Month: June 2017

మీటింగ్స్‌ తోనే రాహుల్‌కు రేటింగ్సా..?

రాహుల్‌ గాంధీ రేంజ్‌ హఠాత్తుగా మారిపోయిందా? ఆయన రేటింగ్స్‌ ఠపీ మని పెరిగిపోయాయా? యువరాజుకి పార్టీలో రాజయోగం పట్టేసినట్లేనా? అధ్యక్షుడికి ముందు వున్న ‘ఉప’ విశేషణం తొలిగిపోయినట్లేనా? చూడబోతే, ఇలాంటి వింత ఏదో దేశ రాజకీయాల్లో జరిగేటట్లుగానే వుంది. ఆటలో ఎప్పుడోకానీ గెలవని వాడిని, గెలిపించాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి: ఆట నేర్పించటం రెండు:…

‘మూడు’తలాకులూ..’ఆరు’తడబాట్లూ..!

మూడు ముడులు వేస్తే పెళ్ళి. ఇది ఒక ఆచారం. మూడు మాటలంటే విడాకులు. ఇది ఇంకో ఆచారం. ఈ రెండు ఆచారాలు, రెండు వేర్వేరు మత విశ్వాసాలకు చెందినవి. ‘మూడు’ అనే సంఖ్య తప్ప రెంటికీ వేరే ఏ పోలికా లేదు. పైపెచ్చు వైవాహిక జీవితానికి  ఇదే ‘మూడు’ఒక చోట ఆహ్వానం; మరొక చోట వీడ్కోలు.కాకుంటే…

‘పక్కా’ ‘మగ’పతిరావు!

పేరు : తమ్మారెడ్డి చలపతి రావు దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీజనోధ్ధారకుడు (‘పక్క’లోకి మాత్రమే స్త్రీలు పనికి వస్తారని లోకానికి ఎలుగెత్తి చాటటం.) వయసు :నాది బాబాయి వయసూ… తండ్రి వయసూ… తాత వయసూ అని పరిచయం చేస్తారు కానీ..నాది మళ్ళని వయసు.( లేకుంటే కొన్ని దశాబ్దాల పాటు ఒకే ‘రేపిస్టు’ పాత్రను ఎలా చెయ్యగలుగుతాను…?)…

‘అమితా’శలపై తెలుగు నీళ్ళు..?

అణచుకుంటే అణిగేదీ, తీర్చుకుంటే తీరేదీ కోరిక కాదు. ఆ తర్వాత పెరుగుతుంది, చచ్చినట్టే చచ్చి తిరిగి పుడుతుంది. అందుకే కాబోలు- అటు అణచటం, ఇటు తీర్చుకోవటమూ కాకుండా- కోరికను జయించ మన్నాడు బుద్ధుడు. కాంక్షలన్నిటిలోనూ పెద్ద కాంక్ష రాజ్యకాంక్ష. ఇది ఒక పట్టాన తీరదు. రాచరికాలు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చేసినా రాజ్యమేలాలనే కాంక్ష పదిలంగా వుంది.…

ఆవకాయ కూడా ఆవుకూరేనా..!?

నిఘా. నిఘా.. కుడి ఎడమల నిఘా, నిఘా. ఇంటి కింది కాపురాలు, ఒంటి మీది వస్త్రాలు, పంటి కింది ఆహారం- అన్నింటిమీదా నిఘా. ఇష్టమైన పిల్లను చేసుకుంటే పరువు హత్య. నచ్చిన దుస్తులువేసుకుందనే నెపం మీద అత్యాచారం.  దొరికిన ఆహారం తింటే మారణహోమం. వీటికి వత్తాసుగా సర్కారు నడిపే వారి వ్యాఖ్యలు, హుకుంలు, నిర్ణయాలు. బీఫ్…

దాసరి ‘మళ్ళీ పుట్టాడు’!

ప్రేక్షకుడికి కనపడని వాడూ, వినపడని వాడూ దర్శకుడు. ఈ నిర్వచనం దాసరి నారాయణరావు వచ్చేంత వరకే. తర్వాత మారిపోయింది. దర్శకుడు క.వి( కనిపించి వినిపించేవాడు) అయిపోయాడు. దర్శకుడిగా వుంటూ కూడా ఎక్కడో అక్కడ చిన్న పాత్రలోనయినా ఆయన తళుక్కున మెరిసేవారు. సినిమా అయ్యాక కూడా చిన్న ‘లెక్చరిచ్చి’ కానీ, వదలే వారు కారు. నాయకానాయికలు కలసిపోయి,…