Month: June 2014

తిరిగొచ్చిన తూటా

పిలుస్తూనే వుంటాం. మనిషి తర్వాత మనిషిని ఈ భూమ్మీదకు ఆహ్వానిస్తూనే వుంటాం. నన్ను నా అమ్మా నాన్నా

ఆహ్వానించినట్లు, నేను నా బిడ్డల్ని ఆహ్వానించాను. ఆహ్వానితుడికి ఎర్రతివాచీ పరచనవసరం లేదు; పట్టు బట్టలు పెట్టనవసరం

లేదు; పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించనవసరంలేదు. ఆకలినో, నేరాన్నో బహూకరించకుండా వుంటే, అదే పది వేలు. వాడి

చేతికి బలపం ఇవ్వక పోయినా ఫర్వాలేదు, నెత్తిన ఇటుకల దొంతర పేర్చకుండా వుంటే చాలు. అన్ని మాటలు ఎందుకు కానీ,

వాడిపై జాలి చూపించకపోయినా ఫర్వాలేదు, భుజానికి జోలె తగిలించకుండా వుంటే చాలు.

‘క్వశ్చన్‌’ రెడ్డి!

పేరు : జి.కిషన్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: భావి(2019) తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి.( ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ మా పార్టీకి ఎలాగూ వుంది కాబట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించవచ్చు. )

ముద్దు పేర్లు : ‘క్వశ్చన్‌’ రెడ్డి( అసెంబ్లీలో నిత్యమూ ప్రతి పక్షంలో వుండటం వల్ల ప్రశ్నించటం అలవాటయి పోయింది. సమాధానాలతో నాకు పని వుండదు అధ్యక్షా! ఇంతకీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినా, నేను తెలంగాణ అంతా తిరిగినా మా పార్టీ తెలంగాణలో ఎందుకు ఓడిపోయినట్లు అధ్యక్షా?)

‘విద్యార్హతలు : బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ పోస్ట్‌ మార్టెమ్‌ ( కాబట్టే తెలంగాణలో బీజేపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించగలిగాను. అఫ్‌ కోర్స్‌ కారకుల్లో నేనూ ఒకణ్ణని కొందరు సభ్యులు తేల్చారు.)

ఎవరెస్టు పై ఎవరెస్టు

భూగర్భాన్నీ, గగనతలాన్నీ, కడలి కడుపునీ తడిమి చూడగల మానవుడికి, ఇంకా తనకూ తన తోటిమానవుడికీ మధ్య దూరాన్నిెెఎలా లెక్కించాలో తెలియటం లేదు. రోదసి లో గ్రహానికీ గ్రహానికీ వున్నంత దూరమా? మనిషే సాటి మనిషిని చేరాలంటే ఇంకా ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణించాలో? తెల్లవాడు నల్లవాడికి చేరువ కావటానికి యుగాలు పట్టింది. ఇంకా ఈ పుణ్యభారతంలో ఊరు, వెలివాడను చేరనే లేదు. మెదానం అరణ్యాన్ని తాకనేలేదు. అయినా వాడబిడ్డ, అడవి పుత్రికా హిమశిఖరాన్ని తాక గలిగారు

‘మెగా’హీరో- గిగా జీరో!!

పేరు : చిరంజీవి

దరఖాస్తు చేయు ఉద్యోగం: వర్థమాన తెలుగు హీరో( ఎంత మెగా స్టార్‌నయినా మళ్ళీ సినిమా కేరీర్‌ను మొదలు పెడుతున్నాను కదా! మధ్యలో అయిదేళ్ళు ‘కమర్షియల్‌’ సారీ.. ‘పొలిటికల్‌’ బ్రేక్‌ ఇచ్చాను కదా)

ముద్దు పేర్లు : మెగా హీరో (సినిమాల్లో), గిగా జీరో (రాజకీయాల్లో) 2014 ఎన్నికల్లో నేను ప్రచార సారథ్యం వహించినా కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు.

‘విద్యార్హతలు : ఏం చదివితే ఏం? వోటర్ల మనసుల్ని చదవటం రాలేదే…! ప్రేక్షకుల మనసులయితే ఒక సినిమాకి కాకపోయినా మరొక సినిమాకయినా అర్థమవుతాయి. ఇక్కడ ఆ అవకాశమే లేదు.

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌!

పేరు : జానా రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రొటెం ముఖ్యమంత్రి ( ఈ పోస్టు ఉండదని నాకూ తెలుసు. కానీ ఉంటే బాగుండునన్నది నా ఆకాంక్ష. ప్రొటెం స్పీకర్‌- అనే పదవి ఉన్నది కాబట్టే కదా, కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా తెలంగాణ శాసన సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యాను చూశారా?)

ముద్దు పేర్లు : ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ (ప్రొటెం స్పీకర్‌ పదవి ఒక్కరోజు తోనే ముగుస్తుంది.)

‘విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ మిస్‌అండర్‌స్టాండింగ్‌(మనం ఒకటి మాట్లాడితే, జనానికి ఇంకోలా అర్థమవుతుంది. నేను హోం మంత్రిగా వున్నప్పుడుకూడా నా వ్యాఖ్యానాలు అర్థం కాక పోవటం వల్లనే నక్సలైట్లు నన్ను టార్గెట్‌ చెయ్యలేదు.)

‘రుణ’మో…పణమో!

రైతు పెరిగి పారిశ్రామిక వేత్త కావటం నిన్నటి పరిణామం. కానీ పారిశ్రామిక వేత్త ముదిరి రైతు కావటం రేపటి విపరీతం. అవును. ఇది నిజం. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారం లో ఎవరు వున్నా, ఇలాంటి భవిష్యత్తుకే బాటలు వేస్తున్నారు. కానీ చిత్రమేమిటంటే, రైతును ముంచే ప్రతిచర్యనూ రైతు క్షేమం పేరు మీద చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చికిత్స కోసం వచ్చిన రోగికి ఔషధమని చెప్పి, విషాన్నిస్తే ఎంత గొప్పగా వుంటుందో, ఈ చర్యకూడా అంత గొప్పగానే వుంటుంది. నిజం చెప్పాలంటే, ‘ఎల్‌పీజీ’ (లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) ఆర్థిక విధానం దేశంలోకి వచ్చాక, ఏ పార్టీ సర్కారయినా, ఇదే పనిచేసింది.