Books

List of published books by Satish Chandar

S.noBook ThumbnailName/TitleGenreDescriptionYearPrice
1Made in India

 (మేడ్ ఇన్ ఇండియా)

Satireఎనభయ్యవ దశకం చివరి పాదంలో ఎన్టీ ఆర్ ముఖ్యమంత్రిగా వుండగా రాసిన వ్యంగ్యం. ఈ పుస్తకం చదివాకే ఎబికె ప్రసాద్ సతీష్ చందర్ ను ఆర్ట బుచ్ వాల్డ్ తో పోల్చారు1992Out of Print
2[Image Not Available]Dunkel Bells

 (డంకెల్ బెల్స్)

Playడంకెల్ ప్రతిపాదనల వల్ల రైతుకు జరిగే నష్టం పై వచ్చిన వీధినాటకం.1993Out of Print
3 Panchamavedam

 (పంచమవేదం)

Poetryతొంభయ్యవ దశకం తెలుగు కవిత్వ దిశను మార్చేసిన గ్రంథం. పలు యూనివర్శిటీల్లో పాఠ్య గ్రంథం.1995Out of Print
4 Itihaasam

 (ఇతి హాసం)

Satireనడుస్తున్న రాజకీయాలను జానపద కథల్లాగా రాసిన గ్రంధం.1995Out of Print
5 Naanna Cycle

 (నాన్న సైకిలు)

Poetryస్వీయ చరిత్రాత్మకంగా వుండే దీర్ఘకవిత. కానీ రెండేసి పాదాలతో couplets లాగా సాగుతుంది.1995Out of Print
6 Vaartha Palukubadi

 (వార్త పలుకుబడి)

Dictionaryపాత్రకేయులకోసం ఎబికె ప్రసాద్ తో కలిసి  రాసిన నిఘంటువు1996Out of Print
7 Kanki

(కంకి)

Editorialsవార్త లో రాసిన సంపాదకీయాలు. రైతుల మీద కాల్దరి(ప.గో.జిల్లా) లో కాల్పులు జరిగినప్పడు ’తూటాలకు తలలు వాల్చిన వరికంకులు‘ అనే సంపాదకీయాన్ని, రాష్టమంతటా కరపత్రాలుగా వేసి పంచుకున్నారు. (సతీష్ చందర్ వార్త దినపత్రిక వ్యవస్థాపక సహ సంపాదకులు)1999Out of Print
8 Pasupu Jaabilli

 (పసుపు జాబిల్లి)

Poetryగుజరాత్ లో భూకంపానికి కకావికలమైన జనాన్ని చూసి చలించి రాసిన కవిత్వం.2002Out of Print
9 Daruvu

(దరువు)

Satireరాజకీయ వ్యంగ్యం.  ఆంద్రప్రభ దినపత్రికలో  ’దరువు‘ పేరు మీద నిర్వహించిన కాలమ్స్. తెలుగు లో కుష్వంత్ సింగ్ లాగా రాశారని సమీక్షకులు అన్నారు.2002Out of Print
10Vaalu Choopulu, Moothi Virupulu

 (వాలు చూపులూ, మూతి విరుపులూ)

Short Storiesస్త్రీని ప్రేమించేటప్పుడు అందం లేదా మనసు మాత్రమే కీలకమవుతాయి. కానీ ఆమె ప్రతిభ ఎందుకు కాదు? ఈ నేపథ్యంలో రాసిన హాస్యం తొణికస లాడే భిన్నమైన ప్రేమ కథలు2005Out of Stock
11 Chandrahaasam

 (చంద్రహాసం)

Short Storiesజీవితాల్లో విలువలుపోయి, రూపాయిలు ప్రవేశించాయి. మనషులను అనుబంధాలు కాకుండా అవసరాలు కట్టిపారేస్తున్నాయి. ఈ థీమ్ తో మొత్తం 72 వ్యంగ్య కథలు రచయిత రాశారు.2006E-edtion on Kinige
12 Mandal-Mandir

(మండల్ మందిర్)

Editorialsరామమందిర నిర్మాణం కోసం ఆందోళనలూ, మండల్ సిఫారసులకు అనుకూలంగా వచ్చిన ఉద్యమాలూ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేస్తాయని, చాలా ముందుగా (1990లోనే) రాసిన సంపాదకీయాలు.2007Out of Stock
13 Aadiparvam

 (ఆదిపర్వం)

Poetryవచన కవిత్వం. రైతుల ఆత్మహత్యలూ, దళిత ఆత్మగౌరవ పోరాటాలూ, బహుళ జాతి సంస్థల ఆగడాలపై వచ్చిన కవిత్వం.2008Rs.100
14 Panchama Vedam

 (పంచమవేదం) Updated/Reprint Edition

Poetryమూడవ ముద్రణ. అజంతా, గుంటూరు శేషేంద్ర శర్మల అభిప్రాయాలతో వెలువడింది.2011Rs.80
15 Paachika

 (పాచిక)

Political Essays ‘పాచిక’ శీర్షిక కింద (2004 – 2006లో) సతీష్ చందర్ రాజకీయ వ్యాసాలను రాశారు. శాసన సభలో ప్రతిపక్షనేతగా వున్న వైయస్.రాజశేఖర రెడ్డీ, ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబు నాయుడూ తమ తమ పాత్రల్ని మార్చుకున్నారు. కేంద్రంలోనూ అంతే. ఎన్డీయే దిగిపోయి, యూపీయే వచ్చింది. చరిత్ర ముఖం మార్చుకుంటున్న తీరుపై రాసిన వ్యాసాలు. అప్పటికాయన ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన సంపాదకులు2012Rs.200
16 King Maker

 (కింగ్ మేకర్)

Satire‘ఫీల్ గుడ్’ అని దేశానికి భరోసా ఇచ్చిన వాజ్‌పేయీ పాలనకూ, ‘నిద్రపోను, నిద్రపోనివ్వను’ అని రాష్ట్రానికి కాపలా కాస్తున్న చంద్రబాబు సర్కారుకు ఏడాదిలోగా ‘శుభంకార్డు’ పడబోతుందని తెలియదు. క్లయిమాక్స్ లో కవ్వింపుల్లా ఈ రచనలు వచ్చాయి.2013Rs.180
17Siggu

 (సిగ్గు)

Available at Amazon

Short Stories‘సిగ్గు’ కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్ఠాత్మకమైన సంకలన కర్తలు రెండు దశాబ్దాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో ‘సిగ్గు’ కథ వుంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలోని పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరితే, అందులో కూడా సతీష్‌ చందర్‌ ‘డాగ్‌ ఫాదర్‌’ కథ వుంది.2014Rs.250
18Nigraha Vakyam

 (నిగ్రహ వాక్యం) Available at Amazon

Literary Criticism మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు అద్దం పట్టే విమర్శ. సతీష్ చందర్ ’పంచమ వేదం‘ పై వచ్చిన విమర్శ, ప్రతివిమర్శలు కూడా ఈ గ్రంథంలో వున్నాయి.2015Rs.250
19Godhanam

 (గోధనం)

Novelగో సంరక్షకుల పేరు మీద చేస్తున్న హింస పై సతీష్ చందర్ తన దైన వెటకారంతో రాసిన నవల.2016 Rs.75
20Featurelu Prayogaalu

 (ఫీచర్లు-ప్రయోగాలు)

Available at Amazon
Practical Journalism మీడియాలో ఇప్పడు నడుస్తున్నది ’పీచరింగ్‘ యుగం. ఎటొచ్చీ ఫీచర్లు రాసే వారే కరువయ్యారు. ఈలోటును పూరించటానికి రిపోర్టింగ్ లోనూ, ఎడిటింగ్ లోనూ, మీడియా బోధనలోనూ తనకున్న అనుభవాన్ని రంగరించి రచయితలకూ, పత్రికారచయితల కోసం సతీష్ చందర్ రాసిన పాఠ్యపుస్తకం.2017 Rs.300
21Padachitram

 (పదచిత్రం)

Poetry తత్వానికీ, కవిత్వానికీ మధ్య వున్నది అతి చిన్న రేఖ. ఈ హద్దును చెరిపేస్తూ దాదాపు 500 కవితలు రాసి, స్వయంగా సతీష్ చందరే ప్రతి కవితకూ బొమ్మ గీసి ప్రచురించారు.2017Rs.250
22B for Ballot

 (బి ఫర్ బ్యాలట్) Available at Amazon

Editorialsమూడు దశాబ్దాల(1999-2019) ఎన్నికల రాజకీయాయలను  ఏడు విభాగాల (ప్రచారం, పొత్తులు, వోటు బ్యాంకులు, సమస్యలు, మధ్యంతరాలు, ఫిరాయింపులు, ఫలితాలు) కింద చర్చించి, వాటికి అనుబంధంగా ఎప్పటికప్పుడు ఆ రాజకీయాలను ఎక్స్ రే తీసి బయిట పెట్టిన 196 సంపాదకీయాలను జోడించారు.2019Rs.690
23The Fifth VedaThe Fifth Veda

Available at Amazon
Poetry
The Fifth Veda is a collection of Dalit poems written by Satish Chandar. This has 36 poems, which were originally written in Telugu and translated into English by the author himself. The period in which he wrote these poems spanned across three decades (1989 – 2018).
2020Rs.150
24Booth Bungalow

 బూత్ బంగ్లా

Available at Amazon
Satireఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడే సమయం (2012-’14) లో, ఏయే నేతలు – ఏయే నాటకాలు ఆడారో, ఏయే వేషాలు వేసారో – చూపించే గ్రంథం. వాళ్లంతా ఇప్పుడూ వున్నారు; కబుర్లే మారాయి. ఈ గ్రంథం ఏ ఒక్క పేజీ, నవ్వకుండా తిప్పటం పాఠకుడికి సాధ్యం కాదు. ముందు నవ్వు; ఆ పైన ఆలోచన అలుముకుంటుంది.2021Rs.400
25Love at Dust Site
లవ్ ఎట్ డస్ట్ సైట్

Available at Amazon
Short Storiesలవ్ ఎట్ డస్ట్ సైట్ లో 101 కథలున్నాయి. అన్నీ ప్రేమ కథలే. అతి చిన్నకథలు. ఏ కథ చదవటానికయినా అరనిమిషం, లేదా నిమిషం, తప్పితే రెండు నిమిషాలు. ఇంకా చెప్పాలంటే ఓ నవ్వు నవ్వినంత కాలం. అన్నీ నవ్వే లవ్వు కథలే. కానీ నవ్వించి ఊరుకోవు. ఆలోచింప చేస్తాయి. ఈ కథలు మొత్తం తొమ్మది రకాలు (అధ్యాయాలు) : మార్కెట్ సైట్, క్రైమ్ సైట్, క్యాస్ట్ సైట్, డస్ట్ సైట్, క్యాంపస్ సైట్, వెడ్డింగ్ సైట్, ఆఫీస్ సైట్, పబ్ సైట్, బ్రేకప్ సైట్.2022Rs.300
26C for Caste
సి ఫర్ క్యాస్ట్

Available at Amazon
Editorials‘అదిగో కుటుంబం!’ అని ఈ దేశంలో ఏ కుటుంబాన్నయినా చూపవచ్చు. ‘కాదూ. అది కులం!’ అని ఈ గడ్డ మీద అంటే ఒప్పుకుని తీరాల్సిందే. కుటుంబం విశ్వరూపం కులం; కులం హ్రస్వ రూపం కుటుంబం. కులానికో పార్టీ. కులానికో మీడియా. కులానికో స్టార్‌. ఇలా ఒక్కొక్క రంగం గుట్టునూ విప్పుకుంటూ మూడు దశాబ్దాల (1990-2022) కుల రాజకీయాలను చెప్పారు ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్‌ చందర్‌. 2022Rs.950
27Neram – Beram
నేరం – బేరం

Available at Amazon
Novel‘నేరం-బేరం’ అనే ఈ గ్రంథం నూటికి నూరుపాళ్ళూ రాజకీయ వ్యంగ్య నవల. రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు రాక పోతే, వచ్చేది నేరగాళ్ళూ లేదా బేరగాళ్ళే. నేరగాళ్ళు కింది నుంచి లేస్తే, బేరగాళ్ళు పై నుంచి దిగుతారు. దోపిడీలో దోపిడీ! జేబు కత్తిరించే వాడు ఒకడయితే, అందులోని క్యాష్‌ కాజేసేవాడిరకొకడు. ఇద్దరినీ కులం సృష్టించి వదిలేస్తే, వాళ్ళతో మార్కెట్‌ ఆడుకుంటుంది, ముచ్చటగా వాడుకుంటుంది కూడా. ఇదే ఆటయితే, చూసిన వాళ్ళు బేజారెత్తి ‘బజారు’ స్వామ్యం అనాలి. 2023Rs.200