Tag: స్పర్శ

వైర్ లెస్..!

చిన్న చిటికెన వేలు. ఎవరిదయినా కావచ్చు. కట్టుకట్టి వుంటుంది. గాయం ఎక్కడో వుంటుంది. కట్టు లోపలి, గాజు గుడ్డ లోపలి, దూది లోపలి, టింక్చర్‌ మరకల లోపల ఎక్కడో…! కనిపించనే కనిపించదు. కానీ తెగి వుంటుందన్న ఊహ; రెండు మూడు బొట్లు నెత్తురు కారి వుంటుందన్న ఎరుక! ఈ పిల్లెవరో ఏడ్చే వుంటుంది.

మోహ ఫలం

కరచాలనమొక స్పర్శ. కౌగలింత మహా స్పర్శ. ముద్దు మహోన్నత స్పర్శ. అవును. దేశ భాషలందు ‘దేహ భాష’ లెస్స. తల్లి తల నిమిరినా, తండ్రి గుండెలకు హత్తుకున్నా, గురువు వెన్ను తట్టినా, ప్రియురాలు ఒంటికి ఒంటిని అంటుకట్టినా స్పర్శే కదా! మనిషిని మనిషి తాకవద్దన్నవాడు ‘దేహ’ద్రోహి!తాకని తనాన్ని వెలి వేద్దాం.