Month: July 2014

తీసిందే బొమ్మా? చూసింది కాదా..?

వామ్మో!

తిట్టేసుకుంటున్నారు; కొట్టేసుకుంటున్నారు; తన్నేసుకంటున్నారు.

తాను తీసిందే సినిమా అనీ దర్శకుడూ, తాను రాసిందే సమీక్ష అని సమీక్షకుడూ ఒకటే తన్నులాట. (తన్నులెన్ను వారు తమ తన్నులెరుగరు!) ఎంత గొప్ప సినిమా తీసినా, చూడ్డానికి ప్రేక్షకుడు ఒకడుండాలని దర్శకుడూ, ఎంత మహా సమీక్ష చేసినా చదవటానికి పాఠకుడంటూ ఒకడుండాలని వీక్షకుడూ – ఈ తన్నులాటలో మరచిపోయారు. యథా సినిమా, తధా సమీక్ష. ఈ సూత్రీకరణని తిరగేసినా అర్థానికి వచ్చిన ముప్పేమీ లేదు.