Category: ‘భయో’డేటా

నం’దమ్మూ’రి!

పేరు : నందమూరి తారక రామారావు( జూనియర్‌)

దరఖాస్తు చేయు ఉద్యోగం: వారసుడు (సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా)

ముద్దు పేర్లు : కుర్ర తాత( తాత ఎన్టీఆర్‌ మనవడి ఎన్టీఆర్‌ను -తాతా- అని పిలిచేవాడు లెండి), జూనియర్‌( సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ‘సీనియారిటీ’ అన్ని వేళలా నిలవదు. బాబాయ్‌లు అబ్బాయ్‌ లు కావచ్చు, అబ్బాయ్‌లు బాబాయ్‌లు కావచ్చు.) తాతకు తగ్గ మనవడు. నం’దమ్మూ’రి!

‘తిరం’జీవి

పేరు : చిరంజీవి

దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర మంత్రి (గతంలో మా సామాజిక వర్గానికి చెందిన సినీ దర్శకుడికచ్చారే అలా..)

ముద్దు పేర్లు : ఆటు పోట్లకు వీలుగా రెండు పేర్లున్నాయి. హిట్టయితే ‘మెగా’, ఫ్లాపయితే ‘చిరు'(సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా ఇవే ముద్దు పేర్లు). తిరుపతిలో పోటీ చేసి గెలిచినప్పుడు మాత్రం కొందరు- ‘ఆహా! ‘తిర’ంజీవి అన్నారు. ఇప్పుడా సీటు పోతే పత్రికల వాళ్ళు – కాంగ్రెస్‌ కు ‘తిరు’ క్షవరం అని హెడ్‌లైన్లు పెట్టరు. ‘చిరు’ క్షవరం అంటారు… అదీ నాబెంగ

‘డాను’ కిరణ్‌

పేరు : భాను కిరణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘డాను’ కిరణ్‌( అవును. డాన్‌ను కావాలనుకున్నాను.)

ముద్దు పేర్లు : ‘గన్ను’ పోటు దారు.(నమ్మిన వ్యక్తిని వెనకనుంచి పొడిచినప్పుడు, రాజకీయాల్లో అయితే వెన్నుపోటు అంటారు. మా మాఫియా భాషలో ‘గన్ను’ పోటు అంటారు. కానీ రాజకీయంగా ‘మామ’ను పొడిచిన అల్లుళ్ళు కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు. అదే నాకు బాధగా వుంది.

దివాకర ‘రాయలు’!

పేరు : జేసీ దివాకర రెడ్డి
దరఖాస్తు చేయు ఉద్యోగం: రాయల తెలంగాణ ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : దివాకర ‘రాయలు'( రాయల తెలంగాణ వస్తే తానే శ్రీకృష్ణ దేవ రాయలు లాగా ‘భువన విజయం’ చేయవచ్చు.
విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ బ్రేకింగ్‌ అండ్‌ వెల్డింగ్‌( కలిసిన వాటిని విరచగలరు. విడిపోయిన వాటిని అతక గలరు. (ఆంధ్రప్రదేశ్‌ను మూడుగా విభజించి, రెంటిని అతికి- రాయల తెలంగాణ- చేయాలన్న సంకల్పం అలా వచ్చిందే

‘ఉత్తర’ కుమారుడు

పేరు : రాహుల్‌ గాంధీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: మంచి కొడుకు( ఇంతకు ముందు ఈ పోస్టు నాదే. కానీ యుపి ఎన్నికల తర్వాత అఖిలేష్‌ యాదవ్‌ కొట్టేశాడు.)

ముద్దు పేర్లు : ‘ఉత్తర’కుమారుడు (అంటే ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేసిన సోనియా కుమారుడని అర్థం కాదు. గెలిచేస్తానని ప్రగల్బాలు పలికి చతికిలబడ్డ భారతంలోని ఉత్తర కుమారుణ్ణే)

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ పెయిల్యూర్స్‌ (ప్రచార రాజకీయాల్లో వరుస వైఫల్యాలు చూస్తూ, ‘బ్యాచిలర్‌’ గానే వుండి పోయాను. ప్రధాని అయ్యాక పెళ్ళికొడుకునవుదామన్న కోరిక నెరవేరటం లేదు.

జిత్తుల సత్తి బాబు

సంక్షేమమే ఏకైక సిధ్ధాంతం. ముందు కుటుంబ సంక్షేమం( సభ్యులందరికీ పదవులొచ్చాయా? లేదా?) తర్వాత కుల సంక్షేమం (కులంలో తనకి అనుకూలురకు న్యాయం జరిగిందా? లేదా?) ఆ పైన గ్రూపు సంక్షేమం( పార్టీలో తన వర్గం వారికి ఏదయినా దక్కిందా? లేదా?) చిట్ట చివరగా చిరు సంక్షేమం( చిరంజీవి వర్గీయులకు ఇచ్చారా? లేదా?) ఆ తర్వాతే పార్టీ సంక్షేమమయినా, ప్రభుత్వ సంక్షేమమయినా..!