List of published books by Satish Chandar
S.no | Book Thumbnail | Name/Title | Genre | Description | Year | Price |
1 | Made in India (మేడ్ ఇన్ ఇండియా) | Satire | ఎనభయ్యవ దశకం చివరి పాదంలో ఎన్టీ ఆర్ ముఖ్యమంత్రిగా వుండగా రాసిన వ్యంగ్యం. ఈ పుస్తకం చదివాకే ఎబికె ప్రసాద్ సతీష్ చందర్ ను ఆర్ట బుచ్ వాల్డ్ తో పోల్చారు | 1992 | Out of Print | |
2 | [Image Not Available] | Dunkel Bells (డంకెల్ బెల్స్) | Play | డంకెల్ ప్రతిపాదనల వల్ల రైతుకు జరిగే నష్టం పై వచ్చిన వీధినాటకం. | 1993 | Out of Print |
3 | Panchamavedam (పంచమవేదం) | Poetry | తొంభయ్యవ దశకం తెలుగు కవిత్వ దిశను మార్చేసిన గ్రంథం. పలు యూనివర్శిటీల్లో పాఠ్య గ్రంథం. | 1995 | Out of Print | |
4 | Itihaasam (ఇతి హాసం) | Satire | నడుస్తున్న రాజకీయాలను జానపద కథల్లాగా రాసిన గ్రంధం. | 1995 | Out of Print | |
5 | Naanna Cycle (నాన్న సైకిలు) | Poetry | స్వీయ చరిత్రాత్మకంగా వుండే దీర్ఘకవిత. కానీ రెండేసి పాదాలతో couplets లాగా సాగుతుంది. | 1995 | Out of Print | |
6 | Vaartha Palukubadi (వార్త పలుకుబడి) | Dictionary | పాత్రకేయులకోసం ఎబికె ప్రసాద్ తో కలిసి రాసిన నిఘంటువు | 1996 | Out of Print | |
7 | Kanki (కంకి) | Editorials | వార్త లో రాసిన సంపాదకీయాలు. రైతుల మీద కాల్దరి(ప.గో.జిల్లా) లో కాల్పులు జరిగినప్పడు ’తూటాలకు తలలు వాల్చిన వరికంకులు‘ అనే సంపాదకీయాన్ని, రాష్టమంతటా కరపత్రాలుగా వేసి పంచుకున్నారు. (సతీష్ చందర్ వార్త దినపత్రిక వ్యవస్థాపక సహ సంపాదకులు) | 1999 | Out of Print | |
8 | Pasupu Jaabilli (పసుపు జాబిల్లి) | Poetry | గుజరాత్ లో భూకంపానికి కకావికలమైన జనాన్ని చూసి చలించి రాసిన కవిత్వం. | 2002 | Out of Print | |
9 | Daruvu (దరువు) | Satire | రాజకీయ వ్యంగ్యం. ఆంద్రప్రభ దినపత్రికలో ’దరువు‘ పేరు మీద నిర్వహించిన కాలమ్స్. తెలుగు లో కుష్వంత్ సింగ్ లాగా రాశారని సమీక్షకులు అన్నారు. | 2002 | Out of Print | |
10 | Vaalu Choopulu, Moothi Virupulu (వాలు చూపులూ, మూతి విరుపులూ) | Short Stories | స్త్రీని ప్రేమించేటప్పుడు అందం లేదా మనసు మాత్రమే కీలకమవుతాయి. కానీ ఆమె ప్రతిభ ఎందుకు కాదు? ఈ నేపథ్యంలో రాసిన హాస్యం తొణికస లాడే భిన్నమైన ప్రేమ కథలు | 2005 | Out of Stock | |
11 | Chandrahaasam (చంద్రహాసం) | Short Stories | జీవితాల్లో విలువలుపోయి, రూపాయిలు ప్రవేశించాయి. మనషులను అనుబంధాలు కాకుండా అవసరాలు కట్టిపారేస్తున్నాయి. ఈ థీమ్ తో మొత్తం 72 వ్యంగ్య కథలు రచయిత రాశారు. | 2006 | E-edtion on Kinige | |
12 | Mandal-Mandir (మండల్ మందిర్) | Editorials | రామమందిర నిర్మాణం కోసం ఆందోళనలూ, మండల్ సిఫారసులకు అనుకూలంగా వచ్చిన ఉద్యమాలూ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేస్తాయని, చాలా ముందుగా (1990లోనే) రాసిన సంపాదకీయాలు. | 2007 | Out of Stock | |
13 | Aadiparvam (ఆదిపర్వం) | Poetry | వచన కవిత్వం. రైతుల ఆత్మహత్యలూ, దళిత ఆత్మగౌరవ పోరాటాలూ, బహుళ జాతి సంస్థల ఆగడాలపై వచ్చిన కవిత్వం. | 2008 | Rs.100 | |
14 | Panchama Vedam (పంచమవేదం) Updated/Reprint Edition | Poetry | మూడవ ముద్రణ. అజంతా, గుంటూరు శేషేంద్ర శర్మల అభిప్రాయాలతో వెలువడింది. | 2011 | Rs.80 | |
15 | Paachika (పాచిక) | Political Essays | ‘పాచిక’ శీర్షిక కింద (2004 – 2006లో) సతీష్ చందర్ రాజకీయ వ్యాసాలను రాశారు. శాసన సభలో ప్రతిపక్షనేతగా వున్న వైయస్.రాజశేఖర రెడ్డీ, ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబు నాయుడూ తమ తమ పాత్రల్ని మార్చుకున్నారు. కేంద్రంలోనూ అంతే. ఎన్డీయే దిగిపోయి, యూపీయే వచ్చింది. చరిత్ర ముఖం మార్చుకుంటున్న తీరుపై రాసిన వ్యాసాలు. అప్పటికాయన ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన సంపాదకులు | 2012 | Rs.200 | |
16 | King Maker (కింగ్ మేకర్) | Satire | ‘ఫీల్ గుడ్’ అని దేశానికి భరోసా ఇచ్చిన వాజ్‌పేయీ పాలనకూ, ‘నిద్రపోను, నిద్రపోనివ్వను’ అని రాష్ట్రానికి కాపలా కాస్తున్న చంద్రబాబు సర్కారుకు ఏడాదిలోగా ‘శుభంకార్డు’ పడబోతుందని తెలియదు. క్లయిమాక్స్ లో కవ్వింపుల్లా ఈ రచనలు వచ్చాయి. | 2013 | Rs.180 | |
17 | Siggu (సిగ్గు) | Short Stories | ‘సిగ్గు’ కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్ఠాత్మకమైన సంకలన కర్తలు రెండు దశాబ్దాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో ‘సిగ్గు’ కథ వుంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలోని పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరితే, అందులో కూడా సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’ కథ వుంది. | 2014 | Rs.250 | |
18 | Nigraha Vakyam (నిగ్రహ వాక్యం) Available at Amazon | Literary Criticism | మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ. సతీష్ చందర్ ’పంచమ వేదం‘ పై వచ్చిన విమర్శ, ప్రతివిమర్శలు కూడా ఈ గ్రంథంలో వున్నాయి. | 2015 | Rs.250 | |
19 | Godhanam (గోధనం) | Novel | గో సంరక్షకుల పేరు మీద చేస్తున్న హింస పై సతీష్ చందర్ తన దైన వెటకారంతో రాసిన నవల. | 2016 | Rs.75 | |
20 | Featurelu Prayogaalu (ఫీచర్లు-ప్రయోగాలు) Available at Amazon | Practical Journalism | మీడియాలో ఇప్పడు నడుస్తున్నది ’పీచరింగ్‘ యుగం. ఎటొచ్చీ ఫీచర్లు రాసే వారే కరువయ్యారు. ఈలోటును పూరించటానికి రిపోర్టింగ్ లోనూ, ఎడిటింగ్ లోనూ, మీడియా బోధనలోనూ తనకున్న అనుభవాన్ని రంగరించి రచయితలకూ, పత్రికారచయితల కోసం సతీష్ చందర్ రాసిన పాఠ్యపుస్తకం. | 2017 | Rs.300 | |
21 | Padachitram (పదచిత్రం) | Poetry | తత్వానికీ, కవిత్వానికీ మధ్య వున్నది అతి చిన్న రేఖ. ఈ హద్దును చెరిపేస్తూ దాదాపు 500 కవితలు రాసి, స్వయంగా సతీష్ చందరే ప్రతి కవితకూ బొమ్మ గీసి ప్రచురించారు. | 2017 | Rs.250 | |
22 | B for Ballot (బి ఫర్ బ్యాలట్) Available at Amazon | Editorials | మూడు దశాబ్దాల(1999-2019) ఎన్నికల రాజకీయాయలను ఏడు విభాగాల (ప్రచారం, పొత్తులు, వోటు బ్యాంకులు, సమస్యలు, మధ్యంతరాలు, ఫిరాయింపులు, ఫలితాలు) కింద చర్చించి, వాటికి అనుబంధంగా ఎప్పటికప్పుడు ఆ రాజకీయాలను ఎక్స్ రే తీసి బయిట పెట్టిన 196 సంపాదకీయాలను జోడించారు. | 2019 | Rs.690 | |
23 | The Fifth Veda Available at Amazon | Poetry | The Fifth Veda is a collection of Dalit poems written by Satish Chandar. This has 36 poems, which were originally written in Telugu and translated into English by the author himself. The period in which he wrote these poems spanned across three decades (1989 – 2018). | 2020 | Rs.150 | |
24 | Booth Bungalow బూత్ బంగ్లా Available at Amazon | Satire | ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడే సమయం (2012-’14) లో, ఏయే నేతలు – ఏయే నాటకాలు ఆడారో, ఏయే వేషాలు వేసారో – చూపించే గ్రంథం. వాళ్లంతా ఇప్పుడూ వున్నారు; కబుర్లే మారాయి. ఈ గ్రంథం ఏ ఒక్క పేజీ, నవ్వకుండా తిప్పటం పాఠకుడికి సాధ్యం కాదు. ముందు నవ్వు; ఆ పైన ఆలోచన అలుముకుంటుంది. | 2021 | Rs.400 | |
25 | Love at Dust Site లవ్ ఎట్ డస్ట్ సైట్ Available at Amazon | Short Stories | లవ్ ఎట్ డస్ట్ సైట్ లో 101 కథలున్నాయి. అన్నీ ప్రేమ కథలే. అతి చిన్నకథలు. ఏ కథ చదవటానికయినా అరనిమిషం, లేదా నిమిషం, తప్పితే రెండు నిమిషాలు. ఇంకా చెప్పాలంటే ఓ నవ్వు నవ్వినంత కాలం. అన్నీ నవ్వే లవ్వు కథలే. కానీ నవ్వించి ఊరుకోవు. ఆలోచింప చేస్తాయి. ఈ కథలు మొత్తం తొమ్మది రకాలు (అధ్యాయాలు) : మార్కెట్ సైట్, క్రైమ్ సైట్, క్యాస్ట్ సైట్, డస్ట్ సైట్, క్యాంపస్ సైట్, వెడ్డింగ్ సైట్, ఆఫీస్ సైట్, పబ్ సైట్, బ్రేకప్ సైట్. | 2022 | Rs.300 | |
26 | C for Caste సి ఫర్ క్యాస్ట్ Available at Amazon | Editorials | ‘అదిగో కుటుంబం!’ అని ఈ దేశంలో ఏ కుటుంబాన్నయినా చూపవచ్చు. ‘కాదూ. అది కులం!’ అని ఈ గడ్డ మీద అంటే ఒప్పుకుని తీరాల్సిందే. కుటుంబం విశ్వరూపం కులం; కులం హ్రస్వ రూపం కుటుంబం. కులానికో పార్టీ. కులానికో మీడియా. కులానికో స్టార్. ఇలా ఒక్కొక్క రంగం గుట్టునూ విప్పుకుంటూ మూడు దశాబ్దాల (1990-2022) కుల రాజకీయాలను చెప్పారు ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్. | 2022 | Rs.950 | |
27 | Neram – Beram నేరం – బేరం Available at Amazon | Novel | ‘నేరం-బేరం’ అనే ఈ గ్రంథం నూటికి నూరుపాళ్ళూ రాజకీయ వ్యంగ్య నవల. రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు రాక పోతే, వచ్చేది నేరగాళ్ళూ లేదా బేరగాళ్ళే. నేరగాళ్ళు కింది నుంచి లేస్తే, బేరగాళ్ళు పై నుంచి దిగుతారు. దోపిడీలో దోపిడీ! జేబు కత్తిరించే వాడు ఒకడయితే, అందులోని క్యాష్ కాజేసేవాడిరకొకడు. ఇద్దరినీ కులం సృష్టించి వదిలేస్తే, వాళ్ళతో మార్కెట్ ఆడుకుంటుంది, ముచ్చటగా వాడుకుంటుంది కూడా. ఇదే ఆటయితే, చూసిన వాళ్ళు బేజారెత్తి ‘బజారు’ స్వామ్యం అనాలి. | 2023 | Rs.200 |