Month: February 2016

‘గ్రేటర్‌’ కోట పై ‘గులాబీ’ జెండా..!?

‘గ్రేటర్‌’ కోట పై ఏ జెండా ఎగురుతుంది? ఈ చర్చ కేవలం హైదరాబాద్‌ కే పరిమితం కాదు. అలాగని రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయినది కూడా కాదు. దేశం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తున్నది. ఎన్ని పార్టీలు బరిలో వున్నా, అంతిమంగా ఆడేది మూడు ముక్కలాటే! అవును. ముక్కోణపు పోటీయే. టీఆర్‌ఎస్‌- మజ్లిస్‌లు పేరుకు వేర్వేరుగా పోటీ చేస్తున్నా, ఈ రెంటిదీ ఒకే ముఖం. ఆ పార్టీల మధ్య ముందస్తు అవగాహన వుంది. కార్పోరేటర్‌ ఎన్నికలు ముగిశాక, మేయర్‌ ఎన్నికలప్పుడు కలవాలన్నది అవగాహన సారాంశం. ఇక ఒక డజను డివిజన్లలో కత్తులు దూసుకున్నా, ఇతర డివిజన్లలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ల మధ్య అధికారికమైన పొత్తు వుంది. ఇక మూడవది కాంగ్రెస్‌ పార్టీ. అయితే గెలుపు వోటములతో సంబంధం లేకుండా లోకసత్తా, వామ పక్షాలు కలిపి మరో కూటమి వుంది కానీ, యుధ్ధక్షేత్రం వారి ఉనికి నామ మాత్రంగానే వుంటుంది. కాబట్టి అంతిమంగా వుండేది త్రిముఖ పోటీ మాత్రమే.

‘గ్రేటే’ష్‌ బాబు!

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలంగాణ పౌరుడు (నాన్న ది రాయల సీమ, అమ్మది ఆంధ్ర, మరి నాకు తెలంగాణ కావాలి కదా! ఒకే కుటుంబ సభ్యులు పంచుకోవటానికి అని అనుకోకండి. పాలించటానికి. ఇప్పటికి మూడు తెలుగు రాష్ట్రాలయ్యాయి. సీమ కూడా విడిపోయి మూడు రాష్ట్రాలయినా పాలించుకోవటానికి ముగ్గురం వుండాలి కదా! అందుకని ఈ అరేంజ్‌ మెంట్‌)
ముద్దు పేర్లు: ‘షోకేస్‌’ బాబు ( నారా వారి కుటుంబం గొప్పతనానికీ, నందమూరి వారి ఖ్యాతికీ ని ప్రదర్శించటానికి ఏకైక షోకేస్‌ను నేనే.) ‘హెరిటైజ్‌’ బాబు ( ‘పాలు’టిక్స్‌ లోనూ, పాలిటిక్స్‌లోనూ నాన్నకు నేనే కదా- ఏకైక వారసుణ్ణి.)