Month: August 2021

‘ప్రేమోన్మాద’మేనా? ‘కులోన్మాదం’ కూడానా?

రమ్య హత్య కేవలం ఎప్పుడూ జరిగే ‘ప్రేమోన్మాద’ హత్య మాత్రమే కాదు; ‘కులోన్మాద’ హత్య కూడా. ‘ప్రేమోన్మాది’ ఆడపిల్లను ‘వస్తువు’గానే చూస్తాడు. ‘కులోన్మాది’ బానిసగా కూడా చూస్తాడు. వెరసి, కోరుకుంటూ వచ్చి ఒళ్లో వాలే ‘చవకబారు వస్తువు’గా చూస్తాడు. రమ్య దళిత యువతి.

‘మర్యాదస్తుల’ కోపాలకీ ‘కోటా’లుంటాయా?

అత్యాచారాలు ఈ దేశానికి కొత్త కాదు; దేశరాజధాని ఢిల్లీకి కూడా కొత్తకాదు. అందుకే ఇంకో పేరుతో కూడా ఆ నగరాన్ని పిలుస్తారు: ఈ దేశపు అత్యాచార రాజధాని (‘రేప్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’). ఎన్నో అత్యాచారాలు జరిగినా, ‘నిర్భయ’ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. దేశంలోని చదువుకున్న యువతీయువకులు ఆగ్రహోదగ్రులయిపోయారు. అదే ఢిల్లీ…