Tag: కవిత్వం

మూడు పూటలా మూడు చెంచాల కవిత్వం!

నవ్వటం మరచిపోయాం. ఇదో ఫిర్యాదు. అక్కడికి ఏడ్వటం పూర్తిగా తెలిసిపోయినట్లు! సుష్టుగా భోజనం చేసినట్లు, తృప్తిగా దు:ఖించి ఎన్నాళ్ళయింది? రెండువందలు తగలేసినా మల్టీప్లెక్స్‌లో మూడు సెకండ్లకు మించి కళ్ళు చెమర్చటం లేదు. ఎంత దగ్గరవాడు పోయినా ఏడుపు వచ్చి చావటం లేదు.

దగ్గర..దగ్గర..అని ఉత్తినే మాట్లాడుకుంటున్నాం కానీ, కొలిచి చూస్తే, కౌగిలిలో వున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య దూరం పదివేల కిలోమీటర్లు. ఎదలు కలిస్తే కదా, ఎడబాటు తెలియటానికి!

మెత్తని సంభాషణ!

కఠినంగా ఏది కనిపించినా మనం ఊరుకోం. కొబ్బరి పెంకును బద్దలు కొట్టి మెత్తని తెల్లదనాన్ని చూస్తాం. రాయి కఠినం. చెక్కేసి ఒక సుకుమారిని చేసేస్తాం. ప్రపంచమంతా పైకి కఠినమే. పై కవచాన్ని తొలిచేస్తే లోన పసిపాపే. అప్పడు భూగోళాన్ని ఒళ్ళోకి తీసుకోవచ్చు. అరమరికలు మరచి ముద్దాడ వచ్చు. ఈ భోగం ఒక కవి కి తెలుస్తుంది. తప్పితే తెలిసేది కళాకారుడికే.

రెండు గీతల నడుమ…!

అప్పుడే నవ్వుతాం. అంతలోనే ఏడుస్తాం.ఎంత బావుంటుంది. కానీ ఇలా ఎప్పుడుంటాం. చిన్నప్పుడే. పెద్దయ్యాక, ఏదీ పెద్ధగా చెయ్యం. పెదవులు పెద్దగా కదప కుండా నవ్వాలని, కళ్ళు పెద్దగా తడవకుండా ఏడ్వాలనీ ప్రయత్నిస్తాం.కడకు నవ్వని,ఏడ్వని నాగరీకులంగా మారిపోతాం. గాంభీర్యం అంతటా వచనంలా ఆక్రమించుకుంటుంది. కడకు జీవితంలోంచి ముఖ్యమయినది ఒకటి ఎగిరిపోతుంది. ఏమిటది