Tag: కిరణ్ కుమార్ రెడ్డి

తొందరపడి ‘చంద్రులు’ ముందే వెలిగారు!

ద్వేషాలూ, అవసరాలూ- ఈ రెండే ఎన్నికల్లో అమ్మకపు సరకులు. ద్వేషం ఇలా పుట్టి అలా చల్లారిపోతుంది. ఒక అవసరం తీరిన వెంటనే ఇంకొకటి పుట్టుకొస్తుంది. అందుకే ద్వేషాన్ని రగులుస్తూ వుండాలి; మైనారిటీ వోటర్ల మీద మెజారిటీ వోటర్లను ఎగదోస్తూ వుండాలి. తీర్చిన అవసరాలను గుర్తు చేస్తూ వుండాలి; ‘అమవాస్య నాడు అట్టు పెట్టాను, పౌర్ణమి నాడు…

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌!

పేరు : జానా రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రొటెం ముఖ్యమంత్రి ( ఈ పోస్టు ఉండదని నాకూ తెలుసు. కానీ ఉంటే బాగుండునన్నది నా ఆకాంక్ష. ప్రొటెం స్పీకర్‌- అనే పదవి ఉన్నది కాబట్టే కదా, కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా తెలంగాణ శాసన సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యాను చూశారా?)

ముద్దు పేర్లు : ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ (ప్రొటెం స్పీకర్‌ పదవి ఒక్కరోజు తోనే ముగుస్తుంది.)

‘విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ మిస్‌అండర్‌స్టాండింగ్‌(మనం ఒకటి మాట్లాడితే, జనానికి ఇంకోలా అర్థమవుతుంది. నేను హోం మంత్రిగా వున్నప్పుడుకూడా నా వ్యాఖ్యానాలు అర్థం కాక పోవటం వల్లనే నక్సలైట్లు నన్ను టార్గెట్‌ చెయ్యలేదు.)

మౌనమే మహా తంత్రం!

నోరు తెరవటమే కాదు, నోరు మూసుకోవటం కూడా గొప్ప విద్యే. ఎప్పుడూ మాట్లాడని వాడిని, ఓ రెండు నిమిషాలు వేదిక ఎక్కి మాట్లాడమంటే, ఎంత కష్టంగా వుంటుందో; ఎప్పడూ వాగే వాడిని ఒక్క నిమిషం నోరు మూసుకోమనటం కూడా అంతే కష్టంగా వుంటుంది.

అందుకనే మౌనం చాలా కష్టమైన విషయం.

స్కూళ్ళలో టీచర్లు పాఠం చెప్పటానికి ఎంత శక్తి ఖర్చు చేస్తారో తెలియదు కానీ, అంతకు రెండింతలు ‘సైలెన్స్‌’ అనటానికి వెచ్చిస్తారు.

‘సమైక్య’ బరిలో మూడు పందెం కోళ్ళు

సమైక్యాంధ్ర ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ ఎవరికి దక్కబోతోంది! ఇప్పుడు నిజంగా అసెంబ్లీలో ( జనవరి 23 వరకూ) నడుస్తున్నది ఈ పోటీయే!

చర్చ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు మీదనే. ఈ బిల్లు చర్చకు రావటం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ మేరకు ప్రయోజనం వుందో తెలియదు కానీ, సీమాంధ్ర శాసన సభ్యులకు మాత్రం ఇది చాంపియన్‌షిప్‌కు జరుగుతున్న పోటీలాగే అనిపిస్తోంది.

కిరణ్‌ కేబినెట్‌లో ‘లీకు’ వీరులు!!

పథకాలు కూడా సినిమాల్లా అయిపోయాయి. సినిమాలకు ఉన్నట్టే వీటికీ ఫార్ములాలు వుంటాయి. ఫార్ములాను తప్పి ఎవరన్నా పథకం పెడితే, దాని భవిష్యత్తు చెప్పలేం.

సినిమాలకు స్ప్రిప్టు రైటర్లున్నట్టే, పథక రచయితలు కూడా వుంటారు. అసలు రచయితలు అసలు కనపడనే కనపడరు. కనిపిస్తే జనం దడుచుకుంటారు. అందుకే వారిని ‘ఘోస్ట్‌’ రైటర్లూ అంటారు. మరీ అనువాదం తప్పదంటే ‘భూత’ రచయితలనుకోవచ్చు

‘ఉత్తర'(ఆంధ్ర) కుమారుడు!

పేరు బొత్స సత్యనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: మార్పులేదు. ముఖ్యమంత్రి ఉద్యోగమే( కలిసి వుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, విడిపోతే సీమాంధ్ర ముఖ్యమంత్రి. మరోమారు విడిపోతే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి.) ముఖ్యమంత్రి పదవిని ఆశించటంలో తప్పులేదని ఎన్నోసార్లు చెప్పాను.

ముద్దు పేర్లు : ‘ఉత్తర’ కుమారుడు(ప్రగల్బాలు పలుకుతానని కాదు సుమా! ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాడిని. ఉత్తరాంధ్ర ప్రజలకు రాకుమారుడిని కూడా. నేనంటే అంతటి అభిమానం చూపిస్తారు.) చదివింది మహారాజా కాలేజిలో కదా- ఆమాత్రం రాజసం ఉట్టిపడుతుంది లెండి.