Month: May 2015

ఎమ్మెల్సీలుగా ’జంప్ జిలానీ‘లు!

రెండు తెలుగు రాష్ట్రాలలలో పెద్దల సభలు యుధ్ధానికి సిధ్ధమవుతున్నాయి. ఈ యుధ్ధం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గతం; తెలంగాణలో బహిర్గతం. ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలాగ మొదలయింది. తెలంగాణలో అలా కాదు, ఇది పార్టీల మధ్య పోరులాగా మారింది. కానీ రెండు చోట్లా అధికారపక్షాలకు ‘పెద్దలు’ అన్నమాటకు నిర్వచనాలు మార్చుకున్నారు.

‘సూటేంద్ర’ మోడీ!

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘విదేశాంగ’ ప్రధాన మంత్రి ( ఇంతవరకూ విదేశాంగ శాఖ కు ఒక మంత్రి బాధ్యత వహించేవారు. నేను వచ్చాక, ఇందుకు మంత్రి మాత్రమే సరిపోరనీ, ఆ శాఖను నిర్వహించటానికి ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి వుండాలనీ నిర్ణయించాను. ఇందుకు విదేశాంగ మంత్రిగా వున్న, సోదరి సుష్మా స్వరాజ్‌ నొచ్చుకోకూడదు.)

వయసు : వయసుకీ ముచ్చటకీ సంబంధంలేదు. ఇరవయ్యవ పడిలో వేసిన దుస్తులే పదేపదే వేసేవాణ్ణి. ఈ అరవయ్యే పడిలో చూడండి గంటకో డ్రెస్‌తో మారుస్తున్నాను. ఈ డ్రెస్‌తో విమానం ఎక్కితే, అడ్రస్‌తో దిగాలని రూలు లేదు కదా?

వైర్ లెస్..!

చిన్న చిటికెన వేలు. ఎవరిదయినా కావచ్చు. కట్టుకట్టి వుంటుంది. గాయం ఎక్కడో వుంటుంది. కట్టు లోపలి, గాజు గుడ్డ లోపలి, దూది లోపలి, టింక్చర్‌ మరకల లోపల ఎక్కడో…! కనిపించనే కనిపించదు. కానీ తెగి వుంటుందన్న ఊహ; రెండు మూడు బొట్లు నెత్తురు కారి వుంటుందన్న ఎరుక! ఈ పిల్లెవరో ఏడ్చే వుంటుంది.

చీలిక మంచిదే… కోరిక తీర్చింది!

మరక మంచిదే… అన్నట్టుగా, విభజన మంచిదే అన అంటున్నారు. చిత్రం. ఈ మాటను ‘విభజన’ వాదుల కన్నా, ‘సమైక్య వాదులు’ అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలోని ఆర్టీసీ కార్మికులూ ఇదే మాట అంటున్నారు.
ఆర్టీసీ కార్మికులకు కష్టాలూ కొత్త కాదు, సమ్మెలూ కొత్త కాదు. గతంలో కూడా జీతాల పెంపు కోసం సమ్మెలు చేశారు. ఎప్పుడూ తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు వుంచినా, కార్మికులే ఎక్కువగా దిగి రావాల్సి వచ్చేది

కాంగ్రెస్‌ ‘మానియా’!

పేరు : సోనియా గాంధీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉత్తమ మాతృమూర్తి (పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిని ఈ దేశంలో ఇలా పిలుస్తారని తెలుసుకున్నాను. ఎంత సమయం పట్టినా సరే రాహుల్‌ గాంధీని ప్రయోజకుణ్ణి చేసి తీరతాను.)

వయసు : భారత స్వాతంత్య్రానికున్న వయసు కన్నా, నా వయసు తొమ్మిది నెలలు ఎక్కువ. అంతే.

ముద్దు పేర్లు : సో ‘నియంత’! ( నేను పార్టీలో ఎంత ప్రజాస్వామికంగా వున్నా- నియంత లా వున్నావు, నియంత లా వున్నావు- అని అంటే నాకు విసుకొచ్చి ‘సో.. నియంత నే!.. అయితే ఏమిటి?’ అని అనాలని కూడా అనిపిస్తుంది. కానీ నేను నిజంగానే ప్రజాస్వామ్యవాదిని కదా, అందుకనే అలా అనలేదు.),

సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి!

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సన్‌ రైజర్స్‌’ టీమ్‌ కెప్టెన్‌.( క్రికెట్‌ గురించి కాదు, నేను పాలిటిక్స్‌ గురించే మాట్లాడుతున్నాను. ‘సన్‌ రైజర్స్‌’ అంటే ‘పొడుచు కొస్తున్న సూర్యులు’ కాదు, ‘తోసుకొస్తున్న కొడుకులు’. కావాలంటే ఈ టీమ్‌లో ‘కేటీఆర్‌’ కూడా చేరవచ్చు.)

వయసు :’ఎగిరే’ వయసే! అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ‘ఎగురుతున్నా’నని అపార్థం చేసుకునేరు…! అంటే ‘ఫ్లయ్‌’ చేసే ఈడొచ్చిందని. కాబట్టే… దేశదేశాల్లో ఫ్లయ్‌ చేస్తున్నాను.