Month: August 2018

నాన్న సైకిలు

ఒకటి పెంగ్విన్‌ పిల్లలా నాన్న సైకిల్‌ మీద నేను చక్రాల కింద చిన్నబుచ్చుకున్న సముద్రాలు కన్ననేరానికి కాళ్ళాడిస్తున్నారాయన నడుపుతున్నానన్న భ్రమలో రెక్కలాడిస్తూనేను ”ఎక్కడికిరా కన్నా?” నా శిరస్సునడిగింది నాన్న గెడ్డం ”ఊరవతలకి!” దిక్సూచిలా నా చూపుడువేలు ఛెళ్ళుమన్నది సముద్రం నాన్న చెక్కిళ్ళన్నీ నీళ్ళే మలుపు తిరిగామో లేదో నా బుగ్గలమీదా అవే నీళ్ళు ”నాన్నా! ఉప్పగా…

కరుణ చరితే తమిళ భవిత !

కొందరికి జీవిత చరిత్ర అంటూ వేరే ఏదీ వుండదు. ఎందుకంటే వారికి జీవితమే చరిత్ర కాబట్టి. కరుణానిధి ఆకోవలోకి వస్తారు. ఆధునిక తమిళనాడు చరిత్రకూ ఆయన జీవిత చరిత్రకూ తేడా ఏమీ లేదు. ఏడున్నరదశాబ్దాల తమిళుల చరిత్రను ఎలా తిప్పి, ఎలా రాసినా అది ఆయన చరిత్రే అవుతుంది. అవును తాను రాసిందే చరిత్ర, తాను…

’కాషాయం‘ వదలిన చోటే, వాజ్ పేయీ హీరో!

కరుణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే వాజ్‌పేయీ తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మధ్యా పోలికలే కాదు.., పోలికల్లో వ్యత్యాసాలూ,వ్యత్యాసాల్లో పోలికలూ వున్నాయి. ఇద్దరూ తొమ్మిది పదులు దాటి జీవించారు. ఇద్దరూ మంచి వక్తలే. కాకుంటే కరుణ తమిళలంలో దంచేస్తే, వాజ్‌ పేయీ హిందీలో ఊపేస్తారు. ‘ఏ రాష్ట్రమేగినా’ ఒకరు తమిళం తప్ప హిందీని ముట్టరొకరు. ‘ ఏ…

‘అరేయ్‌’ అనేశారు గా, ఆరెస్టవుతారా మరి!?

ఎఫెక్టు ఎవరికీ పట్టదు. సైడ్‌ ఎఫెక్టులే అందరికీ కావాలి. వైద్యుడు మందిస్తాడు. ప్రాణాలు దక్కుతాయి. ఆ మందే లేకుంట,ే పోయే వాడే. కానీ అందుకు సంతోషించడు. ‘హత్తిరికే. నీ మందుకు తలనొప్పి వచ్చిందయ్యా డాక్టరూ!’ అని కయ్యానికొస్తాడు. మూడు వేల యేళ్ళు మూలన పెట్టేసిన వారి కోసం భారత రాజ్యాంగం రెండు చిన్న చిన్న మందులు…

డెమాక్రటిక్‌ ‘డిక్టేటర్‌’!

నా పేరు : ఇమ్రాన్‌ ఖాన్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం:కెప్టెన్‌. పాకిస్తాన్‌ పొలిటికల్‌ క్రికెట్‌ టీమ్‌.(ప్రధాన మంత్రి అంటే అదే కదా! గతంలో ఇండియాతో క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు రాజకీయం ఆడతాను.) వయసు : ఆరు పదులు దాటి ఆరేళ్ళు అయినా ఇంక నవయవ్వనుణ్ణే. (అయినా క్రికెటర్‌ వయసు తీసిన ‘పరుగుల’తోనూ, రాజకీయ నాయకుడి వయసు…