గోరా శాస్త్రి రేడియోనాటికలు దూరాన్నే కాదు కాలాన్ని కూడా జయించాయి. పేరుకు శ్రవ్యనాటికలు కాని వాటినిండా దృశ్యాలే. పాత పుస్తకంలో కొత్త వాక్యం దొరికింది. – పాత పెట్టెలో ప్రియురాలి ఫొటో దొరికనట్లు. నిద్రపోతే ఒట్టు. తడిసిన కళ్లలాంటి పదాలు! కవిత్వమా? కాదు. పరమ పవిత్రమైన వచనం. జీవితాన్ని రక్తమాంసాలతో చూపించగలిగేది ఒక్క వచనమే కాబోలు!…