పేరు : విజయ శాంతి దరఖాస్తు చేయు ఉద్యోగం: రాములమ్మ-2 ( ఏం ‘బాహుబలి-2 సినిమా వస్తే చూడలేదా? తెలుగు తెర మీద వున్న ఏకైక ‘లేడీ హీరో’ని ‘సీక్వెల్’ రాజకీయాల్లో ఇస్తున్నా. చూడలేరా..?) వయసు : ‘ఫైట్స్’ చేసే వయసే. వృధ్ద హీరోలు ఎడమ చేత్తో లారీలనూ, ట్రాక్టర్లను ఎత్తేసినప్పుడు ఈ సందేహం రాదు.…
Tag: chiranjeevi
‘తూచ్..! నేనొప్పుకోను!!’
‘నేను ప్రేమించేది నిన్ను…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు నిమిషాలు ఆగి, ఊపిరి పీల్చుకుని ‘కాదు’ అని నచ్చిన అమ్మాయి ప్రకటిస్తే ఏమవుతుంది? ఒక్క ‘కామా’ చాలు పేషెంటును ‘కోమా’లోకి పంపించేయటానికి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆమె ప్రియుడు ఆమె కోసం ప్రాణం విడవటానికి ఒక్క నిమిషం చాలు. కానీ, ఆమే… అనవసరంగా మాట తిప్పుకోవటానికి రెండు నిమిషాలు తీసుకుంది.
రాష్ట్రవిభజన విషయంలో పార్టీలు దాదాపు అలాగే మాట తిప్పాయి.
‘విభజనకు మేము అనుకూలం…’ అనేసి, తర్వాత ‘కామా’ పెట్టి, రెండు వారాలు ఆగి, ఊపిరి సలపక, ‘కాదు’ అని ప్రకటించాలని చూస్తున్నాయి.
సి ఫర్ ‘కాపు’ చంద్రయ్య!
పేరు : సి(చెన్నంశెట్టి). రామచంద్రయ్య
ముద్దు పేరు : సి ఫర్ ‘కాపు’ చంద్రయ్య.(కాపులను బీసీలో చేర్చాలని కోరుతున్నాను.)
విద్యార్హతలు : లెక్కల్లో మనిషిని.(ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్‌ను లెండి.) ఇప్పుడు కూడా లెక్కలు తప్పటం లేదు. కాపులు+బీసీలు= కాంగ్రెస్ అని అంటున్నాను. (సీమాంధ్రలో రెడ్లూ, దళితులూ వైయస్సార్ కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు కదా! అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చిరునామా మిగలాలంటే నా ‘లెక్క’ను పాటించాల్సిందే. (కాపుల్ని కూడా బీసీల్లో కలిపేస్తే మొత్తం బీసీలయిపోతారు.)
‘కాపు’దలలో కాంగ్రెస్ వుంటుందా?
కులం ఉందంటే ఉంది; లేదంటే లేదు. కాలేజీ ‘ఫ్రెండ్‌షిప్పు’ల్లో ఒక్కొక్క సారి కులం నిపించదు. కానీ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ వచ్చేసరికి- కులం ఎలా వచ్చేస్తుందో వచ్చేస్తుంది. అదేమి విచిత్రమో కానీ, తాను ‘ప్రేమించిన అమ్మాయిది తన కులమే- అని తేలుతుంది'( తనకులానికి చెందిన అమ్మాయి మీదనే తనకు మనసు మళ్ళింది- అని చెబితే అసహ్యంగా వుండదూ! అందుకని ఇలా అనుకోవటంలో ఓ తృప్తి వుంది)
నేనెరుగ, నేనేరుగ…నా నేత నడుగు!
కయ్యానికి చిరు- నెయ్యానికి కెవిపి!
ఏ కాంగ్రెస్ ను వోడిస్తానని తొడలు చరిచారో, అదే కాంగ్రెస్‌కు ద్రోహం జరుతోందని కుమిలి పోయారు. రెండు పాత్రలూ ఒకే హీరో పోషించారు. మామూలు హీరో కాదు. ‘మెగా’ హీరో చిరంజీవి. తొడలు చరిచినప్పుడు ‘ప్రజారాజ్యం’ వ్యవస్థాపకుడు. కుమిలి పోయినప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. కొందరు ‘ఇక్కడి(కాంగ్రెస్) తిండి తిని, అక్కడి( వైయస్సార్ కాంగ్రెస్) పాట పాడుతున్నానన్నారు. ఇదే సామెతను ఆయనకు అనువుగా పేరడీ చేయవచ్చు. ‘అక్కడి( ప్రజారాజ్యం) వోటుతో గెలిచి, ఇక్కడి(కాంగ్రెస్) సీటులో కూర్చున్నారు’ అని.
నటనలు చాలించరా!
నటనే కదా-ఎక్కడయినా అనుకుని నటులు రాజకీయాల్లోకి దిగిపోతారు. ఆ తర్వాత తెలుస్తుంది- తేడా. అది సాంఘికానికీ, పౌరాణికానికీ వుండే మామూలు తేడా కాదు. ఇక్కడా ‘లైట్స్, కెమెరా’ వుంటాయి. కానీ తర్వాత ‘యాక్షన్’ వుండదు. ‘రియాక్షన్ ‘ వుంటుంది. నటనకు మెచ్చి ‘ఆస్కార్’ ఎవ్వరూ ఇవ్వరిక్కడ. ఇస్తే గిస్తే, ‘తిరస్కారే’. ‘నింద’ వస్తుందేమో కానీ, కనీసం ‘నంది’ కూడా రాదు.