Month: April 2013

బుల్లి పెట్టె లో ‘బూతో’డు!

‘టెర్రరిస్టు ఎలా పుడతాడు?’

‘దేశం మీద మరో దేశం పడినప్పుడు’

‘ఎక్స్ట్రీమిస్టు ఎలా పుడతాడు?

‘వర్గం మీద మరో వర్గం పడినప్పుడు’

‘రేపిస్టు ఎలా పుడతాడు?’

‘… ….. ….. ……!’

అవును. ఈ ప్రశ్నకు సమాధానం లేదు.

శీను వైట్లా, కథ లేదెట్లా?

కొసరు ముందు; అసలు తర్వాత.

కామెడీ ట్రాక్‌ ముందు, కథ తర్వాత.

అది యెట్లా- అంటే శీను వైట్లా-అనాల్సి వస్తుంది.

పూర్వం టిఫిన్లు తినటం కోసం రెస్టారెంట్లకు వెళ్ళే వారు. కానీ ఈ మధ్య ‘బ్రేక్‌ ఫాస్ట్‌’ చేయటంలో కూడా ట్రెండ్‌ మారింది. చట్నీలు భోంచెయ్యటం కోసమే హొటళ్ళకు వెళ్తున్నారు. హోమియో గుళిక లాంటి ఇడ్లీ ముక్కను ఆరగించటానికి గంగాళాల కొద్దీ చట్నీలను వడ్డిస్తారు. దాదాపు సినిమాలో వైట్ల తెచ్చిన ట్రెండ్‌ ఇదే.

రెండు గంటల హాస్యానికి, అర్థ గంట కథను జోడిస్తారు.

మేల్‌! చావని నిజం!!

‘ ఏంటండీ ఇదీ! ఎందుకు పెట్టారీ చర్చ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, ఈ పెద్దమనుషుల చేత మహిళలను అవమానించటానికి పిలిచారా? ఏంటండీ ఈ మాటలూ? పౌరుషమేమిటీ? అంటే వీరత్వమనా? పురుషులకే వీరత్వముంటుందా? గాజులు తొడిగించుకోవటమేమిటీ? గాజులు తొడుక్కునే స్త్రీలు పిరికివాళ్ళనా? మగాడివయితే … అంటే మగాడే పెద్ద పోటు గాడనా? స్త్రీ కాదనా? ’

‘డ్రామ్‌’ నారాయణ రెడ్డి

పేరు : ఆనం రామ్‌నారాయణ రెెడ్డి.

ముద్దు పేర్లు : ‘డ్రామ్‌’ నారాయణ రెడ్డి (ఒకప్పుడు జగన్‌కు దగ్గర, ఇప్పుడు దూరం. దీనిని డ్రామా అంటారు తప్పు కాదూ! ‘కన్యాశుల్కం’ లో గిరీశం ఏమన్నాడూ.. ‘ఒపీనియన్స్‌ చేంజ్‌ చేస్తే కానీ పాలిటిష్యన్‌ కాలేడు’ అన్నాడు) . రామ్‌ ‘నోరా’యణ రెడ్డి.(అందరికీ నోరుంది. కానీ పనిచెప్పరు. నేను చెప్పాను. జగన్‌ ను ఉరితీసినా తప్పులేదన్నాను. అయితే ఆయన పార్టీ వారికి కూడా నోర్లుంటాయని మరచిపోయాను. వారు నన్ను ఉరితీయాలంటున్నారు. ఊరికే అంటాం కానీ… అన్నీ జరిగిపోతాయా…ఏమిటి?)

మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం!

నవ్వటం మరచిపోయాం. ఇదో ఫిర్యాదు. అక్కడికి ఏడ్వటం పూర్తిగా తెలిసిపోయినట్లు! సుష్టుగా భోజనం చేసినట్లు, తృప్తిగా దు:ఖించి ఎన్నాళ్ళయింది? రెండువందలు తగలేసినా మల్టీప్లెక్స్‌లో మూడు సెకండ్లకు మించి కళ్ళు చెమర్చటం లేదు. ఎంత దగ్గరవాడు పోయినా ఏడుపు వచ్చి చావటం లేదు.

దగ్గర..దగ్గర..అని ఉత్తినే మాట్లాడుకుంటున్నాం కానీ, కొలిచి చూస్తే, కౌగిలిలో వున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య దూరం పదివేల కిలోమీటర్లు. ఎదలు కలిస్తే కదా, ఎడబాటు తెలియటానికి!

పిచ్చివాడి మెడలో స్టెతస్కోపు!

మంచి వాళ్ళలో పిచ్చివాడిని గుర్తించినంత సులువు కాదు, పిచ్చివాళ్ళలో మంచి వాడిని గుర్తించటం. ఒక్కొక్క సారి పిచ్చాసుపత్రిలో వైద్యుణ్ణి పోల్చుకోవటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పిచ్చివాళ్ళు కూడా తెల్ల కోట్లు వేసుకుని, మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరగవచ్చు.

వెనకటికి పండిట్‌ నెహ్రూ కాబోలు ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఓ పిచ్చాసుపత్రిని సందర్శించారు. లోపలికి వెళ్ళగానే, ఒక వ్యక్తి నెహ్రూను మర్యాదగా పలకరించి, ‘పే పేరేమిటీ?’ అన్నాడు.

‘చెయ్యి’ ఊపండి! ‘కారు’ ఆగుతుంది

పాత ఫ్రిజ్జు తెచ్చుకోండి. కొత్త ఫ్రిజ్జు తీసుకు వెళ్ళండి. ఇది వాణిజ్య ప్రకటన.

పాత కారు తెచ్చుకోండి. కొత్త కారు తీసుకువెళ్ళండి. ఇదీ వాణిజ్య ప్రకటనే అనుకుంటున్నారా? కాదు. ఇది రాజకీయ ప్రకటన.

మీ మొబైల్‌ నెంబరు అదే వుంటుంది. మీరు ఏ సర్వీస్‌ ప్రొవైడర్‌ దగ్గర వున్నా వెంటనే ‘టాటా డొకోమో’కు మారండి. ఇది వాణిజ్య ప్రకటన.

మీరు కూర్చున్న కుర్చీ మారదు. కాకుంటే కుర్చీ మీద వున్న స్టిక్కర్‌ మారుతుంది. మీరు ఏ స్టిక్కర్‌ తో వున్నా, ‘గులాబీ’ స్టిక్కర్‌లోకి మారండి. ఇదీ రాజకీయ ప్రకటనే.

మోడీ బాడీ ‘సిక్స్‌ ప్యాక్‌’ కాదా..?

మతిమరపు ఒకటే. నమూనాలు వేరు.

చాలా కాలం క్రితం పత్రికలో ఓ కార్టూన్‌ అచ్చయింది- మతిమరపు మీదే. గురు శిష్యులు క్లాస్‌కు వస్తుంటారు. గురువుగారికి చొక్కా వుండదు. ఆయన వెనకాలే నడుస్తున్న శిష్యుడికి ఫ్యాంటు వుండదు. అలాగని గురువుని మించిన శిష్యుడు-అని నిర్ధారణకు వచ్చేయనవసరం లేదు. ఇద్దరు మరచిపోయింది దుస్తులే కావచ్చు. శరీరాన్ని ఒకరు పైభాగం కప్పటం మరచిపోతే, ఇంకొకరు కింద భాగాన్ని మరచిపోయారు.

వృద్ధిలోకూడా ఎవరి నమూనా వారికి వుంటుంది.

‘ఏ-ఫోర్‌’ సబితమ్మ!

పేరు : సబితా ఇంద్రారెడ్డి

ముద్దు పేర్లు : చేవెళ్ళ చెల్లెమ్మ, ‘ఏఫోర’్‌ సబితమ్మ.

విద్యార్హతలు : ఒకప్పడు మంత్రి భార్యను. తర్వాత ఏకంగా ‘రాజు’కు చెల్లెల్నయ్యాను. రెంటికీ పెద్ద అర్హతలు అవసరం లేదు. చదివింది సైన్సయినా సెంటిమెంటు కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాను.’రాజన్న’ ఏ పని తలపెట్టినా నన్నే ఎదురు రమ్మనే వాడు.(చేవెళ్ళ చెల్లెమ్మ ఎదురూ రావమ్మా- అని). అలాగని ఆయన చెప్పిన ఏపనికీ ఎదురు చెప్పలేదని కాదు.

గాంధీ బొమ్మ ముందు గాంధారీ పుత్రులు!

‘గాంధీ గారి దేశంలో గజానికో గాంధారీ పుత్రుడు’ అని కవి కాస్త ముందు అనేశాడు. ఇప్పుడయితే ఈ వాక్యాన్ని ఇంకొంచెం మార్పు చేసి,’గాంధీగారి బొమ్మ ముందు గజానికో గాంధారీ పుత్రుడు’ అని పలికేవాడు.

అనగనగా తెనాలి. ఏ ఊరు వారికి ఆ ఊరు మది వల్లమాలిన అభిమానం వుంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఊరు వదిలాక, ఈ అభిమానం ఇంకా పెరిగిపోతుంది. కొన్ని ఊళ్ల వారికి ఈ అభిమానం మోతాదు మరీ ఎక్కువగా వుంటుంది.

పూజిస్తే, ఓ పనయి పోతుంది!!

ఆచరించేటంత పెద్ద పనీ ఎవరో కానీ పెట్టుకోరు. సుఖమైనదీ, సులభమైనదీ, గౌరవప్రదమైనదీ మరో పని వుంది: ఆరాధించటం.

పెద్దవాళ్ళనీ, గొప్పవాళ్ళనీ తలచుకోవటమంటే- వాళ్ళ ఫోటోలకు దండ వెయ్యటమో, లేక వాళ్ళ విగ్రహాలను ప్రతిష్టించటమో, లేదా వాళ్ళ పేరు మీద ఎవరికన్నా అవార్డు లివ్వటమో. ఇదంతా ఆరాధనా కార్యక్రమమే.

మన రాజకీయం మూడు ముక్కల్లో!

ఆవేశాలు, అవసరాలు, అధికారాలు. ఈ మూడే రాష్ట్రరాజకీయాల భవిష్యత్తును నిగ్గుతేల్చనున్నాయి.

ఆవేశాలు మనుషుల్ని ఊగిపోయేటట్టు చేస్తాయి. ఒకపైపు ఒరిగిపోయేటట్టు కూడా చూస్తాయి. కానీ ఒక ఆవేశాన్ని ఏళ్ళ తరబడి నిలబెట్టటం కష్టం.

సానుభూతి ఒక ఆవేశం. హఠాత్తుగా ఒక జనాకర్షక నేత అదృశ్యమయితే కలిగే దు:ఖం ఆపారం. ఈ దు:ఖాన్ని జనం మోయలేరు. అందులోనుంచి ఉపశమనం పొందటానికి ఆ స్థానంలో ఎవరయినా వస్తే బాగుండునని చూస్తారు.

‘నరేంద్ర’ నాథ్‌ సింగ్‌!

పేరు : రాజ్‌ నాథ్‌ సింగ్‌

ముద్దు పేర్లు : ‘నరేంద్ర’ నాథ్‌ సింగ్‌( పేరు కు పార్టీలో నా బృందాన్ని ‘టీమ్‌ రాజ్‌ నాథ్‌’ అంటారు. కానీ ఈ మధ్య ఓ ప్రముఖ దినపత్రికలో ఓ కార్టూను చూశాను. పార్లమెంటరీ బోర్డులో వున్న సభ్యులందరికీ నరేంద్ర మోడీ ముఖాలే( మాస్క్‌లే) వున్నాయి. నేను కూడా మినహాయింపు కాదు.

విద్యార్హతలు : చదివింది ‘భౌతికం’ (భౌతిక శాస్త్రం) అలోచన ‘వైదికం’. అందుకే నేను ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయనప్పడు పాఠ్యపుస్తకాల్లో మామూలు గణితం తీసి పారేసి, వేద గణితం పెట్టాను. లేక పోతే ఏమిటి చెప్పండి! ఎవరు బడితే వారు ‘విజన్‌ 2020’ అంటారు. నా విజన్‌ అది కాదు. క్రీ.పూ 1010. అప్పటికి సమాజాన్ని నడిపించాలంటే మనకి వేదాలే

కట్జూ స్టెప్పెస్తే న్యూస్‌!!- –కట్జూ స్లిప్పయితే న్యూస్‌!!

కుక్కల్ని మనుషులు ఎప్పుడో కానీ కరవవు. పురుషుల మీద అత్యాచారాలు ఎప్పుడో కానీ జరగవు. బాబాలు ఎప్పుడో కానీ భక్తుల కాళ్ళ మీద పడరు.

కానీ, ఆసక్తికరమైన వార్తలు. వార్తలు రాసేవాళ్ళకు ఈ రహస్యం తెలియకపోయినా ఫర్వాలేదు కానీ, వార్తల్లోకి ఎక్కాలనుకునే వాళ్ళకు మాత్రం ఈ విషయం అర్థం కావాలి.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ మర్కండేయ్‌ కట్జూ వార్తల్లోకి ఎక్కాలనే నిర్ణయించుకున్నారు. ఆయన మాట్లాడితే వార్తయి పోతోంది.

జేబు ‘దేవత’లున్నారు జాగ్రత్త!

మన జేబుల్లో చేతులు పెట్టేవాళ్ళంతా జేబుదొంగలు కారు. వాళ్ళల్లో ఆప్తులుండవచ్చు, ఆత్మీయులు వుండవచ్చు. పిల్లలూ వుండవచ్చు,ప్రియురాళ్ళూ వుండవచ్చు.

‘నీ జేబులో ఎంత వున్నాయి?’

తన మృదువయిన చేయిని తన ప్రియుడి జేబులో పెడుతూ అడిగింది ఓ అమ్మాయి.

‘చెయ్యి పెట్టేసావ్‌ కదా! నువ్వే చూస్కో’

అన్నాడు ప్రియుడు. అంతకు మించి ఏ ప్రియుడు మాత్రం ఏమనగలడు లెండి?

ఒక గ్రాము ప్రేమ

ఏమిటో. ఇలా అనుకోవటం పాపం, అలా జరిగిపోతుంది. సరిగ్గా చిట్టి చేపను చూసి వల

వేస్తుంటాడతడు. పిచ్చిచేప పిల్ల పారిపోతే బాగుండునూ అనుకుంటాను. అది అనుకున్నట్టే

తుర్రుమంటుంది. అదేదో చానెల్లో లేడిపిల్లని పులి వేటాడుతుంటుంది. దగ్గరవరకూ వచ్చేస్తుంది. పులి

ఆగిపోతే బాగుండుననుకుంటానా, సరిగ్గా అదే సమయానికి దాని కాలికి రాయి తగిలి బోర్లా

పడుతుంది. లేడి పిల్ల తప్పుకుంటుంది. ఇలా ఎలా జరిగిపోతోంది? ఏదయినా అతీత శక్తా? అవును.

దాని పేరే ప్రేమ.

చీకటి ఎవరికి చేదు?

అక్కడికి అందరూ వెలుతురు మీదే బతికేస్తున్నట్టు, చీకటిని తెగ తిట్టిపోస్తున్నారు.

సమాజంలో చీకటిని కోరుకునే వారే లేరా? కరెంటు లేక పోతేనో, బల్బు వెలక్క పోతేనో జీవితంలో ఎంతో కోల్పోయినట్లు అందరూ ఫీలయిపోతున్నారు.

జనం ఖర్చుతో వీధిలైట్లు పెట్టిస్తారా? కాలనీకి వెళ్ళే కార్నర్‌లోనో, సిటీబస్సు స్టాండుకు దగ్గరగానో, పార్కు సమీపంలోనో వున్న లైట్లు పెట్టించిన రెండో రోజే పోతాయి.

నేనెరుగ, నేనేరుగ…నా నేత నడుగు!

‘మీ ఇంట్లో దొంగలు పడ్డారట’

‘నాకు తెలియదే!’

‘మీకు ప్రాణాపాయం వచ్చిందట కదా!’

‘నాకు తెలియదే!’

‘మీ పేరేమిటన్నారూ..?’

‘నాకు తెలియదే!’

ఇలా మాట్లాడిన వారిని ఎక్కడకి పంపుతారు? హైదరాబాద్‌లో అయితే ఎర్రగడ్డ పంపుతారు.

‘బంద్‌లో పాల్గొన్న తెలంగాణ నేతల్ని జైల్లో పెట్టారట’

‘నాకు తెలియదే!’