Month: February 2014

సుష్మా ‘హిందూ’ రాజ్‌!

పేరు : సుష్మా స్వరాజ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి మహిళా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని( వెంటనే కాదు లెండి. సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అత్యధిక సీట్లు సాధించిన ఏకైక కూటమిగా ఎన్డీయే నిలవాలి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇంకా డెభ్యయ్యో, ఎనభయ్యో సీట్లు తక్కువ కావాలి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి. అప్పుడు మహిళ ప్రధాని కావాలి-అని దేశమంతటా ఉద్యమం తేవాలి. అప్పుడు మనకి ఛాన్స్‌ వుంది. అయితే నేను ప్రధాని అయితే, గుండు గీయించుకుంటాను అని ఏ కాంగ్రెస్‌ మహిళా నేతా శపథం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, 2004 లో సోనియాని ప్రధానిని చేస్తారని అనుకున్నప్పుడు, నేను అలాంటి శపథమే చేశాను లెండి.)

మౌనమే మహా తంత్రం!

నోరు తెరవటమే కాదు, నోరు మూసుకోవటం కూడా గొప్ప విద్యే. ఎప్పుడూ మాట్లాడని వాడిని, ఓ రెండు నిమిషాలు వేదిక ఎక్కి మాట్లాడమంటే, ఎంత కష్టంగా వుంటుందో; ఎప్పడూ వాగే వాడిని ఒక్క నిమిషం నోరు మూసుకోమనటం కూడా అంతే కష్టంగా వుంటుంది.

అందుకనే మౌనం చాలా కష్టమైన విషయం.

స్కూళ్ళలో టీచర్లు పాఠం చెప్పటానికి ఎంత శక్తి ఖర్చు చేస్తారో తెలియదు కానీ, అంతకు రెండింతలు ‘సైలెన్స్‌’ అనటానికి వెచ్చిస్తారు.

ఛాయ్, ఛాయ్, మోడీ ఛాయ్!

‘ఛాయ్‌’!

ఇది మాట కాదు, మంత్రం.

ఇంత వరకూ మనకు అల్లం ఛాయ్‌, మసాలా ఛాయ్‌, ఇరానీ ఛాయ్‌ మాత్రమే తెలుసు. ఇప్పుడు దేశంలో ఛాయ్‌లో కొత్త బాండ్రింగ్‌ వచ్చింది. అదే ‘మోడీ ఛాయ్‌’

అయితే ఈ ఛాయ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రం మణిశంకర్‌ అయ్యరే. బహుశా, నరేంద్రమోడీకి ఇంతటి ప్రచారాన్ని స్వంత పార్టీ(బీజేపీ) నేతలే ఇంతవరకూ కల్పించి వుండరు. కానీ కాంగ్రెస్‌ వాడే అయినప్పటికీ మణి శంకర్ అయ్యర్ ఈ సాహసానికి ఒడిగట్టారు.

‘నెలవంక’య్య నాయుడు

పేరు : ఎం.వెంకయ్య నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్‌-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్‌, కిరణ్‌, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)

ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)