కను ఏలుకోండి. ప్లీజ్‌’ అంటాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు కాస్త బెట్టు చేసి, వెనక్కి వచ్చేసి, పెళ్ళికూతురు చెయ్యి పట్టేసుకుంటాడు. ఈ

మన కౌగిళ్ళలో మహానటులు!!

నటించటమంటే మరేమీ కాదు, నమ్మించెయ్యటమే.

తానే కృష్డుణ్ణని నమ్మించేశారు ఎన్టీఆర్‌ ఆరోజుల్లో. ఎంతటి ఎన్టీఆర్‌కయినా మిత్రులూ, అభిమానులతో పాటు శత్రువులు కూడా వుంటారు కదా! వాళ్ళల్లో భక్తులు కూడా వుండే వుంటారు. వారికష్టం ఎంతటిదో ఊహించుకోండి. కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి ఊహించుకుంటే ఎన్టీఆర్‌ వచ్చేస్తుంటాడు. మరి ఎన్టీఆరే కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి తలచుకుంటే, ఆయనకు ఏ రూపం కనపడేదో..?! ఆది ఆయన గొడవ. వదిలేద్దాం.

ఏనుగు లేదా? ఎలుకయినా, ఓకే!

ప్రేయసిని కోల్పోతే..? దేవదాసు అవుతాడు.

పదవిని కోల్పోతే..?! ఖాళీగ్లాసు అవుతాడు.

అతనికీ, ఇతనికీ ఒక్కటే తేడా. ఒకడికి గ్లాసు ఫుల్లుంటుంది. ఇంకొకడికి గ్లాసు నిల్లుంటుంది.

ద్రవాన్ని బట్టి గ్లాసుకు విలువ కానీ, గ్లాసును బట్టి ద్రవానికి కాదు.

పదవి పోయినా పాలిటిష్యనూ, పదవి వున్న నేతా చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు.

అది గంజిపట్టించి ఇస్త్రీ చేయించిన ఖద్దరు చొక్కా, అదే రేబన్‌ కళ్ళజోడూ, అదే క్వాలిస్‌ బండీ, అదే సఫారీ వేసుకున్న ఉబ్బిన బుగ్గలూ, బండ మీసాలూ వున్న మనుషులు.

కొడుకులే, కొడుకులు!!

అడపా దడపా పుత్రికా వాత్సల్యం కూడా వుండక పోదు.

ఇప్పటి మన నేతలు ఈ విషయంలో దృతరాష్ట్ర, ద్రోణాచార్యుల రికార్డులు కొట్టేస్తున్నారు. కొడుకు( సుయోధనుడి) మీద వున్న ప్రేమతో కొడుక్కి పోటీరాగల భీముడి శిలా ప్రతిమను తన ఉక్కు కౌగిలో తుక్కుతుక్కు చేసేస్తాడు ధృతరాష్ట్రుడు. కొడుకు అశ్వత్థామ చనిపోయాడన్న ‘గాలి వార్త’ వినగానే, ధ్రువపరచుకోకుండానే, యుధ్దంలో అస్త్రాలు వదిలేస్తాడు ద్రోణుడు.

కొడుకులు తర్వాతే, ఎవరయినా. ఇదే నాటి భారతం, నేటి భారతం కూడా.

తెర మీదకు తమిళ ప్రధాని?

దేశం లో అత్యున్నత పదవి ఏది?

పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగితే పిల్లలు ఈ సారి తెల్ల ముఖం వెయ్యాల్సిందే.

గతంలో లాగా, హోదాకు రాష్ట్రపతి, అధికారానికి ప్రధానమంత్రి- అని రాస్తే తప్పయ్యే ప్రమాదం వుంది. ఎలా తప్పూ- అంటే చెప్పలేం. చాలాకాలం పదవుల ఔన్నత్యాన్ని రాజ్యాంగమే నిర్ణయించింది. ఇప్పుడు రాజకీయమే నిర్ణయిస్తుంది.

రాష్ట్రపతి, ప్రధాని పదవులను మించిన పదవొకటి తొమ్మిదేళ్ల క్రితం తన్నుకొచ్చింది. ఆ పోస్టు పేరే ‘యూపీయే ఛైర్‌ పర్సన్‌’.

పిట్ట ‘కథాం’బరం

పేరు : చిదంబరం

ముద్దు పేర్లు : ‘పదా’ంబరం( లెక్క ప్రకారం బడ్జెట్‌ లెక్కల్లో వుండాలి. కానీ ఈ సారి సంక్షేమం వరకూ మాటలు జాస్తి, అంకెలు నాస్తి) మహిళలనీ, యువతనీ, పేదల్నీ పొగడ్తల్లో ఆకాశంలోకి ఎత్తాను. కేటాయింపుల్లో కొంచెమే ఇవ్వగలనని నాకు ముందే తెలుసు.’కథ’ంబరం( బడ్జెట్‌ నిండా పిట్ట కథలే!)

2014- ఎ హేట్‌ స్టోరీ!

ఈ మాట అనటం ‘అ లవ్‌ యూ’ అన్నంత ఈజీ కాదు. అందుకే రచయితలు- ప్రేమ కథలు రాసినంత సులువుగా ద్వేష కథలు రాయలేరు. కానీ రహస్యమేమిటంటే- ద్వేషం ఇచ్చిన కిక్కు, లవ్వు ఇవ్వదు. తెలుగులో ఫార్ములా ఫ్యాక్షన్‌ సినిమాలే తీసుకోండి. ఫస్ట్‌ హాఫ్‌ ముద్దులూ, సెకండ్‌ హాఫ్‌ తొడ కొట్టుళ్ళూ. అంటే ఇంటర్వెల్‌కు ముందు డ్యూయెట్లూ, ఇంటర్వెల్‌ తర్వాత నరుకుళ్ళూ, చంపుళ్ళూ. ఈలలు దేనికి వస్తాయి?పగకే. ప్రేమకే. రాజకీయాల్లోనూ అంతే.

కుర్రదీ, కుర్రాడూ, ఓ తమిళబ్బాయ్‌!

ప్రేమ చౌక- అని చెప్పిందెవరూ..? అదెప్పుడూ ప్రియమైనదే. అనగా ఖరీదయినదే.

కాకుంటే ఇప్పుడు ప్రియాతిప్రియమయి పోయింది.

‘నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోదామనుకుంటున్నాను.’ అన్నాడు దేవ్‌.

‘అదేమిటీ? నువ్వు ఉగ్రవాదివా?’ఉలిక్కి పడ్డాడు అతడి మిత్రుడు యమ.