Month: May 2013

‘ఆలి‘ ఖైదాలు!

సూర్యరశ్మి సోకకుండా అత్యంత సుకుమారంగా అంత:పురాలలో వుండే స్త్రీలను అసూర్యంపశ్యలని అని అనేవారు. మహిళలకు భద్రత చాలు, స్వేఛ్చ ఎందుకనే రోజులవి. కానీ పరదాలను దాటుకుని రావటానికి ఆరాటపడుతూనే వున్నారు. వారు బయిటకు వచ్చి అన్ని రంగాలలోనూ తమ ఉన్నతిని చాటుకుంటున్నా, ఈ సూర్యుడనేవాడు ఇంకా వెంటాడుతూనే వున్నవాడు. దాంతో అతణ్ణి మాత్రమే తప్పించుకోవటానికి వారు ముసుగులు ధరించి ‘ఉగ్ర‘వాదులు గా మారణం తప్పటం లేదు. పురుషాధిపత్యం మీద కూడా ఏదో ఒక నాడు వారు నిజంగానే ఈ ‘ఉగ్ర’ రూపం దాల్చక తప్పదేమో.

‘ఆపధ్ధర్మాన’ ప్రసాద రావు

పేరు : ధర్మాన ప్రసాద రావు

ముద్దు పేరు : ‘ఆపద్ధర్మాన’ ప్రసాదరావు.( కేబినెట్‌ నిర్ణయాలనే ‘ఆపధ్ధర్మంగా’ అమలు జరిపాను కానీ, నా స్వంత నిర్ణయాలు కాదు. అయినా ‘వాన్‌ పిక్‌’లో నన్ను బుక్‌ చేశారు.)

విద్యార్హతలు : ఎన్ని విద్యలుండి ఏం లాభం? తప్పించుకునే విద్య ఒక్కటీ లేకపోతే, మిగిలిన విద్యలన్నీ వృధా.

‘మ్యాచ్‌ ఫిక్సింగు’లు కావు, అన్నీ ‘స్పాట్‌ ఫిక్సింగు’లే!?

క్రికెట్‌లోనే క్రీడాకారులు’మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల నుంచి ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.

మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ కాంగ్రెస్‌-వైయస్సార్‌ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఎత్తి పొడుస్తుంటుంది.

ప్రజాస్వామ్యంలో ‘రాచకుటుంబాలు’!

పార్టీ అన్నాక ఓ అధినేత వుంటాడు. ఆ అధినేతకు ఓ కుటుంబం వుంటుంది. ఆ కుటుంబంలో సభ్యులుంటారు. సభ్యులనందరినీ అధినేత ఒకేలా చూడొచ్చు. కానీ ఏదో ఒక సభ్యుడికి తనను తక్కువ చూస్తున్నారన్న భావన కలగ వచ్చు. ఆ భావన పెరిగి పెద్దదయితే కలహానికి దారి తీయ వచ్చు. ఇంకా పెద్దదయితే ఆ సభ్యుడు ‘అసభ్యుడ’ వుతాడు. వేరే పార్టీ కూడా పెడతాడు.

అయినా పార్టీ మొత్తం ఒక కుటుంబం చేతిలో వుండటం ఏమిటి? ఇది రాచరికమా?

శత్రువే సంస్కర్త

శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’

కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.
వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ విషయంలోనూ, ఒక పార్టీ విషయంలోనూ ఇదే నిజం.
ఏ రాజకీయ పార్టీ అయినా బాగుపడాలి అంటే, అది శత్రుపక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఈ

మధ్యకాలంలో కొన్ని పార్టీలు అలా బాగుపడిపోతున్నాయి. ఒక పార్టీమీద శత్రుపక్షం ఇంత ప్రేమ

చూపిస్తుందంటే, నాటకం అనుకునే వాళ్లం. కానీ అది నాటకం కాదూ, ‘కర్ణాటకం’ అని

బోధపడిపోయింది.

సి ఫర్‌ ‘కాపు’ చంద్రయ్య!

పేరు : సి(చెన్నంశెట్టి). రామచంద్రయ్య

ముద్దు పేరు : సి ఫర్‌ ‘కాపు’ చంద్రయ్య.(కాపులను బీసీలో చేర్చాలని కోరుతున్నాను.)

విద్యార్హతలు : లెక్కల్లో మనిషిని.(ఒకప్పుడు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను లెండి.) ఇప్పుడు కూడా లెక్కలు తప్పటం లేదు. కాపులు+బీసీలు= కాంగ్రెస్‌ అని అంటున్నాను. (సీమాంధ్రలో రెడ్లూ, దళితులూ వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు కదా! అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చిరునామా మిగలాలంటే నా ‘లెక్క’ను పాటించాల్సిందే. (కాపుల్ని కూడా బీసీల్లో కలిపేస్తే మొత్తం బీసీలయిపోతారు.)

కడియం శ్రీహరితో రిపోర్టర్ పమ్ము

కడియం శ్రీహరి మూడు దశాబ్దాల పాటు తెలుగుదేశంలో వుంటూ, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఎందుకు చేరినట్లు? తెలుగుదేశం మీదా చంద్రబాబు పైనా విరక్తితోనా? లేక టీఆర్ఎస్ మీదా, కేసీఆర్ పైనా మోజుతోనా? రిపోర్టర్ పమ్ము ఇంటర్య్యూ కేవలం వెటకారం కోసం.

‘కాపు’దలలో కాంగ్రెస్‌ వుంటుందా?

కులం ఉందంటే ఉంది; లేదంటే లేదు. కాలేజీ ‘ఫ్రెండ్‌షిప్పు’ల్లో ఒక్కొక్క సారి కులం నిపించదు. కానీ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ వచ్చేసరికి- కులం ఎలా వచ్చేస్తుందో వచ్చేస్తుంది. అదేమి విచిత్రమో కానీ, తాను ‘ప్రేమించిన అమ్మాయిది తన కులమే- అని తేలుతుంది'( తనకులానికి చెందిన అమ్మాయి మీదనే తనకు మనసు మళ్ళింది- అని చెబితే అసహ్యంగా వుండదూ! అందుకని ఇలా అనుకోవటంలో ఓ తృప్తి వుంది)

రాజకీయ దురంధరేశ్వరి

పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి

ముద్దు పేరు : రాజకీయ దురంధరేశ్వరి

విద్యార్హతలు : వారసత్వ రాజకీయాలలో పి.హెచ్‌.డి. (ఈ విషయంలో చంద్రబాబు కూడా నా ముందు దిగదుడుపే. బాబు ‘అత్తింటి'(పోనీ, ‘మామింటి’) వారసత్వం కోసం తాప త్రయ పడితే, నేను ‘పుట్టింటి ‘వారసత్వాన్ని నిలబెట్టుకుంటాను.

తిన్నదెక్కువ, తినిపించింది తక్కువ!

తిను, తినిపించు, లైఫ్‌ అందించు.

ఇదేదో ‘ఎఫ్‌ ఎమ్‌’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.

కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.

దూకమంటే దూకేదీ దూకుడు కాదు!

భార్యకి విడాకులు ఇచ్చేసి వెళ్ళుతూ, ‘నేను కట్టిన మంగళ సూత్రం జాగ్రత్త’ అన్నాడు బాధ్యత గల భర్త ఒకడు. ‘ఆ మాట నాకెందుకు చెబుతారూ, నేను చేసుకోబోయే రెండో భర్తకు చెప్పండి. నేను ఎంత చెప్పినా వినటం లేదు. కొత్త మంగళసూత్రం కొంటానంటున్నాడు. నేనేమో, మీరు కట్టింది వుంది కదా- అని చెబుతున్నాను.’ అని ఆమె అనగానే ఆ మాజీ భర్త ఎంతో ముచ్చట పడ్డాడు. ‘అవును. మళ్ళీ అదనపు ఖర్చు ఎందుకూ? అన్నట్టు. మనకి పెళ్ళికి నువ్వు కట్టుకున్న చీర కోసం వెతుక్కుంటావేమో! నేను తీసుకువెళ్తున్నాను. నా రెండో పెళ్ళికి పనికి వస్తుందని.’ అని ముక్తాయించాడు కూడా.

కిరణ్‌ కేబినెట్‌లో ‘లీకు’ వీరులు!!

పథకాలు కూడా సినిమాల్లా అయిపోయాయి. సినిమాలకు ఉన్నట్టే వీటికీ ఫార్ములాలు వుంటాయి. ఫార్ములాను తప్పి ఎవరన్నా పథకం పెడితే, దాని భవిష్యత్తు చెప్పలేం.

సినిమాలకు స్ప్రిప్టు రైటర్లున్నట్టే, పథక రచయితలు కూడా వుంటారు. అసలు రచయితలు అసలు కనపడనే కనపడరు. కనిపిస్తే జనం దడుచుకుంటారు. అందుకే వారిని ‘ఘోస్ట్‌’ రైటర్లూ అంటారు. మరీ అనువాదం తప్పదంటే ‘భూత’ రచయితలనుకోవచ్చు

ఎదురు ‘దాడి’

పేరు : దాడి వీరభద్రరావు

ముద్దు పేరు : ‘గాడి'( బాబును నమ్మి ఒక గాడిలో ‘సైకిలు’తొక్కాను. ఏముంటుంది. ఎదుగూ లేదు. బొదుగూ లేదు.) ‘దాడి'( బాబును నమ్ముకుని కాంగ్రెస్‌నూ, వైయస్సార్‌ కాంగ్రెస్‌నూ అనరాని మాటలన్నాను. ఇప్పుడు వాటిల్లో ఏదో ఒకటి ద్కియ్యేట్టుంది.) ‘ఎదురు దాడి’ (ఇన్నాళ్ళకు తెలివి వచ్చి బాబు మీదకు దాడికి సిధ్ధపడ్డాను. అది కూడా శాసన మండలి పదవీ కాలాన్ని చిట్ట చివరి రోజు కూడా అనుభవించాక.)

‘కర్ణాటకం’లో అన్నీ నవ్వులే!!

తీర్పు ఒక్కటే. భాష్యాలు వంద.

కర్ణాటక 2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇదే తంతు నడుస్తోంది. అంకెలు ఎవర్నీ బాధించటం లేదు.(గెలిచిన కాంగ్రెస్‌ కు స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది.) అర్థాలే అందరికీ ముఖ్యమయిపోయాయి. ఈ అర్థాల్లో ఎవరికి వారు, తమ తమ రీతుల్లో ఊరట పొందుతున్నారు.

ఆమెకు చదువుల్లేవు, అన్నీ చదివింపులే!

అన్నింటా ఆడపిల్లలు. సివిల్స్‌ టాపర్‌గా ఆడపిల్ల. ఇంటర్‌ ఫలితాలలో ఆడపిల్లల ముందంజ. ‘క్యాట్‌’లో ఆడపిల్లలు. ‘నీట్‌’లో ఆడపిల్లలు. ఎటు చూసినా ఆడపిల్లలే చదువుకు పోతున్నారు.

నాజూకయిన నగరాల్లో అత్యాచారాలు. ఎదిగీ ఎదగని పట్టణాల్లో లైంగిక హింసలు. ఒదిగీ ఒదగని పల్లెల్లో బలాత్కారాలు.

రెండూ వాస్తవాలే. వాటి మధ్య పొంతనేమీ లేదు.

‘దేశ’మంటే ‘వోటు’ కాదోయ్‌!!

దేశం గుర్తుకొచ్చింది.కాస్సేపు ప్రాంతం,కులం, వర్గం, మతం పోయి భారతీయులకు దేశం గుర్తుకొచ్చింది. అందుకు కారకుడు సరబ్‌జిత్‌.

ఇరవయి మూడేళ్ళు పాక్‌ జైలులో మగ్గి,విడుదలకు అన్ని అర్హతలూ వుండి చిత్రహింసలకు గురయి, కోమాలోకి వెళ్ళి కడకు మరణించాడు. పాకిస్తాన్‌ ఎంత బుకాయించినా, ఇది ఆ ప్రభుత్వం చేసిన ‘దారుణ హత్య’. సాధారణంగా చేసే హత్య ‘ఎన్‌కౌంటర్‌’ పేరు మీదనో, ‘లాకప్‌డెత్‌’ పేరు మీదనో జరుగుతుంది. ఇది మూడో రకం. ఈ హత్యను ‘అధికారులు’ చెయ్యలేదు. సాటి ఖైదీలు చేశారు. కాకుంటే వారు ‘పాక్‌’ ఖైదీలు.