Tag: కే్జ్రీవాల్

మన జేపీ, కేజ్రీవాల్‌ కాలేరా?

‘చీచీచీ చీనా వాడు, చౌచౌచౌ చౌనీ దాన్ని ప్రేమిస్తాడు’ అన్నాడు శ్రీశ్రీ. ఏ రేంజ్‌కు ఆ రేంజ్‌ ప్రేమలుంటాయి. మమమ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే కుర్రాడు వివివి విప్రోలో పనిచేసే కుర్రదాన్ని ప్రేమిస్తాడు. రాజకీయాల్లో పొత్తులు కూడా అంతే. పేరు మోసిన పార్టీల మధ్యే పొత్తులు వుండాలన్న రూలు లేదు. నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోవచ్చు. పువ్వు పుట్టగానే ‘ప్రేమించినట్టు’, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) పుట్టగానే పొత్తు పెట్టుకోవటానికి సిధ్దపడుతోంది.

బాబా! బాబా! బ్లాక్‌ షీప్‌!!

ఎదగ వచ్చు.

ఎవ్వరు ఎలాగయినా ఎదగ వచ్చు. నిలువుగా ఎదగవచ్చు. అడ్డంగా ఎదగవచ్చు.

లేదూ ముందు అడ్డంగా ఎదిగి, తర్వాత నిలువుగా ఎదగ వచ్చు.

ఎదగటం- ముఖ్యమనుకుంటే చాలు.

పదోతరగతి తప్పిన కుర్రాడు బస్సెక్కుతాడు. అతని కళ్ళ ముందే ఒక పెద్దాయన తన స్టాపులో గబగబా దిగిపోతుంటాడు. పర్సుజారి కుర్రాడి కాళ్ళ మీద పడుతుంది. తీసి కళ్ళకద్దు కుంటాడు. ‘తిరిగి పెద్దాయనకు ఇచ్చే వాణ్ణే కానీ, దిగి వెళ్ళిపోయాడు కదా!’ తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంటాడు. పర్సులో వెయ్యి. తర్వాత ఇలాగే బస్సు ఎక్కుతుంటాడు. ఎవరూ అతని కోసం పర్సు పారేసుకోరు. ఈ సారి తనే ఎవరి పర్సో కొడతాడు. పని తేలికయి పోయింది. తర్వాత కొంపలు కొడతాడు. అలా దొంగ పర్మిట్లూ, దొంగ కాంట్రాక్టులూ కొట్టి శత కోటీశ్వరుడయి పోతాడు. ఇంత వరకూ ఎదిగింది నిలువుగా.