Month: August 2019

మెడకు ముంత కట్టినట్లు, నోటికి బూతు కట్టకండి!

ఏ భాష నేను మాట్లాడాలి? ((Which language should I speak?)) అరుణ్‌ కాంబ్లే అనే మరాఠీ దళిత కవి ప్రశ్నిస్తాడు. నిజమే. దళితులకో భాష ఉంటుందా? ఉంటే ఎలా వుంటుంది? ”ఒరే కొడకా. మనం మాట్లాడినట్టు మాట్లడరా. మనలా మాట్లాడు” అంటాడు కులవృత్తి వీపున మోస్తున్న తాత. ”ఓరి దద్దమ్మా! భాషను సరిగా ఉపయోగించరా!…

నటనకు నలుదిక్కులా దేవదాసు కనకాల

ప్రతీ పువ్వూ పుట్టగానే పరిమళించడం వంటి వెర్రివేషాలు వెయ్యదు. పుట్టు కవులు, పుట్టు కళాకారులు ఉండరు. కాకుంటే అలాంటి లక్షణమేదో చిన్నప్పటి చేష్టల్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అది ముదిరి ఏదో ఒక రోజున కళయి బైట పడుతుంది. దేవదాసు కనకాల ఒక నటుడు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఇతనేమీ మేకప్పు, విగ్గూ వగైరాలతో పుట్టలేదు.…