Tag: evolution

ఎవెల్యూషన్

ఒక పండగ. ఒక పార్టీ. ఒక ఉత్సవం. అన్నీఘటనలే. ఆ పూటలో ముగిసేవే. అప్పటికప్పడు తెలివి వచ్చెయ్యటమూ, ఓవర్ నైట్ ప్రేమ పుట్టెయ్యటమూ, క్షణంలో జీవితం మీద విరక్తి కలిగెయ్యటమూ జరగవు. కడకు ప్రమోషన్లూ, డిసిమిసల్స్ కూడా అంతే. అందుకు సంబంధించిన ప్రోత్సాహమూ, కుట్రా ఎప్పటినుంచో వుండి వుంటాయి. అయినా అన్నీ అప్పటికప్పడు ఇన్ స్టెంట్ గా జరిగాయంటే అదో థ్రిల్. కాళిదాసు రాయగా రాయగా కవి అయ్యాడంటే చికాగ్గా వుంటుంది. సరస్వతి వచ్చి ఆయన నాలుక మీద ఒక్క క్షణంలో రాసి పోయిందంటే.. మహదానందంగా వుంటుంది.. ఘటనలమీద వున్న మోజు, ఎందుకనో పరిణామాల మీద వుండదు.