
ఆట మళ్ళీ మొదలు.
మామూలు ఆట కాదు. రక్తసిక్తమైన క్రీడ.
ఒకప్పుడు రెండు టీమ్‌లు సరిపోయాయి. ఇప్పుడు మూడు టీమ్‌లు కావాలి. ఆట కోసం ప్రాణాలు అర్పించాలి. రోడ్ల మీద పరుగులు తీస్తూ నిలువునా దగ్థమవ్వాలి. నడిచే బస్సులు భస్మీపటలమయిపోవాలి.
కేకలు. ఆక్రందనలు. నినాదాలు. ఆమరణ దీక్షలు.
ఈ మృగయా వినోదానికి ముహూర్తాలు పెడుతున్నారు ఢిల్లీలో పెద్దలు.










