Month: March 2018

చక్రాల కుర్చీ కాదు…చలన సింహాసనం!

మానవుడే మహనీయుడు కాదు, మహనీయుడే మానవుడు. కాలు తీసి కాలు కదపలేడు. వేలయినా కదపగలడో లేదో తెలీదు. కానీ తాను విహరించే ‘గగనాంతర రోదసి’లో. తన కూర్చున్న చోట ఒక్కటే కుటుంబం. అది తను చుట్టూ భ్రమిస్తుంది. కానీ తాను అనునిత్యమూ పరిభ్రమించేది అనేకానేక సౌరకుటుంబాలతో. యవ్వన తొలిపాదంలో తన మరణ వార్త తానే విన్నాడు.…

శ్రీదేవి: మూడక్షరాలు కాదు; మూడు తరాల పేరు!

ఒక దిగ్భ్రాంతి; ఒక ఉత్కంఠ; ఒక విషాదం- వెరసి నటి శ్రీదేవి మరణ వార్త. కూర్చున్న చోటనుంచి ఒకరు చివాల్న లేచి వెళ్ళిపోతారు. ఖాళీ. వెళ్ళింది ఒక్కరే. కానీ లక్షమంది వెళ్ళితే ఏర్పడ్డ వెలితిలాగా వుంటుంది. ఏ రంగంలో అయినా అంతే. కళారంగంలో అయితీ మరీను. చార్లీ చాప్లిన్‌ ఇలాగే చటుక్కున వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద…