Month: June 2013

మాట వున్నది, తప్పటానికే!!

రాజకీయాలను చూసి, విసిగి, వేసారి తల మాసిపోయిన ఓ ప్రసిధ్ద నాయకుడికి, ఓ రోజు నిజంగానే ప్రజాస్వామ్యం దర్శనం ఇచ్చింది. దానికి ‘మూడు ముఖాలు’ వున్నాయి. (‘సింహాల ముఖాలు కాదండోయ్‌). వాటినే ‘మూడు అంచెలు కాబోలు’ అని అనుకున్నాడు. ఇంతకీ ఆ మూడూ ఏమిటనుకున్నారు? మూడు ‘మ’లు. (ఇంగ్లీషులో అయితే మూడు ‘ఎమ్‌’లు): మనీ, మాఫియా, మీడియా.

ప్రకృతి బీభత్సం కాదు, వికృత వాణిజ్యం!

ప్రకృతిని ఎన్నయినా అనవచ్చు. ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతి ప్రకోపించింది. ప్రకృతి విలయతాండవం చేసింది. వరదలొచ్చినా, ఉప్పెనలొచ్చినా, సునామీలొచ్చినా, కడకు భూకంపాలొచ్చినా- ప్రకృతిని తిడుతూనే వుంటాం. పాపం! ప్రకృతి తన పై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు. పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. పరువు నష్టం దావా వేయలేదు. మౌనంగా అన్ని ఆరోపణలూ భరిస్తుంది.

చేసేది చెలిమి! తీసేది కత్తి!!

కూలిపోతున్నానని తెలిసి కూడా కులాసాగా వున్నానని చెప్పటం కష్టమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇదే స్థితిలో వుంది. కాంగ్రెస్‌ పై వోటర్ల విశ్వాసం సన్నగిల్లిందని, సర్వేల సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడుపార్లమెంటు ఎన్నికలు వస్తే, రాష్ట్రం వరకూ (మొత్తం 42 స్థానాల్లో) కాంగ్రెస్‌ కు వచ్చే సీట్లు ఏడు లేదా ఎనిమిది అని చెబుతున్నారు. 2009 ఎన్నికలలో 33 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీకి ఎంత నిరుత్సాహం కలగాలి?

గవర్నమెంట్‌ స్కూలా! మార్కెట్‌ రికగ్నిషన్‌ వుందా?!

‘మావాణ్ని ఏ కార్పోరేట్‌స్కూల్లో వేస్తే మంచిదంటావ్‌?’

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, సాటి ఉపాధ్యాయుడి సలహా కోరతాడు.

‘మా ఆవిడకు రెండు రోజులనుంచి జ్వరం, ఏ మల్టీ స్పెషాలిటీస్‌ హాస్పటల్‌లో చేర్పిస్తే మంచిదంటావ్‌?’

ప్రభుతాసుపత్రిలో డాక్టరు, తోటి డాక్టరుని ఆరా తీస్తాడు.

‘మా అల్లుడు కట్నం కోసం మా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఏ గూండాతోనైనా బెదిరించాలి. ఎవరికి చెబుతాం?’

ఓ పోలీసు కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ అభిప్రాయం అడుగుతాడు.

ప్రభుత్వరంగానికే ప్రయివేటు రంగంతో పనిపడింది.

‘లౌకిక్‌’ కుమార్‌!

పేరు : నితిష్‌ కుమార్‌

ముద్దు పేరు : ‘లౌకిక్‌’ కుమార్‌(పదిహేడేళ్ళ సుదీర్ఘనిద్ర తర్వాత మేల్కొని, నేనున్నది మతవాద పార్టీ అని గ్రహించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాను. మార్క్స్‌ చెప్పింది నిజమే సుమండీ.. ‘మతం మత్తు మందే.’), ‘అద్వానీష్‌’ కుమార్‌(గుజరాత్‌ అల్లర్లు దారుణమా? బాబ్రీ విధ్వంసం దారుణమా? అని ఎవరయినా నన్నడిగితే ‘రెండూ దారుణమే’ అంటాను. కానీ ‘గుజరాత్‌ అల్లర్లు ‘కాస్త ఎక్కువ దారుణం’ అని అంటాను. అందుకే ‘తక్కువ దారుణానికి’ కారకుడయిన అద్వానీ వైపే వుంటాను.)

‘పిలుపు’ మీరివ్వండి! ‘పెళ్ళి’ సర్కారు చేస్తుంది!

అందరికీ అన్నీ అలవాటయిపోయాయి. రాజకీయాల్లో ఎవరి పాత్రలు వారు చాలా రొటీన్‌ గా పోషించేస్తున్నారు. ఉద్యమాలూ, ఆందోళనలూ కూడా పండగలూ, పబ్బాలూ అంత పాతవయిపోయాయి. భైటాయింపులనూ, వాకౌట్లనూ పెళ్ళి తంతులంత సునాయసంగా జరిగిపోతున్నాయి. ఏ మంత్రానికి మోత మోగించాలో ముందే తెలిసిపోయిన బాజా భజంత్రీల్లా ప్రసారమాధ్యమాలు స్క్రోలింగులూ, బ్రేకింగులూ, లైవ్‌లూ నడిపించేస్తున్నాయి. ఏం జరిగినా చూసిన సినిమాయే చూస్తున్నట్టుంది.

టెలిగ్రామ్ ప్రేమలు వేరు

టెలిగ్రామ్‌ చనిపోయింది.

అవును. టెలిగ్రామ్‌ ఎక్స్‌పైర్డ్‌.

టెలిగ్రామ్‌ మరణ వార్త అందించటమెలా? ఎవరయినా టెలిగ్రామ్‌ ఇస్తే బాగుండును.

టెలిగ్రామ్‌ ఉన్నదే అందుకు. టెలిగ్రామ్‌ అందుకున్న వారు షాక్‌ తినాల్సిందే. అందులో సందేశం అయితే అమితమైన దు:ఖమో, లేక అమితానందమో..!

‘టెలిగ్రామ్‌!’ అని అప్పటి ‘తంతి తపాలా శాఖ’ ఉద్యోగి గుమ్మం బయిట నిలబడితే, కుటుంబం కుటుంబం అంతా గుండెల్లో గుప్పెట్లో పెట్టుకునే వారు.

పార్టీలు పెట్టనేల? గంగలో కలపనేల?

కొన్ని సమాజాల్లో, కొన్ని కాలాల్లో బహు భార్యత్వాలూ, బహు భర్తృత్వాలూ వున్నట్లు, మన ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం వుంది. ఎన్ని పార్టీలయినా పెట్టుకోవచ్చు. దాంతో, ‘ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల’లా రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇంకా పుడుతూనే వున్నాయి. ఇంకా పుడతాయి కూడా. అయితే మన అదృష్టం బాగుండి, అన్నీ పూర్ణాయుష్షుతో వుండవు.

కొన్ని పుట్టగానే మరణిస్తాయి. చిత్రం! కొన్ని పుట్టకుండా మరణిస్తాయి.

‘రథ్వా’నీ – ‘యుధ్ధ్వా’నీ- ‘వృధ్ధ్వా’నీ!!

పేరు : లాల్‌ కృష్ణ అద్వానీ

ముద్దు పేరు : ”రథ్వా’నీ(మందిర నిర్మాణం కోసం రథ యాత్ర చేసినప్పుడు),

‘యుధ్వా’నీ( కార్గిల్‌ వద్ద పాకిస్థాన్‌తో యుధ్ధం చేసినప్పుడు) ‘వృధ్ధ్వా’నీ( ఎనభయ్యదేళ్ళ

వయస్సులో నేను ప్రధాని పదవి అర్హుణ్ణి కానని, నరేంద్ర మోడీని ముందుకు తెస్తున్నప్పుడు).

అయినా కానీ ఎప్పటికయినా నేను ‘ప్రధ్వా’నీనే( ప్రధాని కావాలన్న కోరికను నానుంచి ఎవరూ

దూరం చేయలేరు.)

వెన్నెల ముద్ద

ఇలావచ్చి అలా పోయేవి ఎక్కువ మురిపిస్తాయి. మెరుపూ, చినుకూ, కెరటం, మోహం- అన్నీ అంతే. శాశ్వతం- అనుకునేవి ఏవీ అంతటి ఆనందాన్ని ఇవ్వలేవు. జీవితం కూడా అంతే కదా. తుర్రున వచ్చి తుర్రున పోతుంది. అందుకే అంత ఆశపెడుతుంది. ప్రేమ,ప్రేమ అని ఊరేగుతాం, కానీ, మొత్తం ప్రేమాయణానికి గుర్తులుగా మిగిలేవి కొన్ని క్షణాలే. సాయింత్రంపూట కాలేజి బస్సు ఎక్కేముందు, కలిసి తిన్న పానీ పూరీలూ, ఎవరి కంటా పడకూడదని పక్క పక్క సీట్లలో కూర్చుని డొక్కు థియేటర్లో చూసిన పౌరాణిక చిత్రాలూ- ఇవే కదా ఎప్పటికీ మురిపించే విషయాలు!!

దాసరి నారాయణరావుతో రిపోర్టర్ పమ్ము

ధాసరినారాయణ రావు మాజీ కేంద్ర బొగ్గుగనుల సహాయ మంత్రి. అంతే కాదు ఆయన ఉదయం దినపత్రిక, బొబ్బిలి పులి వార పత్రికల వ్యవస్థాపకులు. సరే ఎలాగూ ఆయన జగమెరిగన చిత్ర దర్శకులే. అలాంటి వ్యక్తి కూడా బొగ్గుగనుల ముడుపుల కేసులో ఇరుక్కున్నారు. ఈ సందర్భంగా తెలుగు పాఠకులకు సుపరిచితమైన కార్టూన్ కేరక్టర్ రిపోర్టర్ పమ్ము ఇంటర్వ్యూ చేస్తే ఎలావుంటుంది? ఒకే ఒక్క నిమిషంలో చదవచ్చు.

ఎక్కవలసిన సీటు, ఒక జీవితం కాలం లేటు!

అదేమిటోకానీ, అద్వానీకి అందలం అందినట్టే అంది జారిపోతుంటుంది. ఒకప్పుడు వాజ్‌ పేయీ తన్నుకుపోతే, ఇప్పుడు మోడీ ఎత్తుకు పోయేటట్టు వున్నారు. ప్రధాని పదవే అలాంటిది. కొందరు ఎంత ఆశించినా దొరకదు. కొందరు ఆశించకపోయినా వచ్చేస్తుంది. బహుశా ఏకారణం చేతనేనేమో- మన్‌మోహన్‌ సింగ్‌ను చూస్తే, అద్వానీకి ‘అకారణం’గా కోపం వచ్చేది. ఇది గమనించిన మన్‌మోహన్‌ ఒకటి రెండు సందర్భాలలో ‘ఆయన బాధను నేను అర్థం చేసుకోగలను’ అని పైకి అనేశారు కూడా.

ఏడుపు గొట్టు పథకాలు!

ఏడ్వని కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్కటే ఏడుపు.

తిట్టినా, చితగ్గొట్టేసినా, నిలువునా చీరేసినా ఏడ్వటం లేదు. పైపెచ్చు ఒంటి మీద చెయ్యేస్తే చాలు-కితకితలు పెడుతున్నట్టుంటుంది వాడికి. దాంతో ఒక్కటే నవ్వు.

వాళ్ళ వృత్తికి ఏడుపే జీవనాధారం. ఏడ్వనిదే పూట గడవదు. పగటిపూట గడిచినా రాత్రి పూట అసలు గడవదు. పేవ్‌మెంట్‌ మీద పడుకోగానే నిద్రపట్టి చావదు. కప్పుకోవటానికి రగ్గున్నా లేకున్నా, కడుపు వెచ్చబెట్టుకోవటానికి ఒక్క ‘పెగ్గు’ అన్నా పడాలి.

డియల్‌.. డియల్‌… డియ్యాలో..!!

పేరు : డి.యల్‌. రవీంద్రారెడ్డి

ముద్దు పేరు : ‘డియ్యాలో’

విద్యార్హతలు : ‘అసమ్మతి’లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌

హోదాలు : నాకే హోదా కొత్త కాదు. శాసన సభ్యత్వమూ కొత్త కాదు.(ఆరు సార్లు మైదుకూరు స్థానంనుంచి ఎన్నికయ్యాను.) మంత్రి పదవి అస్సలు కొత్త కాదు. పలువురు మఖ్యమంత్రుల కేబినెట్ల వున్నాను. ఎటొచ్చీ ఇప్పుడు వచ్చిన హోదా యే కొత్త. అదే ‘తొలగించబడ్డ మంత్రి

‘ఇచ్చే’ పార్టీనుంచి, ‘తెచ్చే’ పార్టీకి!!

ఆరోపణలు ఆరోపణలే. ఆకర్షణలు ఆకర్షణలే. ‘గులాబీ’ తీరే అంత. ముళ్ళు ముళ్ళే. మోజులు మోజులే.

ముళ్ళున్నాయని ‘గులాబీ’ చెంతకు వెళ్ళటం మానేస్తామా? కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌. మందా జగన్నాథంలకు పని చేసి వుండవచ్చు. అందుకే, వెనకా, ముందు చూసి కూడా కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి దూకేశారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ కూడా ఇదే బాటలో వున్నారు.

‘గ్లాసు’ జారి, ‘ఒళ్ళం’తయ్యిందే..!

గ్లాసే కదా- అని కొట్టి పారెయ్యలేం. ఒక్క గ్లాసు తో మనిషి తూలిపోవటం మామూలే. కానీ అదే గ్లాసుతో రాజ్యాలకు రాజ్యాలే కూలిపోయాయి. మన కళ్ళముందే 1994లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోయింది. అవును. సారా గ్లాసుతోనే.

దాంతో గ్లాసుల్లేని రాజ్యాన్ని తెస్తానని ఎన్టీఆర్‌ భీషణ ప్రతిజ్ఞచేసి, మరో మారు గద్దెనెక్కారు. అనుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం రోజునే తొలి సంతకం మీద ‘గ్లాసు బోర్లించారు’. మద్య నిషేధాన్ని అమలులోకి తెచ్చారు.

ఊరక దూకరు మహానుభావులు!

అదే మొబైల్‌. అదే నెంబరు. మారేది ‘సిమ్‌ కార్డే’

అదే పదవి(ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు.) వీలైతే అదే నియోజకవర్గం. మారేది ‘కండువాయే’

రెండు పనులూ ఒకటే. మొదటి దానిని ‘నెంబర్‌ పోర్టబిలిటీ’ అంటారు. ఎయిర్‌టెల్‌ నుంచి టాటా డోకోమోకి మారినా అదే నెంబరు వుంటుంది. రెండో దానిని ‘మెంబర్‌ పోర్టబిలిటీ’ అంటే ‘మెంబర్‌’ ఆఫ్‌ పార్లమెంటు(ఎంపీ) లేదా ‘మెంబర్‌’ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ(ఎమ్యెల్యేలు) గతంలో ఎక్కడనుంచి కాంగ్రెస్‌ పార్టీనుంచి ఎన్నికయ్యారో, మళ్ళీ అక్కడ నుంచే టీఆర్‌ ఎస్‌ నుంచి ఎన్నిక కావచ్చు.