Category: Forewords

మాటలో పాగా!

ఒక్కడే. మాట్లాడతాడు. తనలో తాను కాదు. తన ముందున్న వారితో. తనకు దూరంగా వున్నవారితో. వందలు, వేలు, లక్షలు, కోట్ల మందితో! అప్పుడు మాట మంత్రం కాదు. మాధ్యమం. మాధ్యమం మారణాయుధమూ కాగలదు. మృత సంజీవినీ కాగలదు. అక్షరం చేసి ముద్రించినా, శబ్దం చేసి వినిపించినా, దృశ్యం చేసి చూపించినా, లేక ముద్రిత శబ్దచలనచిత్రంగా మార్చి…

మూడు దశాబ్దాలు! ఆరు అస్తిత్వాలు!!

తినేటప్పుడు కబుర్లు చెబితే అమ్మకు నచ్చేది కాదు. ‘నోరు మూసుకుని తిను,’ అనేది. ఈ వాక్యం విన్నప్పుడెల్లా, నవ్వొచ్చేది. కానీ, నచ్చేది. వెంటనే ఈ వాక్యానికి పేరడీలు చేయాలనిపించేది. ‘కళ్ళు మూసుకుని చూడు’, ‘కాళ్ళు ముడుచుకుని పరుగెత్తు’ ‘చేతులు కట్టుకుని చప్పట్లు కొట్టు.’

అమ్మ వాక్యాన్ని అక్షరబధ్ధంగా అమలు చెయ్యటానికి నేనేమన్నా పార్థుణ్ణా? వొళ్ళు వంచి సంపాదించుకొచ్చినట్లు, విల్లు వంచి తెస్తాడు ద్రౌపదిని. ఆ విషయం శుధ్ధ వచనంలో చెప్పొచ్చు కదా! ‘అమ్మా! పండు తెచ్చానే’ అని కవిత్వం వెలగబెడతాడు. ఆమెకు మాత్రం అది వచనంలాగానే అనిపిస్తుంది. ‘అయిదుగురూ పంచుకోండి’ అంది. కొన్ని విషయాల్లో మాతృవాక్పరిపాలకులయిన పాండవులు, వాక్యాన్ని వాచ్యంగా తీసుకుని అమలు జరిపేశారు.

‘ప్రారంభం’ మీ వంతు! ప్రయాణం నవల వంతు!

లక్ష్మీ, సరస్వతుల్లాంటి తోబుట్టువులే మరో ఇద్దరున్నారు. వాళ్ళే రూపవతి, సారమతులు. ఇక్కడా అంతే. ‘ఏవండోయ్‌! ఆవిడొచ్చింద’ని సృష్టికర్త కు చెప్పి, ఈవిడ చల్లగా జారుకుంటుంది. దాంతో సృష్టికర్త ఎవరో ఒకరినే నమ్ముకోవాలి. రూపం వుంటే సారం వుండదు, సారముంటే రూపం వుండదు. నేలబారుగా చెప్పాలంటే, ‘బిల్డప్‌’ వుంటే విషయం వుండదు. విషయం వుంటే ‘బిల్డప్‌’ వుండదు. దాంతో సృష్టి కర్త అనబడే రచయిత ఏం చేస్తాడు? ఎవరో ఒకరితోనే సెటిలయపోతాడు. అయితే రూపవతీ, లేకపోతే సారమతి.

సతీష్ చందర్ ‘కింగ్ మేకర్’ ఆవిష్కరణ

ఆహ్వానం – సతీష్‌ చందర్‌ కింగ్‌ మేకర్‌ – ఆవిష్కరణ సభ

వేళ: 29 అక్టోబరు 2013(మంగళవారం) సాయింత్రం గం.5.30లు

వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీమహాల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌

సభాధ్యక్షులు: శ్రీ పి.వి. సునీల్‌ కుమార్‌ ఐ.పి.ఎస్‌, నవలా రచయిత, కథకులు ఇన్స్పెక్టర్‌ జనరల్‌, గుంటూరు

మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం!

నవ్వటం మరచిపోయాం. ఇదో ఫిర్యాదు. అక్కడికి ఏడ్వటం పూర్తిగా తెలిసిపోయినట్లు! సుష్టుగా భోజనం చేసినట్లు, తృప్తిగా దు:ఖించి ఎన్నాళ్ళయింది? రెండువందలు తగలేసినా మల్టీప్లెక్స్‌లో మూడు సెకండ్లకు మించి కళ్ళు చెమర్చటం లేదు. ఎంత దగ్గరవాడు పోయినా ఏడుపు వచ్చి చావటం లేదు.

దగ్గర..దగ్గర..అని ఉత్తినే మాట్లాడుకుంటున్నాం కానీ, కొలిచి చూస్తే, కౌగిలిలో వున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య దూరం పదివేల కిలోమీటర్లు. ఎదలు కలిస్తే కదా, ఎడబాటు తెలియటానికి!

ఆట మొదలు!

అక్టోబరు 29, 2012 (సోమవారం) నాడు నా రాజకీయ వ్యాసాల సంకలనం వెలువడింది. 2004-2006 మధ్య కాలంలో నేను ఆంధ్రప్రభ ప్రధాన సంపాదకుడిగా వుండగా ప్రతీ ఆదివారం ’పాచిక‘ పేరు మీద చేసిన రచనలివి. ఒక రకంగా ఇవి ఆదివారం సంపాదకీయాలు. వాటి నేపథ్యాన్ని వివరిస్తూ తొలిపలుకు రాశాను. అదే ఈ ’ఆట మొదలు‘. అప్పట్లో పాఠకులు ఆదరించారు. ఫేస్ బుక్ మిత్రులు ఈ పుస్తకం లో ఏ ముందని అడుగుతున్నారు. ప్రతుల కోసం ఈ ముందు మాట కింద ఇచ్చిన చిరునామానుంచి పుస్తకాలు పొంద వచ్చు.

‘కుంపటి’ మీద గుండెలు!

ఎప్పుడో కానీ ఎవరి పాత్రలో వారు జీవించరు. వెలుపలే వుండిపోతారు. వెలుపల వుండిపోయిన వాడి వాలకమే వేరు. వాడి ముఖంలో అన్ని కళలూ వుంటాయి- ఒక్క జీవ కళ తప్ప. ఎవడినో ఎందుకనుకోవాలి. ఎవరి మట్టుకు వారు, మీ మట్టుకు మీరు, నామట్టుకు నేను – ఎక్కువ కాలం వెలుపలే గడిపేస్తుంటాం. పొడి పలకరింపులతో, యాంత్రికాలింగనాలతో,కృత్రిమ కరచాలనాలతో జీవితాన్ని నటించి, నటించి సొమ్మసిల్లి పోతుంటారు. అలాంటప్పుడు నాలోకి నన్నూ, నీలోకీ నిన్నూ పంప గలిగే మాంత్రికుడు ఒకడుంటే బాగుండునని పిస్తుంది.

సీత చేతి ఉంగరం

వాగ్గేయకారుడుగా జయరాజు తెలుగువారికి సుపరిచితుడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన పాటలు వినని వారుండరు. పలు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. వామపక్ష ఉద్యమాలకు బాసటగా ఆయన సాహిత్యం నిలిచింది. కార్మికనేతగా, కళాకారుడిగా ఆయన ఉద్యమజీవితంగా సాగించారు. సాగిస్తున్నారు కూడా. ఆయన తన పాతికేళ్ళ సాహిత్యప్రస్థానానికి గురుతుగా వేసిన ‘వసంత గీతం’ పుస్తకానికి రాసిన ముందు మాట ఇది.

నిన్నటి కలలే నేటి అలలు!

శ్రీశ్రీ పక్కన నిలుచున్నా, సముద్రపు వొడ్డున కూర్చున్నా ఒక్కటే. చిరుకోపం వుంటే మహోద్రేకమవుతుంది. కొంచెం దు:ఖమే కావచ్చు. దావాలనమవుతుంది. చిన్ననవ్వే పెనుసంబరంగా మారుతుంది.
శ్రీశ్రీ సముద్రమంతటి ఉత్ప్రేరకం. వామనుడికి సైతం విశ్వరూపాన్ని ప్రదర్శించగల శక్తి అది. శ్రీశ్రీ చైన్నైలో వున్నా, విశాఖలో వున్నా సముద్రాన్ని ప్రేమించేవాడు. సముద్రంలేని చోట వుండటానికి ఇష్ట పడేవాడు కాడు.
డెరెక్‌ వాలకాట్‌కి సముద్రమంటే ఎంత ఇష్టమో, శ్రీశ్రీకీ సముద్రమన్నా అంతే ఇష్టం. సముద్రాన్ని కోల్పోవటం చిన్న విషయం కాదు. ‘సముద్రాన్ని కోల్పోయిన జీవితం దేహాన్ని కోల్పోయిన వస్త్రం లాంటింద’న్నాడు వాల్‌కాట్‌ చమత్కారంగా.

‘కడగని’ పాత్రలు ఈ ‘నెగెటివ్‌’లు!

ఇలా రాసిందే రచన- అని ఏ రచయితనీ బెదరించలేం. ఇలా పెట్టిందే గుడ్డు- అని ఏ పిట్టనీ

వణికించలేం. అలా చేస్తే రాసింది రచనా కాదు. పెట్టింది గుడ్డూ కాదు. రచయితలంతా పుస్తకాలలోనుంచో,

విశ్వవిద్యాలయాల్లోంచో, పత్రికల్లోంచో పుట్టుకురావాలన్న షరతు కూడా లేదు. కల్లు కాంపౌండులోంచో, రెడ్‌ లైట్‌

ఏరియాలోంచో, వెలివాడలోంచో రచయిత పుట్టుకురావచ్చు. గుడ్లు పెట్టే వన్నీ ఫోరం కోళ్ళే కావాలని రూలు

లేదు. అడవిలోని కోడి కూడా గుడ్డు పెడుతుంది.
కెమెరా విజయకుమార్‌ రాయలని పథకం వేసుకుని రాయలేదు. రాయకుండా వుండలేక

రాసేశాడు. తాను వెనక్కి తిరిగి చూసుకునే సరికి రచయిత అయిపోయాడు. ఇంకేచేస్తాడు? తప్పించుకోలేడు.

ఊరందరి బెంగల్నీ మొయ్యాల్సిందే. అందుక్కూడా ఆయన సిధ్ధపడ్డాడు. కానీ ఊరువరకూ ఆయన్ని వెళ్ళనిస్తే

కదా! వాడ బెంగలే కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇంక కదలితే వొట్టు.

చిత్త ప్రసాద్‌ ‘రాతబడి’ చేశాడు!

నంది అంటే నంది
పంది అంటే పంది
అనే వాళ్ళను వంది మాగధులంటారు. ‘పంది’మాగధులని ఎందుకనరో!
అలాంటి ‘పంది’మాగధుడే ఒక ‘మధురమయి’న రాజ్యంలో ప్రధాన మంత్రిగా చెలామణీ అయిపోతున్నాడు.
ఆ రాజ్యం పేరు ‘రసగుల్లా రాజ్యం’. మంత్రికీ, రాజ్యానికీ ఏ మాత్రం పొంతన లేదు కదూ!
అందమైన దేశానికి అసహ్యకరమైన మంత్రి ఎందుకొస్తాడు? రాజుకు బుధ్ధిలేక పోతే సరి!
బుధ్ధిలేని రాజూ, గడ్డితినే మంత్రీ ఉద్యానవనంలో విహరిస్తుండంగా, నిజంగానే ఇద్దరూ పందిని చూశారు.
‘ఏమిటది?’ అన్నాడు బుధ్ధిలేని రాజు.
చిత్రం! పందిని పంది- అని చెప్పలేదు గడ్డితినే మంత్రి.
‘బక్కచిక్కిన ఏనుగు’ అన్నాడు.